special department
-
ఆంగ్లంతో పాటు తెలుగులోనూ పరీక్షలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొన్ని ప్రత్యేక విభాగపు పోస్టుల భర్తీకి నిర్వహించే పరీక్షలను ఆంగ్లంతో పాటు తెలుగులోనూ నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) నిర్ణయించింది. దీనివల్ల అభ్యర్థులందరికీ మేలు జరుగుతోందని కమిషన్ భావిస్తోంది. ఈ మేరకు ఏపీపీఎస్సీ కార్యదర్శి జె.ప్రదీప్ కుమార్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కొన్ని సాంకేతిక, ప్రత్యేక అర్హతలతో కూడిన పోస్టుల నియామకాలకు ఏపీపీఎస్సీ ఇప్పటివరకు ఆంగ్లంలోనే పరీక్షలు నిర్వహిస్తూ వస్తోంది. వీటిని తెలుగు మాధ్యమంలో కూడా నిర్వహించాలని గత కొంతకాలంగా గ్రామీణ, తెలుగు మాధ్యమం అభ్యర్థులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీపీఎస్సీ ఈ పరీక్షలకు సంబంధించిన పేపర్–1ను ఆంగ్లం, తెలుగు మాధ్యమాల్లో నిర్వహించాలని నిర్ణయించింది. పేపర్–1లో జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ ప్రశ్నలుంటాయి. ఆంగ్లం ప్రశ్నలను తెలుగులో అనువదించి ఇస్తారు. అయితే ఈ రెండు మాధ్యమాల్లో ఆంగ్లంలోని ప్రశ్నలను మాత్రమే పరిగణనలోకి తీసుకోనున్నారు. ఇక పేపర్–2లో సబ్జెక్టు పేపర్లను మాత్రం ఆంగ్ల మాధ్యమంలోనే నిర్వహించనున్నారు. (చదవండి: డిస్కంలకు కాస్త ఊరట..విద్యుత్ అమ్మకం ధరలు తగ్గింపు!) -
ఏపీలో ఆర్థికంగా వెనుకబడినవారి కోసం కొత్త సంక్షేమ శాఖ
-
అగ్రవర్ణ పేదల సంక్షేమానికి ప్రత్యేక శాఖ
-
AP: అగ్రవర్ణ పేదల సంక్షేమానికి ప్రత్యేక శాఖ
సాక్షి, అమరావతి: ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణ పేదల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శాఖను ఏర్పాటు చేసింది. ఈడబ్ల్యూఎస్ సంక్షేమ (ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు) శాఖను ఏర్పాటు చేస్తూ సాధారణ పరిపాలన శాఖ మంగళవారం ఉత్తర్వులిచ్చింది. ఈ శాఖ పరిధిలోకి కమ్మ,రెడ్డి, బ్రాహ్మణ, క్షత్రియ, కాపు, ఆర్య వైశ్య కార్పొరేషన్లు రానున్నాయి. అలాగే జైన్ల సంక్షేమానికి, సిక్కుల సంక్షేమానికి వేర్వేరు కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తూ రెండు జీవోలను జారీ చేసింది. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో వీటి ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. (చదవండి: Rain Alert: ఏపీలో భారీ వర్షాలు) -
బేవరేజెస్ కార్పొరేషన్ స్థానంలో ప్రత్యేక శాఖ
- ఎక్సైజ్‌కు అనుబంధంగా కార్యకలాపాలు - ఉద్యోగులను ప్రభుత్వశాఖలో విలీనం చేసేందుకే సీఎం మొగ్గు? - నిబంధనలు ఒప్పుకోకపోతే మరో రెండు ఆప్షన్లు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ (టీఎస్‌బీసీఎల్)ను రద్దు చేయడంతో పాటు మద్యం అమ్మకాల కోసం ప్రత్యేక శాఖను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు విధివిధానాలను ఎక్సైజ్ శాఖ సిద్ధం చేస్తోంది. రాష్ట్ర విభజన తరువాత మద్యం అమ్మకాలు, డిపోల నిర్వహణ కోసం బేవరేజెస్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడంతో ప్రభుత్వం తీవ్రంగా నష్టపోయింది. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన మద్యం అమ్మకాలపై ఆదాయపన్ను రూపంలో ఐటీ శాఖ రూ. 1,247 కోట్లను తెలంగాణ ప్రభుత్వ ఖజానా నుంచి అటాచ్ చేసుకుంది. సర్వీస్ ట్యాక్స్ చెల్లించాలంటూ సెంట్రల్ ఎక్సైజ్, కస్టమ్స్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో బేవరేజెస్ కార్పొరేషన్‌ను రద్దు చే సి, ప్రత్యేక శాఖగా కొనసాగించాలని నిర్ణయించింది. సీఎం ఆదేశాలమేరకు ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్ విధివిధానాలపై నివేదిక రూపొందించారు. ఎక్సైజ్ శాఖకు అనుబంధంగా ఏర్పాటయ్యే ప్రత్యేక శాఖ ద్వారా మద్యం డిపోల నిర్వహణ, రిటైల్ దుకాణాలకు సరఫరా తదితర పనులను కొనసాగిస్తారు. ప్రభుత్వ ఉద్యోగులుగానే కొనసాగించే ఆలోచన బేవరేజెస్ కార్పొరేషన్లో ప్రస్తుతం 143 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరు కాకుండా 200 మంది కాంట్రాక్టు కార్మికులున్నారు. కార్పొరేషన్ రద్దయినా కొత్తగా ఏర్పాటయ్యే శాఖలో ఉద్యోగులు అవే విధులు నిర్వహిస్తారు. వీరిని ఏపీ తరహాలో కాంట్రాక్టు ఉద్యోగులుగా తీసుకోవాలని భావించినప్పటికీ, ప్రభుత్వంలోకి తీసుకునేందుకే ముఖ్యమంత్రి మొగ్గు చూపినట్లు సమాచారం. కాంట్రాక్టు ఉద్యోగులుగా తీసుకున్నా, వేతనాలు పాతవే చెల్లించాల్సి వచ్చినప్పుడు కాంట్రాక్టు పద్ధతిలోకి మార్చడం ఎందుకని కేసీఆర్ ప్రశ్నించినట్లు తెలిసింది. ఉద్యోగ విరమణ తరువాత ప్రభుత్వ ఉద్యోగులకు, కార్పొరేషన్లో పనిచేసే వారికి పెన్షన్ విధానంలో తేడాలు ఉండడం ఒక్కటే ఇబ్బందిగా ఉన్నట్లు సమాచారం. అవసరమైతే చట్టంలో సవరణలు చేసైనా ప్రభుత్వ ఉద్యోగులుగా కొనసాగించాలని భావిస్తున్నట్లు ఓ అధికారి తెలిపారు. ఆర్థిక శాఖ అడ్డుచెబితే మాత్రం వేరే కార్పొరేషన్‌కు బదిలీ చేసి డిప్యూటేషన్ మీద ఎక్సైజ్ అనుబంధ శాఖలో కొనసాగించడమా... కాంట్రాక్టు పద్ధతిలోకి మార్చడమా అనే ఆప్షన్లను పరిశీలిస్తున్నట్లు తెలిసింది. -
తాగునీటి సరఫరాకు ప్రత్యేక శాఖ
రాష్ర్ట వ్యాప్తంగా 500 రక్షిత మంచినీటి సరఫరా కేంద్రాలు 15న 350 కేంద్రాల ప్రారంభం గ్రామీణ మహిళలకు వాషింగ్ మెషిన్లు, హెయిర్ డ్రయర్లు 2018 నాటికి బహిర్భూమి రహిత రాష్ట్రంగా కర్ణాటక సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ర్టంలోని గ్రామీణ ప్రాంతాల్లో తాగు నీటి సరఫరా కోసం ప్రత్యేక శాఖను ప్రారంభించనున్నట్లు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి హెచ్‌కే. పాటిల్ శాసన సభకు వెల్లడించారు. తన శాఖ పద్దులపై మూడు రోజుల పాటు జరిగిన చర్చకు గురువారం ఆయన సమాధానమిస్తూ ఆగస్టు 15 లేదా అక్టోబరు 2న కొత్త శాఖను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో నీటి సరఫరా కోసం ప్రత్యేక జల మండలిని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉన్నప్పటికీ, ప్రత్యేక శాఖనే ఏర్పాటు చేయాలనే నిర్ణయనికి వచ్చామని చెప్పారు. రాష్ట్రంలోని 5,223 జన నివాస ప్రదేశాల్లో ఒక బకెట్ కంటే తక్కువగా తాగు నీటిని అందిస్తున్నామనే కఠోర సత్యాన్ని ఆయన సభకు తెలిపారు. ఈ సమస్యను సవాలుగా స్వీకరించి అందరికీ సరిపడా తాగు నీరు అందిస్తామని హామీ ఇచ్చారు. కలుషిత నీటిని సేవించడం వల్ల నిముషానికి ముగ్గురు పిల్లలు చనిపోతున్నారని, 60 శాతం మంది వివిధ రోగాల బారిన పడుతున్నారని వివరించారు. దీనిని నివారించడానికి రాష్ర్ట వ్యాప్తంగా 500 రక్షిత మంచి నీటి సరఫరా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామని , ఈ నెల 15న 350 కేంద్రాలను ప్రారంభించనున్నామని వెల్లడించారు. ప్రధాని, శ్రీమంతులు తాగే నీటిని తమకూ సరఫరా చేయాలని ప్రజలు అడుగుతున్నారని చెబుతూ, వారి కోరిక సహేతుకమేనని అంగీకరించారు. గ్రామాల్లో వాషింగ్ మిషన్లు, హెయిర్ డ్రయర్లు గ్రామాల్లో మహిళలకు ఇకమీదట వాషింగ్ మిషన్లు, హెయిర్ డ్రయర్లను సరఫరా చేస్తామని, వృద్ధులకు పాశ్చాత్య శైలిలో మరుగు దొడ్లను సమకూరుస్తామని వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ ఏడాది వెయ్యి కాంప్లెక్స్‌లను నిర్మించి, అందులో పాశ్చాత్య మరుగు దొడ్లు, స్నానాల గదులు, బట్టలు ఉతికే గదులు, అధునాతన వాషింగ్ మిషన్లు, హెయిర్ డ్రయర్లు ఉండేలా చూస్తామని తెలిపారు. ప్రతి శాసన సభ నియోజక వర్గానికి రెండు నుంచి మూడు చొప్పున కాంప్లెక్స్‌లను నిర్మిస్తామన్నారు. 2018 నాటికి బహిర్భూమి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పని చేస్తున్నామని చెప్పారు. 27 వేల మంది నియామకానికి అనుమతి గ్రామ పంచాయతీల స్వావలంబనకు 27 వేల మంది సిబ్బందిని నియమించుకోవడానికి అనుమతి ఇచ్చామని మంత్రి వెల్లడించారు. ఆగస్టు ఒకటో తేదీ లోగా ఈ ప్రక్రియ పూర్తి కావాలని ఆదేశించామని ఆదేశించామని తెలిపారు. ఔట్ సోర్సింగ్ ద్వారా 5,629 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లను నియమించాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఆగస్టు ఆఖరు లోగా ఈ నియామకాలు కూడా పూర్తవుతాయన్నారు. ఈ నియామకాలతో గ్రామ పంచాయతీల్లో 32 వేల మందికి పైగా సిబ్బంది అందుబాటులోకి వస్తారని, మరో మూడు, నాలుగు వేల మందిని కూడా దశలవారీ నియమిస్తామని వివరించారు. 2015 నాటికి అన్ని గ్రామ పంచాయతీలకు బ్రాడ్‌బ్యాండ్ సదుపాయం కల్పిస్తామని ఆయన తెలిపారు. -
ఉద్యోగుల సర్వీస్ రూల్స్ కోసం ప్రత్యేక శాఖ
ఏపీ సచివాలయ సమన్వయ సంఘం సమావేశంలో చంద్రబాబు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఉద్యోగులందరూ మొన్న ఏ స్ఫూర్తితో కలిసికట్టుగా ముందుకు వచ్చారో అదే స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అగ్రగామిగా నిలిచేవిధంగా తనను ముందుకు నడిపించే బాధ్యత తీసుకోవాలని సీమాంధ్ర ప్రాంత సచివాలయ ఉద్యోగులను ఏపీ సీఎం చంద్రబాబు కోరారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా గురువారం సచివాలయానికి వచ్చిన చంద్రబాబును ఆంధ్రప్రదేశ్ సచివాలయ సమన్వయ సంఘం సన్మానించింది. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ... ఉద్యోగుల సర్వీసు రూల్స్ చూసేందుకు ప్రత్యేక శాఖను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. సచివాలయ సమన్వయ సంఘం చైర్మన్ మురళీకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికోసం తమ వంతు కృషి చేస్తామన్నారు. నూతన రాజధాని ఏర్పాటు కోసం సీమాంధ్ర సచివాలయ ఉద్యోగులు రెండు రోజుల వేతనాన్ని ఇస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కామినేని శ్రీనివాస్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, ఉద్యోగ సంఘం నేతలు రామాంజనేయులు, వెంకటసుబ్బయ్య, మద్దిలేటి, హరీష్ కుమార్‌రెడ్డి, జి.రామక్రిష్ణ, రమణయ్య, ఇంద్రాణి తదితరులు పాల్గొన్నారు.