దళితులు విద్యావంతులైతేనే సమాజంలోని అసమానతలు తొలగి పోతాయని కేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ అన్నారు.
సాక్షి, న్యూఢిల్లీ: దళితులు విద్యావంతులైతేనే సమాజంలోని అసమానతలు తొలగి పోతాయని కేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ అన్నారు. దళిత సాహిత్య అకాడమీ 30వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం జరోదా గ్రామంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
భారతీయ దళిత సాహిత్య అకాడమీ 30వ జాతీయ సమావేశంలో ఏపీకి చెందిన కవి, రచయిత, పాత్రికేయుడు మట్టా ప్రభాత్‌కుమార్‌కు మహాత్మా జ్యోతిరావ్‌పూలే నేషనల్ ఫెలోషిప్ అవార్డు 2014ను ప్రదానం చేశారు. ఏపీలోని విజయవాడకు చెందిన ఆదిరాల జయప్రభు, కోట బాబురావు, ఎం. నాగేశ్వరావులు అంబేద్కర్ నేషనల్ ఫెలోషిప్ అవార్డులు అందుకున్నారు.