అగ్రవర్ణాల్లో పేదలకు 25 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథవాలే అన్నారు.
భువనేశ్వర్: అగ్రవర్ణాల్లో పేదలకు 25 శాతం రిజర్వేషన్లు కల్పించాలని దళితనేత, కేంద్ర సామాజిక న్యాయ మంత్రి రామ్‌దాస్ అథవాలే అన్నారు. ప్రస్తుత రిజర్వేషన్ పరిమితిని 50 నుంచి 75 శాతానికి పెంచేలా రాజ్యాంగ సవరణ చేయాలన్నారు. వెనుకబడిన గుజ్జర్లు, పటేల్, రాజపుత్రులు, మరాఠాలు, జాట్‌లు, బ్రాహ్మణులకు కల్పించాలని సూచించారు.
న్యాయపరమైన చిక్కులు ఎదురుకాకుండా రిజర్వేషన్లు పెంచేందుకు రాజ్యాంగ సవరణ అవసరమని అభిప్రాయపడ్డారు. అగ్రవర్ణాల్లో పేదలకు తమిళనాడు ప్రభుత్వం 69 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తోందని గుర్తు చేశారు.