upper caste poor
-
ఏపీలో ఆర్థికంగా వెనుకబడినవారి కోసం కొత్త సంక్షేమ శాఖ
-
అగ్రవర్ణ పేదల సంక్షేమానికి ప్రత్యేక శాఖ
-
AP: అగ్రవర్ణ పేదల సంక్షేమానికి ప్రత్యేక శాఖ
సాక్షి, అమరావతి: ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణ పేదల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శాఖను ఏర్పాటు చేసింది. ఈడబ్ల్యూఎస్ సంక్షేమ (ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు) శాఖను ఏర్పాటు చేస్తూ సాధారణ పరిపాలన శాఖ మంగళవారం ఉత్తర్వులిచ్చింది. ఈ శాఖ పరిధిలోకి కమ్మ,రెడ్డి, బ్రాహ్మణ, క్షత్రియ, కాపు, ఆర్య వైశ్య కార్పొరేషన్లు రానున్నాయి. అలాగే జైన్ల సంక్షేమానికి, సిక్కుల సంక్షేమానికి వేర్వేరు కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తూ రెండు జీవోలను జారీ చేసింది. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో వీటి ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. (చదవండి: Rain Alert: ఏపీలో భారీ వర్షాలు) -
Andhra Pradesh: అగ్రవర్ణ పేదలకు దన్ను
రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధి కోసం పలు ప్రాంతాల్లో హోటళ్లు, రిసార్ట్‌ల నిర్మాణం కోసం పర్యాటక శాఖకు భూముల అప్పగింతకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాల విస్తరణ, సంస్కృత, వేద పాఠశాలల ఏర్పాటు కోసం శారదా పీఠం, దత్త పీఠం, ఇస్కాన్ చారిటీస్లకు భూములను కేటాయించింది. సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన ప్రజలను ఆదుకోవడం కోసం ఈడబ్ల్యూఎస్ (ఆర్థికంగా వెనుకబడిన వర్గాల) సంక్షేమం పేరుతో ప్రత్యేక శాఖ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. బ్రాహ్మణ, కాపు, క్షత్రియ, కమ్మ, రెడ్డి, ఆర్య వైశ్య తదితర వర్గాల్లో నిరుపేదలను ఆదుకోవడం కోసం ఇప్పటికే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్పొరేషన్లను ఈడబ్ల్యూఎస్ సంక్షేమ శాఖ పరిధిలోకి తేవాలని నిర్ణయించింది. జైన్లు, సిక్కుల సంక్షేమం కోసం ప్రత్యేకంగా జైన్ కార్పొరేషన్, సిక్కు కార్పొరేషన్ ఏర్పాటు చేయనుంది. పద్మ, ఆది వెలమ సామాజిక వర్గాల్లోని నిరుపేదలను ఆదుకోవడం కోసం ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేయడానికి వీలుగా ప్రతిపాదనను మంత్రివర్గం ముందు పెట్టాలని అధికారులను ఆదేశించింది. గురువారం వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో సీఎం జగన్ అధ్యక్షతన మంత్రివర్గం సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆ వివరాలను సమాచార శాఖ మంత్రి పేర్ని నాని విలేకరులకు వెల్లడించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. (చదవండి: 'గంజాయి'పై కదిలిన గ్రామ చైతన్యం) కొలువుల జాతర ► వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలో 1285, వైఎస్సార్ అర్బన్ హెల్త్ క్లినిక్‌లలో 560 ఫార్మసిస్టులు, వైద్య విద్య శాఖలో బోధన, నర్సింగ్, పారామెడికల్ విభాగాల్లో 2,190 వెరసి 4,035 ఉద్యోగాలను కొత్తగా సృష్టించి.. నియామకాలు చేపట్టడానికి మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ► వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలో 41,308 ఉద్యోగాలను భర్తీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. 2019 జూన్ నుంచి ఇప్పటిదాకా 26,917 మంది ఉద్యోగులను నియమించింది. మిగతా 14,391 ఉద్యోగుల నియామకాల్లో భాగంగా∙ఈ నిర్ణయం తీసుకుంది. బీసీ జన గణన ► 2021 జనాభా లెక్కల ఆధారంగా బీసీ జన గణన చేయాలని కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టే అధికారాన్ని బీసీ సంక్షేమ శాఖ మంత్రికి అప్పగిస్తూ మంత్రివర్గం తీర్మానం చేసింది. ► దేశానికి స్వాతంత్య్రం రాక ముందు 1931లో మాత్రమే కులాల ప్రాతిపదికన జన గణన చేశారు. అందు వల్ల ఆ వర్గాల జనాభా ఎంతన్నది తేల్చలేకపోతున్నారు. ఈ దృష్ట్యా బీసీ జన గణన చేపట్టడం ద్వారా శాస్త్రీయంగా వర్గాల జనాభాను తేల్చి.. ఆ మేరకు ఆ వర్గాల ప్రజల అభ్యున్నతికి నిధులు కేటాయించవచ్చన్నది మంత్రివర్గం భావన. అమ్మ ఒడికి 75 శాతం హాజరు ► అమ్మ ఒడి పథకం కింద 2022 జూన్‌లో విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.15 వేల చొప్పున జమ చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. 2021 నవంబర్ 8 నుంచి 2022 ఏప్రిల్ 30 వరకు పాఠశాలల్లో 130 పని దినాల్లో 75 శాతం హాజరు ఉంటేనే ఈ పథకాన్ని వర్తింపజేస్తారు. ► 2019–20, 2020–21 విద్యా సంవత్సరాల్లో కరోనా ప్రభావం వల్ల హాజరు శాతం నుంచి మినహాయింపు ఇచ్చారు. ఈ పథకం స్ఫూర్తిపై ప్రజల్లో విస్తృత ప్రచారం చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. అర్హులందరికీ సంక్షేమ ఫలాలు ► వృద్ధాప్య పెన్షన్, ఇంటి స్థలం, వైఎస్సార్ ఆసరా, చేయూత.. తదితర ఏ సంక్షేమ పథకం కిందైనా అర్హత ఉండి.. లబ్ధి చేకూరని వారితో జనవరి నుంచి మే వరకు దరఖాస్తు తీసుకుంటారు. వాటిని పరిశీలించి.. అర్హత ఉన్నట్లు తేలితే జూన్‌లో ప్రయోజనం చేకూర్చుతారు. ► ఇదే రీతిలో జూలై నుంచి నవంబర్ వరకు దరఖాస్తులు స్వీకరించి.. అర్హత ఉన్న వారికి డిసెంబర్లో లబ్ధి కల్పిస్తారు. పర్యాటక రంగ అభివృద్ధి దిశగా.. ► రాష్ట్రంలో పర్యాటక రంగ విస్తరణకు మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. చిత్తూరు జిల్లా పేరూరు, విశాఖ జిల్లా అన్నవరం, వైఎస్సార్ జిల్లా గండికోట, చిత్తూరు జిల్లా హార్స్లీ హిల్స్, తూర్పుగోదావరి జిల్లా పిచ్చుకలంకలో.. మొత్తంగా ఈ 5 ప్రాంతాల్లో లగ్జరీ రిసార్ట్‌ల నిర్మాణానికి పర్యాటక శాఖకు భూమి అప్పగింతకు మంత్రివర్గం ఆమోదం. ఈ ఐదు చోట్ల రూ.1,350 కోట్లతో ఓబెరాయ్ విలాస్ పేరుతో ఒబెరాయ్ సంస్థ 7 స్టార్ సదుపాయాలతో లగ్జరీ రిసార్టులను నిర్మించనుంది. తద్వారా 10,900 మందికి ఉద్యోగాలు వస్తాయి. ► భీమిలిలో రూ.350 కోట్లతో మరో టూరిజం ప్రాజెక్ట్. 7 స్టార్ సదుపాయాలతో రిసార్ట్ నిర్మాణం. 5500 మందికి ఉద్యోగాల కల్పన. ► తిరుపతిలో రూ.250 కోట్లతో టూరిజం ప్రాజెక్ట్. తద్వారా 1500 మందికి ఉద్యోగాలు. ► చిత్తూరు జిల్లా కొత్తకోటలో రూ.250 కోట్లతో మరో ప్రాజెక్టుకు, తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురంలో రూ.250 కోట్లతో మరో టూరిజం ప్రాజెక్టుకు ఆమోదం. విశాఖ జిల్లా శిల్పారామం బీచ్ వద్ద, తాజ్ వరుణ్ బీచ్ వద్ద టూరిజం ప్రాజెక్టులకు ఆమోదం. విజయవాడలో పార్క్ హయత్ ప్రాజెక్టుకు ఆమోదం. వీటికి పర్యాటక విధానం కింద రాయితీలకు అంగీకారం. రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆన్లైన్లో సినిమా టికెటింగ్ ఆంధ్రప్రదేశ్ సినిమాల రెగ్యులేషన్ చట్టం–1955 సవరణకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇండియన్ రైల్వే ఆన్లైన్ టికెట్ వ్యవస్థ తరహాలో సినిమా టికెట్లను ఆన్లైన్లో జారీ చేయడానికి పోర్టల్‌ను ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిల్మ్, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అభివృద్ధి చేసి, ఈ సంస్థే నిర్వహించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 1094 థియేటర్లు ఉన్నాయి. వాటిలో ఫోన్‌కాల్, ఇంటర్నెట్, ఎస్ఎంఎస్ ద్వారా టికెట్లను బుక్ చేసుకునే సౌకర్యం ప్రేక్షకులకు కల్పించనుంది. థియేటర్ల వద్ద ట్రాఫిక్ అవాంతరాలను తొలగించడానికి, ప్రేక్షకులకు సమయం ఆదా చేయడానికి, పన్నులు ఎగ్గొట్టడాన్ని నివారించడానికి ఈ విధానం దోహదపడుతుంది. (చదవండి: ఆ.. నకిలీ సిగరెట్లు ఎవరివో? ) మరిన్ని కీలక నిర్ణయాలు ఇలా.. ► రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజైన నవంబర్ 1న వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్మెంట్, వైఎస్సార్ అచీవ్మెంట్ అవార్డుల ప్రదానం. ► పాల సేకరణలో వినియోగిస్తున్న పరికరాలు, వస్తువుల తనిఖీ బాధ్యతలు, విధులు తూనికలు కొలతల శాఖ నుంచి పశుసంవర్ధక శాఖకు బదిలీ. వాటిని తనిఖీ చేసే అధికారం పశు వైద్యులకు అప్పగింత. ► సీఎం వైఎస్ జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరంలో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు. ఇందులో కొత్తగా 19 మంది ఉద్యోగుల నియామకానికి అనుమతి. ► వ్యవసాయానికి పగటి పూట తొమ్మిది గంటలు నిరంతరాయంగా నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను సరఫరా చేసేందుకు ఏటా 7 వేల మెగావాట్ల విద్యుత్‌ను యూనిట్ రూ.2.49కే కొనుగోలు చేస్తూ కేంద్ర ప్రభుత్వ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో ఒప్పందానికి ఆమోదం. 25 ఏళ్ల పాటు ఈ సంస్థ విద్యుత్‌ను సరఫరా చేయనుంది. తద్వారా ఏటా రూ.2 వేల కోట్లు ఆదా. ► విశాఖ జిల్లా భీమిలి మండలం కొత్తవలసలో విశాఖ శారదా పీఠానికి 15 ఎకరాలు కేటాయింపు. సంస్కృత పాఠశాల, వేద విద్య పాఠశాల సహా పలు ఆధ్యాత్మిక కార్యక్రమాల విస్తరణకు ఈ భూమిని శారదాపీఠం వినియోగించనుంది. మార్కెట్ విలువ ప్రకారం ఎకరా రూ.1.5 కోట్ల చొప్పున కేటాయించింది. ► అనంతపురం జిల్లా రాప్తాడు మండలం బొమ్మపర్తి గ్రామంలో గుండ్లూరు జయలక్ష్మి నరసింహ శాస్త్రి ట్రస్టు(దత్తపీఠం) కు 17.49 ఎకరాలు కేటాయింపు. ఈ ట్రస్టు ఇక్కడ వేద పాఠశాల, సంస్కృత పాఠశాల ఏర్పాటు చేయనుంది. ► అనంతపురం జిల్లా పెనుకొండలో ఇస్కాన్ ఛారిటీస్ ఆధ్వర్యంలో జ్ఞానగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం పాదప్రాంతంలో ఆధ్యాత్మిక కేంద్రం ఏర్పాటుకు లీజు ప్రాతిపదికన 75 ఎకరాల భూమి కేటాయింపు. ► చిత్తూరు జిల్లా నగరిలో ఏరియా ఆసుపత్రి కోసం ప్రభుత్వ భూమి మార్పిడికి ఆమోదం. ► విజయనగరం ఇంజనీరింగ్ కళాశాల స్థానంలో గురజాడ జేఎన్టీయూ.. ప్రకాశం జిల్లాలో ఆంధ్ర కేసరి విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ఆర్డినెన్స్ జారీకి గ్రీన్ సిగ్నల్. ► కర్నూలు జిల్లాలో సిల్వర్ జూబ్లీ కళాశాల నేతృత్వంలో క్లస్టర్ యూనివర్సిటీ ఏర్పాటుకు దిన్నెదేవరపాడు వద్ద 50 ఎకరాల కేటాయింపు. ► కృష్ణా జిల్లా నూజివీడులో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు 7 ఎకరాల కేటాయింపు. ► వాసవి కన్యకాపరమేశ్వరి చౌల్ట్రీలు, అన్నదాన సత్రాల నిర్వహణ దేవదాయ శాఖ నుంచి తప్పించి, ఆర్యవైశ్యులకే అప్పగింత. (పాదయాత్రలో హామీ మేరకు) ► విశాఖపట్నం జిల్లా మధురవాడలో 200 మెగావాట్ల డేటా సెంటర్ పార్క్, బిజినెస్ పార్క్, స్కిల్ యూనివర్సిటీల ఏర్పాటుకు అదానీ ఎంటర్‌ప్రైజస్‌కు 130 ఎకరాల భూమి కేటాయింపు. ఇందులో ఆ సంస్థ రూ.14,634 కోట్లను పెట్టుబడిగా పెట్టనుంది. తద్వారా ప్రత్యక్షంగా 24,990 మందికి ఉద్యోగాలు కల్పించనుంది. ► వైఎస్సార్ కడప జిల్లాలో రూ.227.1 కోట్ల వ్యయంతో ఐదు ఎత్తిపోతల ద్వారా హంద్రీ–నీవా, గాలేరు–నగరి ప్రాజెక్టుల నుంచి చెరువులను నింపేందుకు ఆమోదం. ► మూడు కొత్త ఆక్వాకల్చర్ ప్రాజెక్టుల కోసం 6 రెగ్యులర్ పోస్టులు డిప్యూటేషన్ పద్ధతిలో, 67 పోస్టులు అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీకి అనుమతి. ► మండలి, శాసనసభల్లో కొత్త విప్‌లు వెన్నపూస గోపాల్‌రెడ్డి, చిర్ల జగ్గిరెడ్డిలకు కొత్త పేషీల ఏర్పాటు, సిబ్బంది నియామకానికి ఆమోదం. ► మావోయిస్టులతోసహా నిషేధిత సంస్థలపై నిషేధం మరో ఏడాది పొడిగింపు. ► వాడరేవు వద్ద ఫిషింగ్ హార్బర్ ఏర్పాటుకు ఆమోదం. రూ.2205 కోట్లతో రోడ్లకు మరమ్మతులు రాష్ట్రంలో ఆర్ అండ్ బీ పరిధిలోని రహదారుల మరమ్మతులను మంత్రివర్గం సమీక్షించింది. గతంలో ఏడాదికి స్టేట్ హైవేల మరమ్మతుకు రూ.300 కోట్లు, ఎండీఆర్ రోడ్ల మరమ్మతులకు రూ.వంద కోట్లు వెరసి రూ.400 కోట్లు ఖర్చు చేసేవారని అధికారులు వివరించారు. ఆర్ అండ్ బీ శాఖ పరిధిలోని 46 వేల కిలోమీటర్ల పొడవైన రోడ్లలో 8 వేల కిలోమీటర్ల మేర రోడ్లకు మరమ్మతులు చేయాలన్నారు. ఇందుకు రూ.2,205 కోట్లతో 1,176 పనులు చేపట్టామని చెప్పారు. ఇప్పటికే 40% పనులకు టెండర్లు పిలిచి, కాంట్రాక్టర్లకు అప్పగించామని, రాయలసీమలో పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు.. మిగిలిన 60 శాతం పనులకు నవంబర్‌లోగా టెండర్లు పూర్తి చేసి.. డిసెంబర్లో పనులు ప్రారంభించి.. వచ్చే మే లోగా పనులు పూర్తి చేయాలని మంత్రివర్గం అధికారులకు దిశానిర్దేశం చేసింది. (చదవండి: పర్యావరణహితంగా ‘వైఎస్సార్ స్టీల్’) -
అగ్రవర్ణ పేదలకూ నవరత్నాలతో భారీ లబ్ధి
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంక్షేమ పాలనలో రాష్ట్రంలో అగ్రవర్ణ పేదలందరికీ నవరత్నాల ద్వారా భారీ ఆర్థిక ప్రయోజనం చేకూరుతోంది. గతంలో ఏ ప్రభుత్వం కూడా అగ్రవర్ణ పేదలకు ఇలా సంక్షేమ పథకాలను అమలు చేసిన దాఖలాలు లేవు. తొలిసారిగా కులాల ప్రస్తావన లేకుండా కేవలం ఆర్థిక స్థోమతను పరిగణనలోకి తీసుకుంటూ ముఖ్యమంత్రి జగన్ సంక్షేమ పాలనను కొనసాగిస్తున్నారు. 2019 జూన్ నుంచి ఈ ఏడాది జనవరి వరకు రాష్ట్రంలో 1,62,84,820 మంది అగ్రవర్ణ పేదలకు (కాపులను మినహాయించి) నేరుగా నగదు బదిలీతోపాటు నగదు బదిలీయేతర పథకాల ద్వారా ఏకంగా రూ.16,514.95 కోట్ల మేర ఆర్థిక సాయం అందించారు. నవరత్నాల ద్వారా లబ్ధి పొందిన అగ్రవర్ణ పేదలు అత్యధికంగా పట్టణ ప్రాంతాల్లోనే ఉన్నారు. లబ్ధిదారుల ఎంపికకు పేదరికమే కొలమానమని.. కులం, మతం, ప్రాంతం, రాజకీయం, పార్టీలు కాదని ఆచరణలో అమలు చేసి చూపించిన తొలి సీఎం వైఎస్ జగన్. ఏ ప్రభుత్వానికైనా ప్రాథమిక సూత్రం పేదరిక నిర్మూలనే అవుతుంది. అందుకు అనుగుణంగానే లబ్ధిదారుల ఎంపిక జరిగింది. ఆప్రాతిపదికనే అగ్రవర్ణాల్లోనూ పేదలందరికీ సీఎం జగన్ సంక్షేమ ఫలాలు అందించారు. గత సర్కారు హయాంలో పెన్షన్, రేషన్ కార్డు కావాలంటే తొలుత ఏ పార్టీ అని ఆరా తీసేవారు. ఆ తరువాత ఏ కులం? అని ప్రశ్నించేవారు. తమ పార్టీ వారికి లేదంటే తమ కులం వారికే మంజూరు చేసేవారు. అది కూడా లంచం ఇస్తేనే తప్ప కనికరించేవారు కాదు. ఇప్పుడు అర్హతే ప్రామాణికంగా వివక్ష లేకుండా సంక్షేమ ఫలాలు అందుతుండటం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. చదవండి: బాలికల ఆరోగ్యంపై మరింత శ్రద్ధ: సీఎం జగన్ కన్నెత్తి చూడని జనం.. బాలయ్య చిర్రుబుర్రు -
మెడికల్ కాలేజీల్లో అగ్రకుల పేదలకు రిజర్వేషన్లు
సాక్షి, హైదరాబాద్ : అగ్రకులాల్లోని పేదల(ఈడబ్ల్యూఎస్)కు ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు సర్కారు రంగం సిద్ధం చేసింది. 2019–20 వైద్య విద్యాసంవత్సరం నుంచే ఈ రిజర్వేషన్లు వర్తింపజేసేందుకు చర్యలు చేపట్టింది. అందుకు అవసరమైన మార్గదర్శకాలను తెలంగాణ ప్రభుత్వం ఒకట్రెండు రోజుల్లో విడుదల చేసే అవకాశం ఉందని వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది నుంచే తప్పనిసరిగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించింది. ఉస్మానియా మెడికల్ కాలేజీలో 250 ఎంబీబీఎస్ సీట్లున్నాయని, అది గరిష్ట పరిమితి వరకు ఉండటంతో అక్కడ మాత్రం ఈడబ్ల్యూఎస్ కోటా అమలు కాదని ఆ శాఖ అధికారులు అంటున్నారు. మిగిలిన అన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోనూ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలవుతాయని చెబుతున్నారు. నూతనంగా విడుదల చేసే మార్గదర్శకాల్లో ఏడాదికి రూ. 8 లక్షలలోపు ఆదాయపు పరిమితి నిర్ణయించే అవకాశం ఉన్నట్లు వైద్య, ఆరోగ్య శాఖకు చెందిన ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇదే ఆదాయపు పరిమితి విధించిందని, రాష్ట్రంలోనూ పరిమితి నిర్ణయించే అవకాశముందని అంటున్నారు. ఈడబ్ల్యూఎస్ ధ్రువీకరణ పత్రాలను ఎలా ఇవ్వాలి.. ఎవరు ఇవ్వాలి.. అనే అంశాలపైనా మార్గదర్శకాల్లో సర్కారు స్పష్టత ఇచ్చే అవకాశముందని తెలిపారు. దీని ప్రకారం తెలంగాణలో ఎంతమంది అర్హులనేది కూడా స్పష్టత రానుంది. ఉత్తర్వులు వచ్చాకే ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి నోటిఫికేషన్... ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేస్తూ సర్కారు ఉత్తర్వులు జారీ చేశాక ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేస్తామని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయ వర్గాలు చెబుతున్నాయి. ఈ వారంలో నీట్ ఫలితాలు వెలువడిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు రాష్ట్రస్థాయి ర్యాంకులు వెల్లడికాలేదు. అవి రావడానికి మరో నాలుగైదు రోజుల సమయం పడుతుంది. ర్యాంకులు, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలుపై మార్గదర్శకాలు వచ్చాక ఈ నెల 20వ తేదీ నాటికి అడ్మిషన్ నోటిఫికేషన్ జారీ చేయాలని విశ్వవిద్యాలయం భావిస్తోంది. అయితే నోటిఫికేషన్ విడుదల చేయడానికి ఇంకా ఏడెనిమిది రోజులే ఉంది. ఈలోగా రాష్ట్రస్థాయి ర్యాంకులు రావడం, ఆ రిజర్వేషన్ల మార్గదర్శకాలు విడుదలైన తర్వాత ఆదాయ ధ్రువీకరణ పత్రాలు సంపాదించుకోవడం కష్టమైన వ్యవహారమే. అవసరమైతే నాలుగైదు రోజులు సమయం తీసుకొనైనా రిజర్వేషన్లు అమలు చేయాలన్నదే సర్కారు ఆలోచనగా ఉంది. ఈడబ్ల్యూఎస్ కోసం 300కు పైగా ఎంబీబీఎస్ సీట్లు... ఈడబ్ల్యూఎస్ వర్గాలకు 10 శాతం సీట్లను కేటాయిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం అమలు చేయాలంటే ఆచరణలో 25 శాతం సీట్లను పెంచాల్సి ఉంటుందని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఎంసీఐ మార్గదర్శకాల ప్రకారం ఎంబీబీఎస్ ప్రవేశాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలతోపాటు ఈడబ్ల్యూఎస్ వర్గాలకు కూడా రిజర్వేషన్లు కల్పించాల్సి ఉంది. ప్రస్తుత రిజర్వేషన్ల స్ఫూర్తిని కొనసాగిస్తూనే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వర్తింపజేయాలంటే 25 శాతం సీట్లను పెంచాల్సి ఉంటుందని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఆ ప్రకారం ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ ఎంబీబీఎస్ సీట్లకు అదనంగా 25 శాతం పెంచాల్సి ఉంటుంది. అగ్రవర్ణాల్లో ఆర్థికంగా బలహీనంగా ఉన్న వర్గాలకు రిజర్వేషన్లు కల్పిస్తూ ఇటీవల కేంద్రం తీసుకొచ్చిన చట్టాన్ని పరిగణనలోకి తీసుకొని రాష్ట్రంలోనూ అందుకు అనుగుణంగా ఉత్తర్వులు రానున్నాయి. నీట్లో అర్హత సాధించిన అగ్రవర్ణ పేద విద్యార్థులకు ఈడబ్ల్యూఎస్ ఎంతో ప్రయోజనం కలగనుంది. ఇప్పటికే రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య భారీగా పెరగగా, ఈఎస్ఐతో కలుపుకొని 25 శాతం పెంపుదల ప్రకారం మరో 312 ఎంబీబీఎస్ సీట్లు పెరిగే అవకాశముందని విశ్వవిద్యాలయం వర్గాలు చెబుతున్నాయి. -
కోటాపై విపక్షాల దుష్ప్రచారం: ప్రధాని
సాక్షి,చెన్నై : అగ్రవర్ణ పేదలకు జనరల్ కేటగిరీలో పది శాతం రిజర్వేషన్లు కల్పించడం అన్ని వర్గాల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందనేందుకు సంకేతమని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. అగ్రవర్ణ కోటాపై వివిధ రాజకీయ పార్టీలు చేస్తున్న దుష్ప్రచారం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తమిళనాడులోని తోపూర్‌లో ఆదివారం జరిగిన ర్యాలీలో ప్రధాని కోరారు. సమాజంలోని అన్ని వర్గాలకూ విద్య, ఉపాధి అవకాశాలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడిఉందన్నారు. ఇప్పటికే రిజర్వేషన్ ప్రయోజనాలు పొందుతున్న దళితులు, గిరిజనులు, ఓబీసీలపై ఎలాంటి ప్రభావం లేకుండా అగ్రవర్ణ పేదలకు కోటా వర్తింపచేయాలని తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. తమిళనాడులో కొన్ని రాజకీయ పార్టీలు తమ రాజకీయ ప్రయోజనం కోసం పది శాతం కోటాపై దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. కాగా అంతకుముందు కేరళలోని కొచ్చిలో బీపీసీఎల్‌లో ఇంటిగ్రేడెట్ రిఫైనరీ విస్తరణ కాంప్లెక్స్‌ను ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు.మరోవైపు తమిళనాడులోని మధురైలోనూ ఎయిమ్స్ ఆస్పత్రికి శంకుస్ధాపన చేశారు. -
తెలంగాణ, కేంద్ర ప్రభుత్వాలకు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (ఈడబ్ల్యూఎస్) విద్య, ఉపాధి అవకాశాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పించేలా ఇటీవల కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగానికి తీసుకొచ్చిన సవరణ చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు మంగళవారం విచారణకు స్వీకరించింది. వివరణ ఇవ్వాలని తెలంగాణ, కేంద్ర ప్రభుత్వాలకు ఉన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. ఈడబ్ల్యూఎస్ చట్టాన్ని కొట్టేయాలని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ సోమవారం ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఇందులో కేంద్ర న్యాయశాఖ కార్యదర్శి, కేంద్ర సామాజిక న్యాయశాఖ కార్యదర్శి, రాష్ట్ర న్యాయశాఖ కార్యదర్శిని ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈడబ్ల్యూఎస్ చట్ట సవరణ వల్ల రాజ్యాంగ మౌలిక స్వరూపం మారిపోతుందని పిటిషనర్ తెలిపారు. దీని వల్ల ఓపెన్ కాంపిటీషన్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి 10% రిజర్వేషన్లు కల్పించాల్సి ఉంటుందని తెలిపారు. రాజ్యాంగంలో ఎక్కడా కూడా ఆర్థిక వెనుకబాటుతనం ప్రస్తావన లేదని తెలిపారు. -
‘10 శాతం కోటా’పై కేంద్రానికి నోటీసులు
సాక్షి, చెన్నై/హైదరాబాద్: జనరల్ కేటగిరిలోని అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్ కల్పించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై మద్రాస్ హైకోర్టు సోమవారం విచారణ జరిపింది. ఫిబ్రవరి 18లోగా వివరణ ఇవాలంటూ కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్ కల్పించడాన్ని సవాల్ చేస్తూ తమిళనాడు డీఎంకే ఈ పిటిషన్ దాఖలు చేసింది. రిజర్వేషన్.. పేదరిక నిర్మూనలకు ఉద్దేశించిన కార్యక్రమం కాదని పిటిషన్లో పేర్కొన్నారు. సామాజికంగా వెనుబడి, ఎన్నో శతాబ్దాలుగా విద్యాఉద్యోగాలకు దూరంగా ఉన్న కులాల కోసం రిజర్వేషన్లు పెట్టారని వివరించారు. తెలంగాణ హైకోర్టులోనూ పిటిషన్ ఇటీవల కేంద్ర ప్రభుత్వం అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్ కల్పించడాన్ని సవాలు చేస్తూ తెలంగాణ హైకోర్టు పిటిషన్ దాఖలైంది. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఈ పిటిషన్ వేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 10 శాతం రిజర్వేషన్ల బిల్లు.. రాజ్యాంగానికి, రిజర్వేషన్ల స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ రిజర్వేషన్ బిల్లును వెంటనే రద్దు చేయాలని కోరారు. ఈ పిటిషన్‌పై రేపు హైకోర్టు విచారణ జరపనుంది. -
అమల్లోకి ‘పేదల’ 10% కోటా
న్యూఢిల్లీ: జనరల్ కేటగిరీలో ఉన్న ఆర్థికంగా వెనుకబడిన వర్గాల్లోని పేదలకు ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యావకాశాల్లో 10% రిజర్వేషన్లు కల్పించే చట్టం సోమవారం నుంచి అమల్లోకి వచ్చింది. ఈ 103వ రాజ్యాంగ సవరణ చట్టం 2019, జనవరి 14 నుంచి అమల్లోకి వచ్చినట్లు సామాజిక న్యాయ, సాధికారత మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న రిజర్వేషన్లకు అదనంగా 10% రిజర్వేషన్లు కల్పించాలని ఇందులో పేర్కొన్నారు. రాజ్యాంగంలోని 15, 16 అధికరణాలను సవరిస్తూ రూపొందించిన బిల్లును ఇటీవలే పార్లమెంటు ఆమోదించిన విషయం తెలిసిందే. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన పౌరుల అభివృద్ధి కోసం ప్రత్యేక నిబంధనలు రూపొందించుకునే అవకాశం రాష్ట్రాలకు కల్పిస్తూ ఒక క్లాజ్‌ను సంబంధిత అధికరణల్లో చేర్చారు. ఆర్థిక వెనుకబాటుతనానికి సంబంధించి కుటుంబ ఆదాయం, ఇతర సూచీల ఆధారంగా ప్రభుత్వం నిర్ధారించే వర్గాలను ఆర్థికంగా వెనుకబడిన వర్గాలుగా పరిగణిస్తారని చట్టంలో స్పష్టం చేశారు. -
ఇదీ ఈబీసీ కోటా కథ
ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు(ఈబీసీ) ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో పదిశాతం రిజర్వేషన్ ఇవ్వాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి ఎన్నో ఏళ్ల నేపథ్యం ఉంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కేటగిరీల కిందకు రాని అగ్రవర్ణ పేదలకు కోటా ఇవ్వాలనే డిమాండ్ 30 ఏళ్ల క్రితమే వచ్చింది. తాము కేంద్రంలో అధికారంలోకి వస్తే అగ్రకులాల పేదలకు రిజర్వేషన్ ఇస్తామని మొదట హామీ ఇచ్చిన రాజకీయ నేత బీఎస్పీ స్థాపకుడు కాన్షీరామ్. తర్వాత ఈ పార్టీ అధ్యక్షురాలు మాయావతి, ఎస్పీ నేత ములాయంసింగ్ యాదవ్ కూడా ఈ ప్రతిపాదనకు మద్దతు పలికారు. కేంద్రమంత్రి, ఆర్పీఐకి చెందిన రాందాస్ అఠావలే కూడా అనేక సందర్భాల్లో ఈ ప్రతిపాదనను సమర్థించారు. సిన్హో కమిషన్ సామాజికంగా వెనుకబడిన వర్గాలకు చెందని.. అగ్రవర్ణ పేదల కోసం యూపీఏ సర్కారు ‘జాతీయ ఆర్థికంగా వెనుకబడిన తరగతుల కమిషన్’ను 2006లో నియమించింది. ఈ వర్గాల జీవన స్థితిగతుల అధ్యయనానికి మేజర్ జనరల్ (రిటైర్డ్) ఎస్ఆర్ సిన్హో చైర్మన్‌గా, మహేంద్రసింగ్ సభ్యులుగా కమిషన్ ఏర్పాటు చేశారు. 2008 జనవరి నాటికి ఈ కమిషన్ నివేదిక ఇవ్వాల్సిఉండగా, అనేక పొడిగింపుల తర్వాత, చివరికి యూపీఏ–2 హయాంలో 2010లో నివేదిక ఇచ్చింది. కోటి కుటుంబాలు ఎనిమిదేళ్ల క్రితం అగ్రవర్ణ పేదల సంఖ్య ఆరు కోట్లుగా ఈ కమిషన్ అంచనా వేసింది. దాదాపు కోటి కుటుంబాలున్నాయంది. అగ్రవర్ణ పేదలకు కోటా కల్పించడానికి తొలి అడుగుగా యూపీఏ ఈ కమిషన్‌ను నియమించింది. కమిషన్ సభ్యులు 28 రాష్ట్రాల్లో పర్యటించి సామాజికంగా బలహీనవర్గాలకు(ఎస్సీ, ఎస్టీ, బీసీ) చెందని కులాల జీవన స్థితిగతులను అధ్యయనం చేశారు. ఆదాయ పన్ను కట్టని అగ్ర కులాలకు చెందిన పేదలను ఓబీసీ(అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్)లతో సమానంగా పరిగణించాలనే ప్రతిపాదన మొదట ఈ కమిషన్ చేసింది. ఆర్థికంగా బలహీనులైన ఈ వర్గాలు బీసీల స్థాయిలో ఉన్నారని కూడా తెలిపిందని వార్తలొచ్చాయి. ఓబీసీలతో సమానంగా ఈ అగ్రవర్ణ పేదలను ప్రభుత్వం చూడాలని కమిషన్ కోరింది. ఈ కమిషన్ నివేదికలోని విషయాలను ఇంత వరకూ అధికారికంగా ప్రభుత్వం వెల్లడించలేదు. రాజ్యాంగ సవరణ అవసరం సామాజికంగా వెనుకబడని వర్గాలకు రిజర్వేషన్ కల్పించాలంటే రాజ్యాంగంలోని 15, 16 అధికరణల సవవరణ అవసరం. అలాగే ప్రస్తుత అన్ని కోటాల పరిమితిని 50% నుంచి 60 శాతానికి పెంచడానికి కూడా రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. అన్ని రకాల రిజర్వేషన్ల మొత్తం 50 శాతం దాటకూడదనే సుప్రీంకోర్టు ఉత్తర్వులను అధిగమించాలంటే రాజ్యాంగ సవరణ ద్వారా కొత్త కోటా అంశాన్ని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చాలి. అలా చేర్చాక కూడా దాన్ని పరిశీలించే అధికారం తమకు ఉంటుందని 2007లో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 1992లో ఇందిరా సహానీ వర్సెస్ కేంద్రం కేసులో అన్ని కోటాలకు 50% గరిష్ట పరిమితి విధించింది. తొలిసారి ఈ పదప్రయోగం అంబేడ్కర్ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ ప్రకటనలో తొలిసారి ఈబీసీ పద ప్రయోగం చోటు చేసుకుంది. కేంద్రప్రభుత్వం ఆధ్వర్యంలో 2014–15 నుంచి అమల్లోకి వచ్చిన డా.అంబేడ్కర్ పోస్ట్‌మెట్రిక్ స్కాలర్షిప్ ఫర్ ది ఇకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ స్టూడెంట్స్ అనే పథకంలో తొలిసారి ఆర్థికంగా వెనుకడిన వర్గం (ఈబీసీ) అనే పదం ఉపయోగించారు. జనరల్ కేటగిరీకి చెందిన విద్యార్థులకు ఈ పథకం అమలు చేయడం ప్రారంభించారు. జాతీయ ఆర్థికంగా వెనుకబడిన తరగతుల కమిషన్ తన నివేదికను 2010లో సమర్పించాక ఈ స్కాలర్షిప్ పథకం అమలు మొదలైంది. అమలు అంత తేలిక కాదు ఈబీసీ కోటా అమలుకు లబ్ధిదారులను గుర్తించడం చాలా కష్టమని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ దళిత ఐఏఎస్ అధికారి చెప్పారు. ఈబీసీ అనే ప్రత్యేక వర్గాన్ని సృష్టించడం ద్వారా జనరల్ కేటగిరీని విభజించడం వల్ల ప్రయోజనం లేదన్నారు. కోటా విషయంలో ఓబీసీ(అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్)లను వర్గీకరించడానికి నియమించిన ఐదుగురు సభ్యుల కమిషన్ ఏడాదిన్నర దాటినా ఆ పని పూర్తి చేయలేదు. రిజర్వేషన్‌కు సంబంధించి ఎలాంటి మార్పు చేయాలన్నా జాప్యం జరుగుతుందనడానికి ఇదే తార్కాణం. మతం ప్రాతిపదికన కోటా కుదరదు జాతీయస్థాయిలో మతం ప్రాతిపదికన రిజర్వేషన్‌కు అవకాశం లేకున్నా కొన్ని రాష్ట్రాల్లో మతపరమైన మైనారిటీలకు కోటాలు ఇస్తున్నారు. అలాగే ప్రస్తుతం తమిళనాడు, మహారాష్ట్రలో 50 శాతానికి మించి రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. సగానికి మించి కోటా అవసరమని తగినన్ని సాక్ష్యాధారాలు అందజేస్తే అందుకు అనుమతిస్తామని సుప్రీంకోర్టు 2010లో ప్రకటించింది. -
ఆర్థికపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగం అనుమతించదు : ఓవైసీ
-
‘ఓటు బ్యాంక్ రాజకీయం కోసమే రిజర్వేషన్లు’
-
ఇది మోదీ ఇచ్చే చివరి లాలీపాప్ : హార్ధిక్ పటేల్
అహ్మదాబాద్ : ఆర్థికంగా వెనకబడిన అగ్రవర్ణ కులాలకు పది శాతం రిజర్వేషన్ కల్పించాలనే కేంద్ర కేబినేట్ నిర్ణయాన్ని పాటిదార్ ఉద్యమ నేత హార్ధిక్ పటేల్ తప్పుబట్టారు. ఓ జాతీయ చానెల్‌తో మాట్లాడుతూ.. మోదీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు కోసం ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని, అందుకే తన అమ్ములపొదిలోని చివర అస్త్రాన్ని ఈ రకంగా వదిలారన్నారు. ఈ రిజర్వేషన్ లాలీపాప్ ప్రజలకు అందిస్తే అది పెద్ద పొరబాటు అవుతుందని, సరిగ్గా అమలు చేయకపోయినా ప్రజలు తిరగబడతారని వ్యాఖ్యానించారు. మోదీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. ఇక వెనకబడిన అగ్రవర్ణకులాలకు పది శాతం రిజర్వేషన్ కల్పించేందుకు సోమవారం కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసిన విషయం తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో తీసుకున్న ఈ నిర్ణయానికి అనుగుణంగా అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి విద్యా, ఉద్యోగాల్లో పది శాతం రిజర్వేషన్ కల్పించేందుకు మోదీ సర్కార్ రాజ్యాంగ సవరణను చేపట్టనుంది. అగ్రవర్ణాల పేదలకు పది శాతం రిజర్వేషన్ కల్పించేలా మంగళవారం ప్రభుత్వం రాజ్యాంగంలోని ఆర్టికల్ 16, 17లకు సవరణను ప్రతిపాదించనుంది. -
‘ఓటు బ్యాంక్ రాజకీయం కోసమే రిజర్వేషన్లు’
సాక్షి, హైదరాబాద్ : అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడినవారికి పది శాతం రిజర్వేషన్ కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య తప్పుబట్టారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రిజర్వేషన్ల మూల సిద్ధాంతానికి విరుద్ధంగా ఉందన్నారు. అగ్రవర్ణాల్లోని పేదలు రిజర్వేషన్లు అడగటం లేదని, వారిని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లేలా ప్రభుత్వం ప్రయత్నించాలని సూచించారు. పేదరిక నిర్మూలనకు రిజర్వేషన్లు ప్రాతిపదిక కాదన్నారు. ఓటు బ్యాంక్ రాజకీయం కోసమే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని ఆరోపించారు. అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి రిజర్వేషన్లు కల్పించడం వల్ల ఓపెన్ కేటగిలో వెనుకబడిన వర్గాలకు అన్యాయం జరిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఆర్థికపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగం అనుమతించదు : ఓవైసీరి ఈబీసీ రిజర్వేషన్లను ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ తప్పుబట్టారు. ఆర్థికపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగం అనుమతించదన్నారు. పేదరికాన్ని నిర్మూలించేందుకు అనేక పథకాలు తేవొచ్చాని సూచించారు. దళితులకు సామాజిక న్యాయం కోసమే రిజర్వేషన్లు కల్పించారన్నారు. దేశంలో ఇప్పటి వరకు 49.5 శాతం రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి. ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 7.5శాతం, ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు అమలు అవుతోంది. 10శాతం పెంపుతో మొత్తం రిజర్వేషన్లు 59.5 శాతంకు చేరనుంది. -
అగ్రవర్ణాల పేదలకు రిజర్వేషన్
-
అగ్రవర్ణాల పేదలకు రిజర్వేషన్
సాక్షి, న్యూఢిల్లీ : రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో పది శాతం రిజర్వేషన్ కల్పించేందుకు సోమవారం కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. అగ్రవర్ణాల్లో రూ 8 లక్షల వార్షికాదాయం మించని వారికి ఈ రిజర్వేషన్లు వర్తిస్తాయని కేంద్ర కేబినెట్ పేర్కొంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి విద్యా,ఉద్యోగాల్లో పది శాతం రిజర్వేషన్ కల్పించేందుకు మోదీ సర్కార్ రాజ్యాంగ సవరణను చేపట్టనుంది.అగ్రవర్ణాల పేదలకు పది శాతం రిజర్వేషన్ కల్పించేలా మంగళవారం ప్రభుత్వం రాజ్యాంగంలోని ఆర్టికల్ 16, 17లకు సవరణను ప్రతిపాదించనుంది.ఇక కేబినెట్ నిర్ణయంతో జనరల్ కేటగిరిలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ ఫలాలు తొలిసారిగా అందుబాటులోకి రానున్నాయి. కాగా మరికొన్ని నెలల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. అగ్రవర్ణాల్లో తమ పట్టును మరింత పెంపొందించుకునేందుకు మోదీ సర్కార్ వ్యూహాత్మకంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు భావిస్తున్నారు. రాంవిలాస్ పాశ్వాన్ నేతృత్వంలోని ఎల్జేపీ, రాందాస్ అథవలే నేతృత్వంలోని ఆర్పీఐ వంటి పలు ఎన్డీఏ మిత్రపక్షాలు అగ్రవర్ణాల పేదలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని గతంలోనూ డిమాండ్ చేశాయి. ప్రభుత్వ ఉద్యోగాల్లో కుల ప్రాతిపదికన రిజర్వేషన్లు 50 శాతం మించరాదని సుప్రీం కోర్టు పరిమితి విధించింది. -
‘అగ్రవర్ణ పేదలకు 15 శాతం రిజర్వేషన్’
సాక్షి, న్యూఢిల్లీ : అగ్రవర్ణ పేదలకూ రిజర్వేషన్ వర్తింపచేయాలనే డిమాండ్‌కు సానుకూల స్పందన లభిస్తోంది. అగ్రవర్ణ పేదలకు 15 శాతం రిజర్వేషన్ కల్పించాలని కేంద్ర మంత్రి, లోక్‌జనశక్తి పార్టీ చీఫ్ రాం విలాస్ పాశ్వాన్ అన్నారు. సెక్యులరిజం, మత సామరస్యంతో పాటు పేదలకు అధికార ఫలాలు దక్కాలనేది తమ పార్టీ అభిమతమని చెప్పారు. ‘అగ్రవర్ణాల్లో పెద్దసంఖ్యలో పేదలున్నారు..వారు చేసేందుకు ఎలాంటి పని దొరకడం లేదు..అందుకే వారికి 15 శాతం కోటా కల్పించాలని తాను డిమాండ్ చేస్తున్నా’నన్నారు. పార్టీ కార్మిక విభాగం భేటీ నేపథ్యంలో పాశ్వాన్ ఈ వ్యాఖ్యలు చేశారు. పని లభించని వారికి నిరుద్యోగ భృతి ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ పోస్టుల అవుట్‌సోర్సింగ్‌తో ఆయా వర్గాలకు కల్పించిన రిజర్వేషన్ ప్రయోజనాలకు విఘాతం కలుగుతోందని పాశ్వాన్ ఆందోళన వ్యక్తం చేశారు. -
‘అగ్రవర్ణ పేదలకు 25శాతం కోటా ఇవ్వాలి’
భువనేశ్వర్: అగ్రవర్ణాల్లో పేదలకు 25 శాతం రిజర్వేషన్లు కల్పించాలని దళితనేత, కేంద్ర సామాజిక న్యాయ మంత్రి రామ్‌దాస్ అథవాలే అన్నారు. ప్రస్తుత రిజర్వేషన్ పరిమితిని 50 నుంచి 75 శాతానికి పెంచేలా రాజ్యాంగ సవరణ చేయాలన్నారు. వెనుకబడిన గుజ్జర్లు, పటేల్, రాజపుత్రులు, మరాఠాలు, జాట్లు, బ్రాహ్మణులకు కల్పించాలని సూచించారు. న్యాయపరమైన చిక్కులు ఎదురుకాకుండా రిజర్వేషన్లు పెంచేందుకు రాజ్యాంగ సవరణ అవసరమని అభిప్రాయపడ్డారు. అగ్రవర్ణాల్లో పేదలకు తమిళనాడు ప్రభుత్వం 69 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తోందని గుర్తు చేశారు.