expired medicine
-
ప్రైవేటు ఆసుపత్రి నిర్వాకం: రోగికి కాలం చెల్లిన మందులు
సాక్షి, ఆదిలాబాద్ టౌన్: జిల్లాలో ప్రైవేట్ ఆస్పత్రుల ఆగడాలు మితిమీరుతున్నాయి. వేలకు వేలు ఫీజులు వసూలు చేయడమే కాకుండా కాలం చెల్లిన మందులను అంటగట్టి పేషంట్ల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి అనుమతి లేనప్పటిట్లిటీవలి వరకు వైద్యం కొనసాగించారు. వైద్యులు లేకుండానే సిబ్బందే మందులు ఇచ్చిన వ్యవహారం కూడా బయటపడిన విషయం తెలిసిందే. కాగా మంగళవారం ఆదిలాబాద్ పట్టణంలోని తాంసి బస్టాండ్ ప్రాంతంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో రోగికి కాలం చెల్లిన మందులు ఇవ్వడం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ మందులు వాడటంతో పేషంట్‌కు వాంతులు, విరేచనలు అయ్యాయి. దీంతో కుటుంబ సభ్యులు రాత్రి 10గంటల ప్రాంతంలో ఆస్పత్రిలో ఆందోళనకు దిగారు. ఇంద్రవెల్లి మండలం ఆంద్గూడకు చెందిన షెల్కే సావిత్రిబాయి గర్భసంచి ఆపరేషన్ కోసం జిల్లా కేంద్రంలోని తాంసి బస్టాండ్ ప్రాంతంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఈనెల 10న చేరింది. అదేరోజు సాయంత్రం ఆమెకు వైద్యులు శస్త్ర చికిత్స చేశారు. మందులతో పాటు ఆపరేషన్ ఖర్చు కోసం రూ. 30వేలు చెల్లించాలని వైద్యులు సూచించడంతో ఒప్పుకున్నారు. మరుసటి రోజు ఉదయం ఆమెకు ఓ పౌడర్‌ను ఇచ్చారు. మధ్యాహ్నం విపరీతమైన వాంతులు, విరేచనాలు అయ్యాయని బాధితురాలి కుటుంబీకులు తెలిపారు. 2016 సంవత్సరానికి సంబంధించి కాలం చెల్లిన మందులు ఇచ్చారు. దీంతో డాక్టర్‌ను సంప్రదించగా.. క్షమించండి వేరే మందులు ఇస్తామని తెలిపినట్లు పేర్కొన్నారు. ఆ తర్వాత మరో పౌడర్ ఇచ్చినప్పటికీ ఆ పౌడర్లు కూడా 2017, 2020కు సంబంధించినవి కావడంతో మెడికల్ షాపు వారితో వాగ్వాదానికి దిగారు. ఇవి మా ఇంట్లో తయారు కావని, కంపెనీ నుంచి వచ్చినవే ఇస్తున్నట్లు వైద్యులతో పాటు మెడికల్ సిబ్బంది తెలిపినట్లు పేర్కొన్నారు. బాధితురాలి భర్త బలిరాం టూటౌన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ విషయమై డీఎంహెచ్ఓను వివరణ కోరగా తమకు ఫిర్యాదు చేస్తే విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. చదవండి: హాస్టల్లో ఉండలేనమ్మా!, 10 నిముషాల్లోనే ఘోరం 4 నెలల క్రితం అదృశ్యం.. పేడ దిబ్బలో అస్థిపంజరం -
రిమ్స్ సిబ్బంది నిర్లక్ష్యం.. రోగికి గడువు ముగిసిన సెలైన్
ఒంగోలు సెంట్రల్: స్థానిక రిమ్స్‌లో వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించి గడువు ముగిసిన సెలైన్‌ను రోగికి ఎక్కించారు. రోగి తరుపు వారు ఈ విషయాన్ని గుర్తించి వైద్య సిబ్బంది దృష్టికి తీసుకువెళ్లడంతో అప్పటికప్పుడు దానిని మార్చివేశారు. ఈతముక్కలకు చెందిన జి. శ్రీను అనే వ్యక్తి ఈ నెల 4వ తేదీన కడుపునొప్పితో బాధపడుతూ రిమ్స్‌లో వైద్య చికిత్స నిమిత్తం చేరాడు. పరీక్షించిన వైద్యులు రోగిని చికిత్స నిమిత్తం వైద్యశాలలో చేర్చారు. అయితే వైద్య సిబ్బంది గడువు ముగిసిన సెలైన్ ఇంజెక్షన్‌ను రోగికి ఎక్కిస్తున్నారు. బుధవారం రోగి తరఫు వారు ఈ విషయాన్ని గమనించి వైద్య సిబ్బంది దృష్టికి తీసుకువచ్చారు. ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎలా అని సిబ్బందిని నిలదీశారు. దీంతో వైద్య సిబ్బంది గడువు ముగిసిన సెలైన్‌ను తీసిశారు. పక్క వారికి కూడా ఇదే ఇంజెక్షన్లను ఇస్తుండటంతో ఈ విషయాన్ని కూడా వైద్య సిబ్బంది దృష్టికి తీసుకెళ్లారు. -
వైద్యం.. తూతూమంత్రం
ప్రొద్దుటూరు టౌన్ : మండలంలోని అమృతానగర్‌లో ఎలాంటి సమాచారం లేకుండా వైద్యశిబిరం నిర్వహించడం పట్ల స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఎవరికీ చెప్పకుండా వైద్యశిబిరం పెడితే ఎవరు వస్తారని స్థానికులు డాక్టర్‌ను ప్రశ్నించారు. నాకు తెలియదు ఇక్కడికి వెళ్లమని ఫోన్ వస్తే వచ్చా అని డాక్టర్ చెప్పడంతో ప్రజలు అవాక్కయ్యారు. అక్కడ ఉన్న మందుల్లో ఆప్లాస్పిన్ ఎరల్– ఐపి టానిక్ (యాంటిబయాటిక్) మందు 2015 నవంబర్‌లో తయారు చేయగా 2017 అక్టోబర్‌తో కాలం ముగియనుంది. అంటే మరో 12 రోజుల గడువు ఉంది. అలాగే క్లోరోక్లిన్ టాబ్లెట్ 2015లో తయారుచేయగా 2017 నవంబర్ నెలతో కాలం ముగియనుంది. ఇలా మరి కొన్ని మందులు కూడా తక్కువ కాలం గడువు కలిగినవి వైద్య శిబిరానికి తీసుకొచ్చారు. దీన్ని బట్టి చూస్తే ప్రజల ఆరోగ్యంపై వైద్యాధికారులకు ఎంత శ్రద్ధ ఉందో అర్థమవుతోంది. కల్లూరు పీహెచ్సీ నుంచి తీసుకొచ్చిన మందులు ఔట్ సోర్సింగ్ కింద పని చేస్తున్న ఏఎన్ఎంలు మరియమ్మ, యశోదలు మండల పరిధిలో ఉన్న కల్లూరు పీహెచ్సీ నుంచి మందులను తీసుకొచ్చారు. డిప్యుటేషన్‌పై కల్లూరు పీహెచ్సీలో పని చేస్తున్న ఔట్సోర్సింగ్ ఏఎన్ఎం మరియమ్మను ఇక్కడ నియమించారు. ప్రతి రోజు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న కల్లూరు నుంచి అమృతానగర్‌కు రావాలంటే కష్టంగానే ఉందని వాపోతోంది. ప్రభుత్వం ఇచ్చే జీతం డబ్బులోనే చార్జీలు పెట్టుకోవాల్సి వస్తోందని అంటోంది. ఏ వసతులు లేక పోయినా ఆరోగ్య ఉపకేంద్రంలో పని చేయాల్సిన పరిస్థితి సిబ్బందికి ఏర్పడింది. -
లాలూ కాలం చెల్లిన మందు: పాశ్వాన్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఎన్నారైగా అభివర్ణించిన బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్‌కు ఒకనాటి ఆయన మిత్రుడు రాంవిలాస్ పాశ్వాన్ గట్టి ఝలక్ ఇచ్చారు. లాలూ ప్రసాద్ కాలం చెల్లిన మందులాంటి వారని, దానివల్ల దుష్ప్రభావాలు తప్ప ఉపయోగం ఏమీ ఉండదన్నారు. ఒకప్పుడు ఆర్జేడీకి మిత్రపక్షంగా ఉన్న ఎల్జేపీ.. ఇప్పుడు బీజేపీకి సన్నిహితంగా వెళ్లిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ పార్టీ అధినేత పాశ్వాన్ మోదీ మంత్రివర్గంలో ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రిగా ఉన్నారు. తన పాత మిత్రుడిని ఆయన కాలం చెల్లిన మందుగా వర్ణించారు. ఆయన కుమారుడు, ఎంపీ చిరాగ్ మరో అడుగు ముందుకేసి, లాలూజీ ఆరోగ్యం బాగోలేదని, ఆయన ఇక విశ్రాంతి తీసుకోవాలని అన్నారు.