రాం విలాస్ పాశ్వాన్ (ఫైల్‌పోటో)
సాక్షి, న్యూఢిల్లీ : అగ్రవర్ణ పేదలకూ రిజర్వేషన్ వర్తింపచేయాలనే డిమాండ్‌కు సానుకూల స్పందన లభిస్తోంది. అగ్రవర్ణ పేదలకు 15 శాతం రిజర్వేషన్ కల్పించాలని కేంద్ర మంత్రి, లోక్‌జనశక్తి పార్టీ చీఫ్ రాం విలాస్ పాశ్వాన్ అన్నారు. సెక్యులరిజం, మత సామరస్యంతో పాటు పేదలకు అధికార ఫలాలు దక్కాలనేది తమ పార్టీ అభిమతమని చెప్పారు. ‘అగ్రవర్ణాల్లో పెద్దసంఖ్యలో పేదలున్నారు..వారు చేసేందుకు ఎలాంటి పని దొరకడం లేదు..అందుకే వారికి 15 శాతం కోటా కల్పించాలని తాను డిమాండ్ చేస్తున్నా’నన్నారు.
పార్టీ కార్మిక విభాగం భేటీ నేపథ్యంలో పాశ్వాన్ ఈ వ్యాఖ్యలు చేశారు. పని లభించని వారికి నిరుద్యోగ భృతి ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ పోస్టుల అవుట్‌సోర్సింగ్‌తో ఆయా వర్గాలకు కల్పించిన రిజర్వేషన్ ప్రయోజనాలకు విఘాతం కలుగుతోందని పాశ్వాన్ ఆందోళన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment