పట్నా: కేంద్ర మంత్రి, లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) చీఫ్ చిరాగ్ పాశ్వాన్‌కు చలాన్ జారీ అయింది. మితిమీరిన వేగంతో ఆయన కారు వెళ్లినందుకు బీహార్‌లోని ఓ టోల్ ప్లాజా వద్ద కొత్తగా ఏర్పాటు చేసిన ఈ-డిటెక్షన్ సిస్టం చలాన్ జారీ చేసింది. కేంద్ర మంత్రి పాశ్వాన్ నేషనల్ హైవేపై హాజీపూర్ నుంచి చంపారన్‌కు వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగిందని అధికారులు పేర్కొన్నారు.
మరోవైపు.. బిహార్ ట్రాన్స్‌పోర్టు డిపార్టుమెంట్, ట్రాఫిక్ పోలీసులు ఇప్పటివరకు కొత్త ఈ డిటెక్షన్ సిస్టం ద్వారా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంగఘించిన 16,700 మందికి ఈ-చలాన్ జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. ఆ చలాన్ల విలువ సుమారుగా రూ. 9.49కోట్ల ఉంటుందని అంచనా వేస్తున్నారు.
కొత్తగా తీసుకువచ్చిన ఈ డిటెక్షన్ సిస్టంను మోటార్ వాహన చట్టం కింద రాష్ట్రంలోని 13 టోల్ ప్లాజాల్లో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ-డిటెక్షన్ సిస్టం వాహనాలను చెక్ చేస్తూ.. సరైన పత్రాలు లేనట్లైతే ఆటోమేటిక్‌గా చలాన్ జారీ అవుతుందని అధికారులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment