జనరల్ కేటగిరీలో 10శాతం రిజర్వేషన్లు కల్పిస్తామంటూ కాంగ్రెస్ సహా అన్ని పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోల్లో ప్రకటించాయి. సుప్రీంకోర్టు రిజర్వేషన్లపై 50 శాతం పరిమితి విధించినందున మరో 10 శాతం రిజర్వేషన్ కల్పించడం కోర్టు తీర్పుకు ధిక్కరించినట్లవుతుందన్న వాదన అర్థ రహితం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 16(4) ప్రకారం సుప్రీంకోర్టు విధించిన 50శాతం పరిమితి కులాల ప్రాతిపదికన ఇచ్చే రిజర్వేషన్లకు మాత్రమే వర్తిస్తుంది. అంతేతప్ప, జనరల్ కేటగిరీకి కాదు. గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు మార్లు నోటిఫికేషన్ల ద్వారా రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రయత్నించిన కారణంగా విఫలమయ్యాయి. ఆర్టికల్ 368 పార్ట్ 3 ప్రకారం..ప్రాథమిక హక్కుల సవరణకు రాష్ట్రాల అంగీకారం పొందాల్సిన అవసరం కూడా లేదు.
ఉదాహరణకు..ప్రమోషన్లకు సంబంధించి ఆర్టికల్ 15(5)కు చేపట్టిన సవరణ పార్లమెంట్ ఆమోదం ద్వారానే జరిగింది. ఇప్పటివరకు సామాజికంగా వెనుకబడిన వర్గాలకు మాత్రమే రాజ్యాంగం రిజర్వేషన్ కల్పిస్తోంది. ప్రస్తుత 124వ రాజ్యాంగ సవరణ–2019 ద్వారా ఆర్థికంగా బలహీన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించేందుకు కొన్ని నిబంధనలను చేరుస్తున్నాం. కులం, ఆర్థికత ఆధారంగా పౌరులకు సమాన అవకాశాలు కల్పించాలి. అయితే, సమానులను అసమానంగా చూడరాదు. అసమానులను కూడా సమానంగా భావించరాదు. రాజ్యాంగ మూల స్వరూపాన్ని మార్చకుండా మేం చేపట్టిన ఈ ప్రయత్నం సఫలమవుతుందని ఆశిస్తున్నాం. ఎన్నికల మేనిఫెస్టోలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజరేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ..మాటపై నిలబడి బిల్లుకు ఆమోదం తెలపాలి. ప్రతిపక్షాలు నిరసనలు తెలపడం మాని, మనస్ఫూర్తిగా బిల్లుకు ఆమోదం ప్రకటించాలి.
అనుప్రియా పటేల్, అప్నాదళ్
ఎస్‌సీ, ఎస్‌టీ రిజర్వేషన్లలో మాదిరిగా కాకుం డా ఆర్థికంగా వెనుకబడిన వారికి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పిస్తున్నాం. 2021 లో కుల ప్రాతిపదికన జన గణన చేపట్టి స్పష్టత తీసుకువస్తాం. ప్రైవేట్ రంగానికి కూడా ఈ రిజర్వేషన్లు వర్తింప జేసే విషయాన్ని పరిశీలిస్తున్నాం.
రాం విలాస్ పాశ్వాన్, కేంద్రమంత్రి
జనరల్ కేటగిరీలో 60శాతం రిజర్వేషన్లను రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చాలి. తద్వారా సుప్రీంకోర్టులో సవాల్ చేసే వీలుండదు. ప్రైవేట్ రంగంలో కూడా 60శాతం రిజర్వేషన్లు కల్పించాలి. దీంతోపాటు ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీసెస్ ఏర్పాటు చేయాలి. దీనివల్ల పారదర్శకత పెరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment