
తనయుడు చిరాగ్ పాశ్వాన్‌తో తండ్రి రామ్ విలాస్ పాశ్వాన్
పాట్నా, బిహార్ : బిహార్‌లో మరో రాజకీయ నేత తనయుడి పెళ్లికి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. కేంద్రమంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ తనయుడు, లోక్ జనశక్తి పార్టీ నాయకుడు చిరాగ్ పాశ్వాన్ తాను పెళ్లికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే, వధువును మాత్రం తల్లిదండ్రులే వెదికిపెట్టాలని చెప్పారు. జముయ్ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న చిరాగ్ ప్రస్తుతం తనపై నియోజవకవర్గ ప్రజల బాధ్యత ఉందన్నారు.
పెళ్లి కొంచె ఆలస్యం అయినా ఫర్వాలేదని చెప్పారు. తేజ్ ప్రతాప్ యాదవ్ పెళ్లి సందర్భంగా ఆయన తమ్ముడు తేజస్వీ యాదవ్ తనకంటే వయసులో పెద్దవారైన చిరాగ్, నిశాంత్ కుమార్(నితీశ్ కుమార్ తనయుడు)ల వివాహం తర్వాతే తాను పెళ్లి చేసుకుంటానని పేర్కొన్నారు. దీనిపై మాట్లాడిన చిరాగ్.. తేజస్వి కోరికను తప్పకుండా నేరవేర్చుతానని అన్నారు.