లాలూ కాలం చెల్లిన మందు: పాశ్వాన్ | lalu prasad is expired medicine, says Ram Vilas Paswan | Sakshi
Sakshi News home page

లాలూ కాలం చెల్లిన మందు: పాశ్వాన్

Published Tue, Nov 18 2014 7:38 PM | Last Updated on Sat, Jul 6 2019 12:42 PM

లాలూ కాలం చెల్లిన మందు: పాశ్వాన్ - Sakshi

లాలూ కాలం చెల్లిన మందు: పాశ్వాన్

ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఎన్నారైగా అభివర్ణించిన బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్కు ఒకనాటి ఆయన మిత్రుడు రాంవిలాస్ పాశ్వాన్ గట్టి ఝలక్ ఇచ్చారు. లాలూ ప్రసాద్ కాలం చెల్లిన మందులాంటి వారని, దానివల్ల దుష్ప్రభావాలు తప్ప ఉపయోగం ఏమీ ఉండదన్నారు. ఒకప్పుడు ఆర్జేడీకి మిత్రపక్షంగా ఉన్న ఎల్జేపీ.. ఇప్పుడు బీజేపీకి సన్నిహితంగా వెళ్లిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు ఆ పార్టీ అధినేత పాశ్వాన్ మోదీ మంత్రివర్గంలో ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రిగా ఉన్నారు. తన పాత మిత్రుడిని ఆయన కాలం చెల్లిన మందుగా వర్ణించారు. ఆయన కుమారుడు, ఎంపీ చిరాగ్ మరో అడుగు ముందుకేసి, లాలూజీ ఆరోగ్యం బాగోలేదని, ఆయన ఇక విశ్రాంతి తీసుకోవాలని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement