సాక్షి,న్యూఢిల్లీ: దివంగత ఎంపీ రామ్ విలాస్ పాశ్వాన్‌కు కేటాయించిన 12 జన్‌పథ్ బంగ్లాలో నివసిస్తున్న ఆయన కుమారుడు, లోక్‌సభ ఎంపీ చిరాగ్ పాశ్వాన్‌ను ఆ ఇంటి నుంచి ఖాళీ చేయాల్సిందిగా కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నోటీసులు జారీ చేసింది. ఈ ఇంటినే ప్రస్తుతం లోక్‌జనశక్తి పార్టీ తమ పార్టీ కార్యకలాపాల కోసం ఉపయోగించుకుంటోంది. దాదాపు 30 ఏళ్ల క్రితం నుంచి చిరాగ్ తండ్రి రామ్ విలాస్ పాశ్వాన్ ఈ ఇంట్లో నివసించారు. ఆయన గతేడాది అక్టోబర్లో మరణించారు.
కాగా ఇల్లు మారాల్సిందిగా ప్రభుత్వం ఇచ్చిన నోటీసులపై చిరాగ్ పాశ్వాన్ స్పందించలేదు. ప్రస్తుతం ఈ ఇంట్లో రామ్ విలాస్ భార్య, చిరాగ్‌పాశ్వాన్ కుటుంబ సభ్యులు నివసిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment