'దళిత నాయకుడిగా ఉండాలని లేదు' | Don't Want to be Known as Dalit Leader, Times Have Changed: Chirag Paswan | Sakshi

'దళిత నాయకుడిగా ఉండాలని లేదు'

Nov 2 2015 4:14 PM | Updated on Jul 18 2019 2:11 PM

తనకు దళిత నాయకుడిగా ఉండాలని లేదని లోక్ జన శక్తి పార్టీనేత కేంద్రమంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ కుమారుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.

పాట్నా: తనకు దళిత నాయకుడిగా ఉండాలని లేదని లోక్ జన శక్తి పార్టీనేత కేంద్రమంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ కుమారుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రోజులు మారాయని చెప్పారు. ఇప్పటి వరకు దళిత నాయకుడిగానే చెప్పుకుంటూ పాశ్వాన్ గొప్ప నాయకుడిగా ఎదగగా.. హీరో నుంచి నాయకుడిగా మారిన కుమారుడు చిరాగ్ పాశ్వాన్ ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది.

'నాకు దళిత నాయకుడిగా తెలియడం ఇష్టం లేదు. ఎందుకంటే అప్పటి రోజులు వేరు ప్రస్తుత రోజులు వేరు. ఇప్పుడంతా మారిపోయింది' అని చిరాగ్ అన్నాడు. బీహార్ ఎన్నికల ప్రచారం సందర్భంగా అతడు ఈ వ్యాఖ్యలు చేశాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement