
సాక్షి, అమరావతి: ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణ పేదల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శాఖను ఏర్పాటు చేసింది. ఈడబ్ల్యూఎస్ సంక్షేమ (ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు) శాఖను ఏర్పాటు చేస్తూ సాధారణ పరిపాలన శాఖ మంగళవారం ఉత్తర్వులిచ్చింది. ఈ శాఖ పరిధిలోకి కమ్మ,రెడ్డి, బ్రాహ్మణ, క్షత్రియ, కాపు, ఆర్య వైశ్య కార్పొరేషన్లు రానున్నాయి. అలాగే జైన్‌ల సంక్షేమానికి, సిక్కుల సంక్షేమానికి వేర్వేరు కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తూ రెండు జీవోలను జారీ చేసింది. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో వీటి ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
(చదవండి: Rain Alert: ఏపీలో భారీ వర్షాలు)
Comments
Please login to add a commentAdd a comment