Anupriya Patel
-
మోదీ నూతన క్యాబినెట్లో అనుప్రియ పటేల్
ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రధానిగా నేడు (ఆదివారం) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రధాని మోదీతో పాటు పలువురు ఎంపీలు కూడా నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అప్నాదళ్ (ఎస్) నాయకురాలు అనుప్రియా పటేల్ మోదీ కేబినెట్లో చోటు దక్కించుకున్నారు. ఇంతకీ అనుప్రియా పటేల్ ఎవరు?అనుప్రియా పటేల్ ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో 1981 ఏప్రిల్ 28న జన్మించారు. ‘అప్నా దళ్’ అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. అనుప్రియ తన విద్యను లేడీ శ్రీ రామ్ కాలేజ్ ఫర్ ఉమెన్, ఛత్రపతి సాహూ జీ మహారాజ్ విశ్వవిద్యాలయంలో పూర్తి చేశారు. ఆమె సైకాలజీలో మాస్టర్స్ డిగ్రీ, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఎంబీఏ) పూర్తి చేశారు.ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్ పార్లమెంట్ స్థానం నుంచి అప్నాదళ్ (ఎస్) అధ్యక్షురాలు అనుప్రియా పటేల్‌కు నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డిఎ) ఈసారి టికెట్ ఇచ్చింది. అనుప్రియ పటేల్ 37,810 ఓట్ల తేడాతో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అభ్యర్థి రమేష్ చంద్ బింద్‌పై విజయం సాధించారు. ఎన్డీఏ అభ్యర్థిగా పటేల్ వరుసగా మూడోసారి ఇక్కడ నుంచి విజయం సాధించారు. గతంలో అంటే 2014, 2019 ఎన్నికల్లో కూడా ఆమె ఇక్కడి నుంచే గెలుపొందారు.వెనుకబడిన కుర్మీ వర్గానికి చెందిన ప్రముఖ నేత, అప్నా దళ్ వ్యవస్థాపకుడు, దివంగత డాక్టర్ సోనేలాల్ పటేల్ కుమార్తె అనుప్రియా పటేల్. ఈ పార్టీ ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీలో బీజేపీ, సమాజ్‌వాదీ పార్టీల తర్వాత మూడవ అతిపెద్ద పార్టీ. 2009లో తన తండ్రి మరణించినప్పటి నుంచి ఆమె ‘అప్నాదళ్’ అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. -
అక్కా.. వచ్చేస్తున్నా! ఎన్డీఏ వైపు పల్లవి పటేల్
లోక్‌సభ సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్దీ ఉత్తర ప్రదేశ్‌లో రాజకీయాలు రోజుకో మలుపు తీసుకుంటున్నాయి. ‘ఇండియా’ కూటమికి షాకిస్తూ అప్నా దళ్ (కామెరవాడి) నాయకురాలు, సిరతు ఎమ్మెల్యే పల్లవి పటేల్ ( Pallavi Patel ) బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏలో చేరబోతున్నట్లు సంకేతాలు ఇచ్చారు. ఇక పొత్తుపై కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. బిహార్‌లో ‘ఇండియా’ కూటమికి నితీష్ కుమార్ ఇచ్చిన షాకే ఉత్తరప్రదేశ్‌లోని అప్నా దళ్-కామెరవాడి ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. "ప్రస్తుతం ఎన్డీఏతో చర్చలు లేవు. ఒకవేళ ఆఫర్ వస్తే తమ పార్టీ పరిశీలిస్తుంది" అని డాక్టర్ పల్లవి పటేల్ చెప్పారు. మరోవైపు అప్నా దళ్ (కామెరవాడి) ఉత్తరప్రదేశ్‌లోని మూడు లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన ఒక రోజు తర్వాత సమాజ్‌వాదీ పార్టీ 2024 సార్వత్రిక ఎన్నికల కోసం కృష్ణ పటేల్ నేతృత్వంలోని పార్టీతో పొత్తు లేదని తెలిపింది. “అప్నాదళ్ (కె), సమాజ్ వాదీ పార్టీల మధ్య పొత్తు 2022 అసెంబ్లీ ఎన్నికల కోసమే కానీ, 2024 ఎన్నికల కోసం కాదు” అని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ స్పష్టం చేశారు. పల్లవి పటేల్ సోదరి, అప్నా దళ్ (సోనేలాల్) అధినేత్రి అనుప్రియా పటేల్ ( Anupriya Patel ) ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ క్యాబినెట్లో మంత్రిగా ఉన్నారు. అప్నా దళ్ (కే) ప్రకటించిన మూడు స్థానాల్లో మీర్జాపూర్ స్థానం నుండి అనుప్రియా పటేల్ ప్రాతినిధ్యం వహిస్తుండగా ఫుల్పూర్, కౌశంబి లోక్‌సభ స్థానాల్లో ప్రస్తుతం బీజేపీ ఎంపీలు ఉన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం మూడు స్థానాల్లో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థులు రెండో స్థానంలో నిలిచారు. -
ఆ గట్టున తల్లి.. ఈ గట్టున కూతురు!
‘ఇండియా’ కూటమికి మిత్రపక్షమైన అప్నా దళ్ (కామెరవాడి) ఉత్తరప్రదేశ్‌లో రాబోయే లోక్‌సభ ఎన్నికలకు మూడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఫుల్పూర్, మీర్జాపూర్, కౌశాంబి మూడు స్థానాల్లో పోటీ చేయాలని పార్టీ నిర్ణయించింది. “అప్నా దళ్ (కె) కేంద్ర కార్యవర్గ సమావేశం జాతీయ అధ్యక్షురాలు కృష్ణ పటేల్ ఆధ్వర్యంలో జరిగింది. ఇండియా కూటమిలో భాగంగా మూడు స్థానాల్లో పోటీ చేయాలని సమావేశంలో నిర్ణయించారు' అని కేంద్ర కార్యాలయ కార్యదర్శి రామ్ సనేహి పటేల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్‌లు సీట్ల పంపకాన్ని నిర్ణయించుకున్నాయి, దాని ప్రకారం కాంగ్రెస్ 17 స్థానాల్లో పోటీ చేయగా, సమాజ్‌వాదీ పార్టీ 63 స్థానాల్లో తమ అభ్యర్థులను నిలబెట్టనుంది. సమాజ్‌వాదీ పార్టీ తృణమూల్ కాంగ్రెస్‌కి భదోహి సీటును ఇచ్చింది. అక్కడ లలితేష్ త్రిపాఠిని అభ్యర్థిగా నిలిపింది. అప్నాదళ్ (కె) సీట్లను ప్రకటించడంపై సమాజ్‌వాదీ పార్టీ నేతలను ప్రశ్నించగా.. దాని గురించి తమకు తెలియదన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికలలో అప్నా దళ్ (సోనీలాల్) నాయకురాలు అనుప్రియ పటేల్ (Anupriya Patel) సమాజ్‌వాదీ పార్టీకి చెందిన రామ్ చరిత్ర నిషాద్పై పోటీ చేసి 2,32,008 ఓట్ల తేడాతో గెలిచారు. అప్నా దళ్ (సోనీలాల్) ఎన్డీఏ మిత్రపక్షంగా ఉంది. అనుప్రియా పటేల్ మోదీ ప్రభుత్వంలో వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అనుప్రియ అప్నా దళ్ (సోనేలాల్) పార్టీని స్థాపించిన సోనే లాల్ పటేల్ కుమార్తె. రాబోయే ఎన్నికల్లో మీర్జాపూర్లో అప్నా దళ్ (సోనేలాల్) వర్సెస్ అప్నా దళ్ (కామెరావాడి) మధ్య పోటీ జరుగుతుందని భావిస్తున్నారు. -
ఐదేళ్లలో 370 మిలియన్ డాలర్ల కేశాల ఎగుమతి
సాక్షి, న్యూఢిల్లీ: దేశం నుంచి ఐదేళ్లలో 370.11 మిలియన్ అమెరికన్ డాలర్ల విలువైన మానవ కేశాలు ఎగుమతి అయ్యాయని కేంద్ర వాణిజ్యశాఖ సహాయమంత్రి అనుప్రియ పటేల్ తెలిపారు. రాజ్యసభలో శుక్రవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ.. 2018–19లో 34.46 మిలియన్ డాలర్లు, 2019–20లో 5.70 మిలియన్ డాలర్లు, 2020–21లో 11.65 మిలియన్ డాలర్లు, 2021–22లో 149.07 మిలియన్ డాలర్లు, 2022–23లో అత్యధికంగా 169.23 మిలియన్ డాలర్ల విలువైన కేశాలు ఎగుమతి చేసినట్లు వివరించారు. మానవ కేశాలు, ఉత్పత్తుల అసోసియేషన్, ప్లెక్స్ కౌన్సిల్ సమాచారం మేరకు ప్రపంచంలోనే అత్యధికంగా మానవ కేశాలు లభించేది భారతదేశంలోనే అని తెలిపారు. దేశంలో లభించే కేశాలు నాణ్యమైనవిగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినట్లు చెప్పారు. అరుణాచల్‌ప్రదేశ్ మీదుగా మయన్మార్ నుంచి చైనాకు భారతీయ మానవ కేశాల అక్రమ రవాణాకు సంబంధించి ఆధారాలు లేవని, కస్టమ్స్ వద్ద కేసులేమీ నమోదు కాలేదని తెలిపారు. -
2020-21లో పసిడికి తగ్గిన డిమాండ్..!
న్యూఢిల్లీ: బంగారం అంటే భారతీయులకు.. ప్రత్యేకించి ఆడపడుచులకు చాలా ఇష్టం.. వీలైతే బంగారం ఆభరణాల కొనుగోలు చేయడానికే మొగ్గు చూపుతుంటారు. భారత్‌లో పెండ్లిండ్లలో నవ వధువుకు బంగారం ఆభరణాలు తప్పనిసరి. పండుగల సమయంలో గిఫ్ట్‌లుగానూ ఆభరణాలు బహుకరిస్తుంటారు. అయితే, అలాంటి బంగారాన్ని దేశీయంగా ఉత్పత్తి చేసేది కేవలం ఒకశాతమే మాత్రమే. మిగతా అంతా విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిందే. భారత్ 2020-21 ఆర్థిక సంవత్సరంలో 651 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో (2019-20) పసిడి దిగుమతులు 720 టన్నులుగా ఉన్నాయి. ఈ విషయాన్ని కేంద్ర పరిశ్రమలు, వాణిజ్యశాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ బుధవారం లోక్‌సభ ప్రశ్నోత్తరాల్లో రాతపూర్వక సమాధానంలో చెప్పారు. ఇక 2018-19లో 983 టన్నుల బంగారం దిగుమతి అయినట్టు ప్రకటించారు. పుత్తడి దిగుమతిలో పొరుగు దేశం చైనా తర్వాతీ స్థానం మనదే. కానీ గత ఆర్థిక సంవత్సరం పుత్తడి దిగుమతులు తగ్గాయి. (చదవండి: బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్..! వచ్చే 6 రోజుల్లో 4 రోజులు బంద్..!) -
పలాస జీడిపప్పు ఎగుమతి ప్రతిపాదన లేదు
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా నుంచి పలాస జీడిపప్పును అంతర్జాతీయ మార్కెట్‌కు ఎగుమతి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ప్రాసెసర్ల పరిస్థితికి సంబంధించి ఎలాంటి ప్రతిపాదన, సమాచారం లేదని కేంద్ర వాణిజ్యశాఖ సహాయమంత్రి అనుప్రియ పటేల్ బుధవారం లోక్‌సభలో చెప్పారు. వైఎస్సార్సీపీ ఎంపీలు ఆదాల ప్రభాకర్‌రెడ్డి, కోటగిరి శ్రీధర్ అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానమిచ్చారు. ఏపీలో 4 టీఐఈఎస్ ప్రాజెక్టులు ట్రేడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ఎక్స్పోర్ట్ స్కీం (టీఐఈఎస్)లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు ప్రాజెక్టులను అనుమతించినట్లు కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. వైఎస్సార్సీపీ ఎంపీలు చింతా అనూరాధ, పోచ బ్రహ్మానందరెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. విశాఖపట్నంలో నిర్మాణంలో ఉన్న ఎక్స్పోర్ట్ ఇన్స్పెక్షన్ కౌన్సిల్‌కు మొత్తం ఖర్చు రూ.16.52 కోట్లు అని, రూ.8.15 కోట్ల గ్రాంట్ ఆమోదించగా రూ.4.15 కోట్లు విడుదల చేశామని వివరించారు. విశాఖలోని ఆంధ్రప్రదేశ్ మెడ్‌టెక్ జోన్ లిమిటెడ్‌లో మూడు ప్రాజెక్టులకు రూ.220.87 కోట్లు ప్రతిపాదించగా రూ.66 కోట్లకు ఆమోదం లభించిందని, రూ.53 కోట్లు విడుదల చేశామని చెప్పారు. దీంట్లో రూ.40 కోట్ల పనులు పూర్తయ్యాయన్నారు. ఈస్ట్‌కోస్ట్ కారిడార్‌పై సర్వే ఖరగ్‌పూర్ నుంచి విజయవాడ వరకు ఈస్ట్‌కోస్ట్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్‌ను పీఎం గతిశక్తి ప్రణాళికలో చేర్చడానికి డీపీఆర్ తయారీకి సర్వే నిర్వహిస్తున్నట్లు కేంద్ర వాణిజ్యశాఖ సహాయమంత్రి సోమ్‌ప్రకాశ్ చెప్పారు. వైఎస్సార్సీపీ సభ్యుడు మాగుంట శ్రీనివాసులురెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ.. డీపీఆర్ వచ్చిన తరువాత తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఏపీలో లిథియం అన్వేషణ ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, కడప జిల్లాలు, పార్నపల్లె–లోపట్నునూతల ప్రాంతంలో లిథియం సంభావ్యత అంచనా వేయడానికి నిఘా సర్వే, అన్వేషణ ప్రాజెక్టును జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా చేపట్టిందని వైఎస్సార్సీపీ ఎంపీలు కోటగిరి శ్రీధర్, చింతా అనూరాధ, సంజీవ్‌కుమార్ సింగరి అడిగిన ప్రశ్నకు జవాబుగా కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. 10 జిల్లాల్లో 33 పత్తి సేకరణ కేంద్రాలు ఆంధ్రప్రదేశ్‌లోని 10 జిల్లాల్లోని 33 ప్రాంతాల్లో పత్తి సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు కేంద్ర జౌళిశాఖ సహాయమంత్రి దర్శన జర్దోష్ చెప్పారు. 1.10.2021 నుంచి 30.9.2022 సీజన్ కోసం ఈ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వైఎస్సార్సీపీ ఎంపీలు బెల్లాన చంద్రశేఖర్, వంగా గీతా విశ్వనాథ్, గోరంట్ల మాధవ్, గొడ్డేటి మాధవి, ఎం.వి.వి.సత్యనారాయణ అడిగిన ప్రశ్నకు జవాబుగా తెలిపారు. 5జీ నైపుణ్య మానవవనరులపై అధ్యయనం చేపట్టలేదు 2025 నాటికి 5జీ నైపుణ్యం కలిగిన 2.2 కోట్ల మంది మానవవనరుల అవసరంపై ఐటీ శాఖ ఎలాంటి అధ్యయనం చేపట్టలేదని వైఎస్సార్సీపీ ఎంపీలు మద్దాల గురుమూర్తి, బి.వి.సత్యవతి అడిగిన ప్రశ్నకు జవాబుగా కేంద్ర ఐటీ శాఖ సహాయమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ చెప్పారు. -
ఓబీసీ ప్రత్యేక శాఖపై ప్రధానితో చర్చిస్తా
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రంలో ఓబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటుపై ప్రధాని మోదీతో చర్చిస్తానని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం తనను కలిసిన బీసీ సంఘాల నేతలకు ఆమె హామీ ఇచ్చారు. అనంతరం బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అధ్యక్షులు కేశన శంకర్, జాజుల శ్రీనివాస్‌గౌడ్ మీడియాతో మాట్లాడారు. జాతీయస్థాయిలో ఓబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు, జనగణనలో కులాల వారీగా జనాభా లెక్కలు చేపట్టాలని పార్టీ తరఫున కూడా ప్రధాని మోదీని కోరతానని అప్పాదళ్ (ఎస్) అధ్యక్షురాలు కూడా అయిన అనుప్రియ పటేల్ హామీ ఇచ్చారని వారిరువురూ తెలిపారు. ఓబీసీలకు మద్దతుగా దేశంలోని అన్ని పార్టీల మద్దతు కోరాలని ఆమె సూచించారన్నారు. స్థానిక రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించండి స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత లేదని.. వాటిని 50 శాతానికి పెంచి చట్టబద్ధత కల్పించాలని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ సహాయ మంత్రి కపిల్ మోరేశ్వర్ పాటిల్‌ను బీసీ సంక్షేమ సంఘం నేతలు కోరారు. ఈ మేరకు ఆదివారం వారు మంత్రికి వినతిపత్రం అందజేశారు. మంత్రిని కలిసిన వారిలో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన బీసీ సంఘాల నేతలు కుమ్మర క్రాంతికుమార్, కనకాల శ్యామ్ కుర్మా, రాచాల యుగేందర్ గౌడ్, కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, తాటికొండ విక్రంగౌడ్, శేఖర్ సగర, రావులకొల్ నరేష్, ఈడిగ శ్రీనివాస్‌గౌడ్, పీ రంగనాథ్, పానుగంటి విజయ్, మూర్తి, సాయితేజ, సతీష్, సత్యం సగర, తదితరులు పాల్గొన్నారు. -
జ్యోతిరాదిత్య సింధియాకే కేంద్ర కేబినెట్ బెర్త్ ఖరారు
-
జ్యోతిరాదిత్యకు బెర్త్ ఖరారు.. అనుప్రియకు కూడా
న్యూఢిల్లీ: బీజేపీ కీలక నేత జ్యోతిరాదిత్య సింధియాకి కేంద్ర కేబినెట్ బెర్త్ ఖరారైనట్లు సమాచారం. జ్యోతిరాదిత్యతో పాటు అప్నాదళ్ నేత అనుప్రియ పటేల్, మహారాష్ట్ర మాజీ సీఎం నారాయణరాణెకు కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వీరు ముగ్గురు ప్రధాని నరేంద్ర మోదీ నివాసానికి చేరుకుంటున్నారు. ఇక వీరితో పాటు సునీత దగ్గల్, బీఎల్ వర్మ, భూపేంద్ర యాదవ్, అనురాగ్ ఠాకూర్, మీనాక్షి లేఖి, అజయ్ భట్, శోభా కర్లందాజే, ప్రీతం ముండే, శంతను ఠాకూర్, కపిల్ పటేల్ సైతం ప్రస్తుతం 7 లోక్ కళ్యాణ్ మార్గ్‌కు పయనమవుతున్నారు. ముగ్గురు సహాయమంత్రులకు ప్రమోషన్? కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డికి ప్రమోషన్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్వతంత్ర హోదాతో శాఖ బదిలీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అదే విధంగా కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి అనురాగ్ ఠాకూర్, కేంద్ర వ్యవసాయ, పంచాయతీరాజ్ సహాయమంత్రి పురుషోత్తం రూపాలకు ప్రమోషన్ దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. -
మీర్జాపూర్ 2ను బ్యాన్ చేయండి: మహిళా ఎంపీ
లక్నో : అమెజాన్ ప్రైమ్ వెబ్ సిరీస్ మీర్జాపూర్ 2ను బ్యాన్ చేయాలని మీర్జాపూర్ అప్నా దల్ ఎంపీ అనుప్రియా పాటేల్ డిమాండ్ చేశారు. సదరు వెబ్ సిరీస్ జాతి అసమానతలను వ్యాప్తి చేస్తోందని ఆమె ఆరోపించారు. మీర్జాపూర్‌ను ఓ హింసాత్మక ప్రదేశంగా చూపిస్తూ దాని పేరు చెడగొడుతోందని మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి యోగీ ఆధిత్యనాథ్ నాయకత్వంలో మీర్జాపూర్ ప్రశాంతతకు కేంద్ర బిందువుగా ఉందని అన్నారు. వెబ్ సిరీస్ విషయంపై తప్పక విచారణ జరిపి తగిన విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ( నాకు కాబోయేవాడు నా షూతో సమానం ) గ్యాంగ్ వార్ నేపథ్యంలో సాగే క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ మీర్జాపూర్. దీనికి కొనసాగింపుగా ఈ నెల 23న అమెజాన్ ప్రైమ్‌లో మీర్జాపూర్ 2 విడుదలైంది. అలీ ఫజల్, పంకజ్ త్రిపాఠి, దివ్యేందు శర్మ, శ్వేత త్రిపాఠి, హర్షితా శేఖర్, అమిత్ సియాల్, విజయ్ వర్మ, ప్రియన్షూ పేన్యూలీ, ఇషా తల్వార్లు కీలక పాత్రల్లో నటించిన ఈ వెబ్ సిరీస్‌కు కరణ్ అన్షుమన్, గుర్మీత్ సింగ్‌లు దర్శకత్వం వహించారు. ఎక్సెల్ మీడియా ఎంటర్టైన్మెంట్ పతాకంపై ఫర్హాన్ అక్తర్, రితేశ్ సిద్వానీ దీన్ని నిర్మించారు. -
‘నా కూతురు బతికిలేదు.. చాలా సంతోషం’
న్యూఢిల్లీ: ‘న్యాయం కోసం ఏడేళ్లుగా నేను చాలా ఓపికగా పోరాడుతున్నాను. అయితే 2012 నాటికి.. నేటికీ ఏమీ మారలేదు. ఈ న్యాయపోరాటంలో నాకు నేనే ప్రశ్నగా మారాను’ అంటూ నిర్భయ తల్లి ఆశాదేవి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. దేశ వ్యాప్తంగా సంచలనంగా సృష్టించిన నిర్భయ అత్యాచార ఉదంతం జరిగి నేటికి ఏడేళ్లు. ఈ సందర్భంగా ఆజ్‌తక్ చానల్ సోమవారం నిర్వహించిన మహిళా భద్రత అంశంపై చర్చలో ఆశాదేవి పాల్గొన్నారు. ఈ క్రమంలో తన కూతురికి న్యాయం జరిగేందుకు తాను పోరాడిన తీరు, అనుభవిస్తున్న మానసిక వేదన గురించి ఆమె చెప్పుకొచ్చారు. అత్యాచార బాధితురాలికి న్యాయం జరగాలంటే ఆమెతో సహా ఆమె కుటుంబం మొత్తం పెద్ద పోరాటమే చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ‘ ఆ దోషులను(నిర్భయ దోషులు) కోర్టులో చూసిన ప్రతీసారీ నేను చచ్చిపోయినట్లుగా అనిపిస్తుంది. నాలాగే నా కూతురికి ఈ పరిస్థితి ఎదురవనందుకు సంతోషం. వాళ్లను చూసేందుకు ఈ రోజు నా కూతురు బతికి లేనందుకు కాస్త సంతోషంగా ఉంది. లేకుంటే తాను కూడా ఎంతో వేదన అనుభవించేది’ తనకు ఎదురవుతున్న చేదు అనుభవాల గురించి పంచుకున్నారు. అదే విధంగా దేశ వ్యాప్తంగా జరుగుతున్న అత్యంత హేయమైన నేరాల గురించి స్పందిస్తూ... ‘ మా కూతుళ్లు ఏం తప్పు చేశారు. వాళ్లపై ఎందుకు అత్యాచారాలకు పాల్పడి కాల్చివేస్తున్నారు. తల్లిదండ్రులుగా మా తప్పేం ఉంది. మేము ఇంకా ఎన్నాళ్లు న్యాయం కోసం ఎదురుచూడాలి. ఓవైపు న్యాయపోరాటం జరుగుతుండగానే.. మరోవైపు అత్యాచారాలు, ఆడపిల్లల సజీవ దహనాలు కొనసాగుతున్నాయి. ఇటువంటి సమస్యలకు వ్యవస్థ, సమాజం ఎందుకు పరిష్కారాలను కనుగొనలేకపోతుంది’ అని ఆశాదేవి ప్రశ్నించారు.(చదవండి: సరిగ్గా ఏడేళ్లు.. కానీ ఆ బస్టాప్ వద్ద ఇంకా.. ) ఇక ఈ చర్చలో పాల్గొన్న ఆలిండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుస్మితా దేవ్ మాట్లాడుతూ... పురుషులు, మహిళలు సమానమే అని రాజ్యాంగం చెబుతున్నా.. వాస్తవంగా అలాంటి పరిస్థితులు ఎక్కడా కనిపించడం లేదన్నారు. లింగవివక్ష తొలగి, చట్టాల పట్ల పూర్తి అవగాహన వచ్చినపుడే ఇలాంటి సామాజిక సమస్యలు తొలగుతాయని అభిప్రాయపడ్డారు. బీజేపీ ఎంపీ బహుగుణ జోషి మాట్లాడుతూ... మహిళల భద్రతకై సమాజం, జాతి మొత్తం ఏకతాటిపైకి వచ్చి బాధితులకు అండగా గళం వినిపించినపుడే ఇలాంటి ఘటనలు పునరావృతం కావన్నారు. ఇక వ్యవస్థలో ఉన్న లొసుగుల కారణంగానే దోషులు తప్పించుకుంటున్నారని, చట్టాలు కఠినతరం చేయాల్సిన ఆవశ్యకత ఉందని అప్నాదళ్ జాతీయ అధ్యక్షురాలు, ఎంపీ అనుప్రియా పటేల్ పేర్కొన్నారు. #AgendaAajTak19 यह कहना आसान है कि रेप हो गया लेकिन उस परिवार से पूछिए कि उनपर क्या बीतती है : आशा देवी, निर्भया की मां लाइव : https://t.co/Aqvb3gJEp3@SwetaSinghAT pic.twitter.com/3fpnajLuVx — आज तक (@aajtak) December 16, 2019 -
బీజేపీకి కేంద్ర మంత్రి అల్టిమేటం
లక్నో: మహారాష్ట్ర, తమిళనాడులలో పొత్తులు ఖరారు చేసుకుని ఫుల్ జోష్‌లో ఉన్న బీజేపీకి ఉత్తరప్రదేశ్‌లో అప్నాదళ్ షాక్ ఇచ్చింది. బీజేపీ తమ సమస్యలను పట్టించుకోకుంటే ఎన్డీఏ కూటమి నుంచి వైదోలుగుతామని అప్నాదళ్ నాయకురాలు, కేంద్ర మంత్రి అనుప్రియా పటేల్ ప్రకటించారు. బీజేపీ మిత్రపక్షాలకు తగిన గౌరవం ఇవ్వడం లేదని పేర్కొన్నారు. 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో తూర్పు ఉత్తరప్రదేశ్‌లో అప్నాదళ్ రెండు సీట్లలో విజయం సాధించింది. తర్వాత జరిగిన పరిణామాల కారణంగా అప్నాదళ్‌లో చీలిక వచ్చినప్పటికీ.. అణుప్రియా పటేల్ బీజేపీతో కలిసి ముందుకు సాగిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘తమకు బీజేపీతో కొన్ని సమస్యలు తలెత్తాయి. వాటిని పరిష్కారించేందుకు బీజేపీకి పిబ్రవరి 20వ తేదీ వరకు గడువు ఇచ్చాం. కానీ వారు తమ సమస్యలపై స్పందించలేదు. బీజేపీ తమ మిత్ర పక్షాల సమస్యలను పట్టించుకోవడానికి సిద్దంగా లేదు. మేము పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాం. పార్టీ ఎలా నిర్ణయం తీసుకుంటే దానికి మేము కట్టుబడి ఉంటాం. మా నిర్ణయాన్ని త్వరలోనే వెల్లడిస్తామ’ని తెలిపారు. గత కొంతకాలంగా అప్నాదళ్ నేతలు బీజేపీ తమ సమస్యలు పట్టించుకోవడం లేదని వ్యాఖ్యానిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, రానున్న లోక్‌సభ ఎన్నికల్లో అప్నాదళ్ కోరినన్ని ఎక్కువ సీట్లు ఇవ్వకపోవడం వల్లనే వారు ఈ విధంగా మాట్లాడుతున్నారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. బీజేపీ నాయకుల వ్యాఖ్యలను అప్నా దళ్ అధ్యక్షుడు అనీశ్ పటేల్ ఖండించారు. ప్రధాని నరేంద్ర మోదీ తిరిగి ప్రధానిగా ఎన్నిక కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని తెలిపారు. కానీ ఉత్తరప్రదేశ్ బీజేపీ మాత్రం పద్దతి మార్చుకోవాలని సూచించారు. తమ డిమాండ్లు నెరవేరితే.. 2019 ఎన్నికల్లో బీజేపీకి పూర్తి మద్దతిస్తామని ఆయన వెల్లడించారు. గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఉత్తరప్రదేశ్‌లో భారీ సీట్లు సాధించింది. అయితే రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించడానికి ఎస్పీ, బీఎస్పీ కూటమిగా బరిలోకి దిగుతున్నాయి. ఈ సమయంలో మిత్రపక్షం నుంచి హెచ్చరికలు రావడం బీజేపీకి మంచి పరిణామం కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
50% అడ్డంకి కాబోదు: జైట్లీ
జనరల్ కేటగిరీలో 10శాతం రిజర్వేషన్లు కల్పిస్తామంటూ కాంగ్రెస్ సహా అన్ని పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోల్లో ప్రకటించాయి. సుప్రీంకోర్టు రిజర్వేషన్లపై 50 శాతం పరిమితి విధించినందున మరో 10 శాతం రిజర్వేషన్ కల్పించడం కోర్టు తీర్పుకు ధిక్కరించినట్లవుతుందన్న వాదన అర్థ రహితం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 16(4) ప్రకారం సుప్రీంకోర్టు విధించిన 50శాతం పరిమితి కులాల ప్రాతిపదికన ఇచ్చే రిజర్వేషన్లకు మాత్రమే వర్తిస్తుంది. అంతేతప్ప, జనరల్ కేటగిరీకి కాదు. గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు మార్లు నోటిఫికేషన్ల ద్వారా రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రయత్నించిన కారణంగా విఫలమయ్యాయి. ఆర్టికల్ 368 పార్ట్ 3 ప్రకారం..ప్రాథమిక హక్కుల సవరణకు రాష్ట్రాల అంగీకారం పొందాల్సిన అవసరం కూడా లేదు. ఉదాహరణకు..ప్రమోషన్లకు సంబంధించి ఆర్టికల్ 15(5)కు చేపట్టిన సవరణ పార్లమెంట్ ఆమోదం ద్వారానే జరిగింది. ఇప్పటివరకు సామాజికంగా వెనుకబడిన వర్గాలకు మాత్రమే రాజ్యాంగం రిజర్వేషన్ కల్పిస్తోంది. ప్రస్తుత 124వ రాజ్యాంగ సవరణ–2019 ద్వారా ఆర్థికంగా బలహీన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించేందుకు కొన్ని నిబంధనలను చేరుస్తున్నాం. కులం, ఆర్థికత ఆధారంగా పౌరులకు సమాన అవకాశాలు కల్పించాలి. అయితే, సమానులను అసమానంగా చూడరాదు. అసమానులను కూడా సమానంగా భావించరాదు. రాజ్యాంగ మూల స్వరూపాన్ని మార్చకుండా మేం చేపట్టిన ఈ ప్రయత్నం సఫలమవుతుందని ఆశిస్తున్నాం. ఎన్నికల మేనిఫెస్టోలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజరేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ..మాటపై నిలబడి బిల్లుకు ఆమోదం తెలపాలి. ప్రతిపక్షాలు నిరసనలు తెలపడం మాని, మనస్ఫూర్తిగా బిల్లుకు ఆమోదం ప్రకటించాలి. అనుప్రియా పటేల్, అప్నాదళ్ ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో మాదిరిగా కాకుం డా ఆర్థికంగా వెనుకబడిన వారికి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పిస్తున్నాం. 2021 లో కుల ప్రాతిపదికన జన గణన చేపట్టి స్పష్టత తీసుకువస్తాం. ప్రైవేట్ రంగానికి కూడా ఈ రిజర్వేషన్లు వర్తింప జేసే విషయాన్ని పరిశీలిస్తున్నాం. రాం విలాస్ పాశ్వాన్, కేంద్రమంత్రి జనరల్ కేటగిరీలో 60శాతం రిజర్వేషన్లను రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చాలి. తద్వారా సుప్రీంకోర్టులో సవాల్ చేసే వీలుండదు. ప్రైవేట్ రంగంలో కూడా 60శాతం రిజర్వేషన్లు కల్పించాలి. దీంతోపాటు ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీసెస్ ఏర్పాటు చేయాలి. దీనివల్ల పారదర్శకత పెరుగుతుంది. -
యోగి ప్రోగ్రామ్‌కు అనుప్రియ డుమ్మా
గోరఖ్‌పూర్: కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ బీజేపీ నేతలకు షాకిచ్చారు. ఉత్తరప్రదేశ్‌లోని దియోరియా జిల్లాలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్న కార్యక్రమానికి ఆమె గైర్హాజరయ్యారు. మిత్రపక్షాలను బీజేపీ పట్టించుకోవడం లేదని అనుప్రియ భర్త, అప్నాదళ్ చీఫ్ ఆశిష్ పటేల్ మంగళవారం మీడియా సమావేశం ఏర్పాటుచేసి మరీ ఆరోపించిన నేపథ్యంలో అనుప్రియ గైర్హాజరు కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ విషయమై అప్నాదళ్ నేత అనురాగ్ మాట్లాడుతూ.. ప్రభుత్వం అనుప్రియకు అధికారిక ఆహ్వానం పంపలేదని తెలిపారు. అందువల్లే దియోరియాలో వైద్య కళాశాల ప్రారంభోత్సవానికి ఆమె రాలేదన్నారు. మరోవైపు ఈ విషయమై దియోరియా బీజేపీ మీడియా ఇన్చార్జ్ సత్యేంద్ర మణి స్పందిస్తూ.. మంత్రి అనుప్రియ మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవంతో పాటు సిద్ధార్థ్ నగర్లో జరిగిన మరో కార్యక్రమానికి హాజరుకాలేదని వెల్లడించారు. అయితే ఇందుకు కారణం ఏంటో తనకు తెలియదన్నారు. -
షాకింగ్ : అనుప్రియకు వేధింపులు
లక్నో, ఉత్తరప్రదేశ్ : కుటుంబ, ఆరోగ్య సంక్షేమ శాఖ కేంద్ర సహాయ మంత్రి అనుప్రియా పటేల్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఉత్తరప్రదేశ్‌లోని ఆమె సొంత నియోజకవర్గం మీర్జాపూర్‌కు వెళ్లిన ఆమెను కొందరు ఆకతాయిలు వేధించారు. దీనిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. మీర్జాపూర్లో సోమవారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న అనుప్రియ తిరిగివస్తున్న సమయంలో ముగ్గురు యువకులు కారులో ఆమె కాన్వాయ్‌ను ఓవర్ టేక్ చేసేందుకు ప్రయత్నించారు. దీంతో భద్రతా సిబ్బంది వారిని హెచ్చరించారు. అయినా పట్టించుకోని ఆకతాయిలు మంత్రి, సెక్యూరిటీ సిబ్బందిని ఉద్దేశించి అసభ్యంగా మాట్లాడారు. యువకుల ప్రయాణిస్తున్న కారుకు నెంబర్ ప్లేట్ లేదు. మంత్రి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఆకతాయిలను అరెస్టు చేసి, కారును స్వాధీనం చేసుకున్నారు. కాగా, మహిళల రక్షణ కోసం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం యూపీలో యాంటీ రోమియో స్క్వాడ్స్‌ను నియమించిన విషయం తెలిసిందే. అయితే, ఆశించిన స్థాయిలో ఈ స్క్వాడ్స్ ఫలితాలను ఇవ్వలేకపోతున్నాయి. ఏకంగా కేంద్రమంత్రిపైనే ఆకతాయిలు వేధింపులకు దిగడం యూపీలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. -
‘వైద్యానికి 2.5 శాతం ఖర్చు చేస్తాం’
న్యూఢిల్లీ : 2025 కల్లా దేశ ప్రజల వైద్యానికి జాతీయాదాయంలో 2.5 శాతం ఖర్చు చేయడమే లక్ష్యమని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. జాతీయ ఆరోగ్య విధానం(ఎన్హెచ్పీ)-2017 అమలు చేయడం ద్వారా ప్రజల ఆరోగ్య ప్రమాణాలు పెంచుతామని తెలిపింది. వాటాదారులతో చర్చలు జరిపి, కిందిస్థాయిలో పరిస్థితులను బేరీజు వేసుకుని ఎన్హెచ్పీ విధానాన్ని రూపొందిచినట్టు పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వైద్యం కొరకు బడ్జెట్లో కేటాయింపులను పెంచాలని విజ్ఞప్తి చేసింది. ఎన్హెచ్పీ అమలుకు సంబంధించిన ప్రణాళికలను ముందే రూపొందిచినట్టు వెల్లడించింది. అన్ని స్థాయిల్లోని సంబంధిత అధికారులు ఈ విధానాన్ని విజయవంతం చేయడానికి కృషి చేయాలని కోరింది. దేశ ప్రజలకు మెరుగైన వైద్యం అందించడానికి, వైద్య సేవలను పెంచడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ తెలిపారు. మంగళవారం రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు ఆమె లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. ప్రజల ఆరోగ్యం కోసం కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలపై అనుప్రియ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా ఉచితంగా మందులు అందజేయడం, ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఉచితంగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు జరిపి అందుకు సంబంధించిన మెడిసిన్ ఇవ్వడం, జనని శిశు సురక్ష, రాష్ట్రీయ బాల స్వస్థ్య, రాష్ట్రీయ కిశోర్ స్వస్థ్య కార్యక్రమాలను ద్వారా ప్రజలకు మేలు చేకూర్చడం. జాతీయ క్షయ నియంత్రణ, జాతీయ వ్యాధుల నివారణ, జాతీయ కుష్టు అవగాహన, జాతీయ ఎయిడ్స్ నివారణ కార్యక్రమాల ద్వారా క్షయ, కుష్టు, ఎయిడ్స్, టీబీ రోగులకు మందులు అందజేత. ఆరోగ్య ఉప కేంద్రాలు, ప్రైమరీ హెల్త్ సెంటర్లను( పీహెచ్సీ) పూర్తి స్థాయి ఆరోగ్య కేంద్రాలుగా మార్చడం. ప్రమాదకరమైన రొమ్ము, నోటి, గర్భాశయ క్యాన్సర్లను, హైపర్ టెన్షన్, డయాబెటిస్ తదితర వ్యాధులను గుర్తించి వాటికి సరైన ప్రణాళిక ద్వారా చికిత్స అందించడం. జిల్లా ఆస్పత్రులలో ప్రధానమంత్రి జాతీయ డయాలసిస్ కార్యక్రమం ద్వారా ఉచితంగా వైద్యం అందించడం. దేశంలోని ఆస్పత్రులను బలోపేతం చేయడం. ప్రతి రాష్ట్రంలో ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్)లను నిర్మించడం. ప్రభుత్వ వైద్య కళాశాలలను ఆధునీకరించడం ద్వారా ఖరీదైన వైద్య సేవలను ప్రభుత్వం ద్వారా ప్రజలకు అందజేయవచ్చు. జన్ ఔషధి పథకం ద్వారా పెద్ద సంఖ్యలో జనరిక్ మందులను ఉత్పత్తి చేసి వాటిని తక్కువ ధరలకే ప్రతి ఒక్కరికి అందజేయడం. రాష్ట్రీయ స్సస్థ్య బీమా యోజన ద్వారా కుటుంబలోని ప్రతి ఒక్కరికి బీమా చేయించి, వారికి నగదు రహిత వైద్య చికిత్సలకు స్మార్ట్ కార్డ్‌లు అందజేయడం. -
ప్రమాదంలో కేంద్ర మంత్రికి గాయాలు
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి అనుప్రియా పటేల్‌కు యాక్సిడెంట్లో గాయాలయ్యాయి. ఆదివారం ఉదయం అలహబాద్‌లో ఆమె ప్రయాణిస్తున్న కాన్వాయ్‌లో వాహనాలు ఒకదాంతో మరొకటి ఢీకొట్టాయి. ప్రమాదంలో ఆమెకు స్వల్ప గాయాలైనట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి బాగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. Cars in Union Minister Anupriya Patel's convoy collided with each other in #Allahabad, Minister sustained minor injuries (File pic) pic.twitter.com/eEYHOF6D73 — ANI UP (@ANINewsUP) December 31, 2017 -
'చంద్రబాబు ప్రభుత్వం మొద్దు నిద్రపోతోంది'
-
'చంద్రబాబు ప్రభుత్వం మొద్దు నిద్రపోతోంది'
సాక్షి, న్యూఢిల్లీ: విష జ్వరాలతో సతమతమవుతున్న ప్రకాశం జిల్లాను ఆదుకోవాలని వైఎస్సార్సీపీ పార్లమెంట్ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి కేంద్రమంత్రిని కోరారు. ఈమేరకు కేంద్ర ఆరోగ్యశాఖా సహాయ మంత్రి అనుప్రియా పటేల్‌ను కలిసి జిల్లాలో నెలకొన్న పరిస్థతులను వివరించారు. ప్రకాశం జిల్లాలో విషజ్వరాలు ప్రభలతున్నాయని, వాటికారణంగా మందిలాది మంది ప్రజలు మృత్యువాత పడుతున్నారని మంత్రికి తెలిపారు. జ్వరాల నివారణకు కేంద్రం వెంటనే తగు చర్యలు తీసుకోవాలని ఆయన మంత్రిని కోరారు. అంతేకాకుండా ఒంగోలు రిమ్స్ ఆస్పత్రిలో ప్లేట్లెట్స్ కౌంటింగ్ మిషన్స్‌ను ఏర్పాటు చేయాలన్నారు. ప్రజా సంక్షేమం దృష్ట్యా ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకొని తగిన ఏర్పాట్లు చేయాలని మంత్రిని కోరారు. గత నెలలో జిల్లా వ్యాప్తంగా విషజ్వరాలతో వంద మందికిపైగా మృతిచెందితే చంద్రబాబు ప్రభుత్వానికి చీమకుట్టినట్లుగా కూడా లేదని విమర్శించారు. ప్రజల ఆరోగ్యాన్ని విస్మరించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొద్దు నిద్రపోతోందని వైవీ మండిపడ్డారు. -
ఊప్రతి నలుగురిలో ఒకరికి..
మానసిక సమస్యలపై కేంద్ర మంత్రి ఫగ్గాన్ సింగ్ సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో మానసిక వ్యాధులకు దారి తీస్తున్న పరిస్థితులు, రుగ్మతలకు చికిత్సలపై ప్రజల్లో అవగాహన కల్పించడం అత్యవసరమని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ఫగ్గాన్ సింగ్ అన్నారు. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా సోమవారం ఢిల్లీలో ఏర్పాటుచేసిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దేశంలో ప్రతి నలుగురిలో ఒకరు తమ జీవితంలో ఒక్కసారైనా మానసిక రుగ్మతల బారిన పడుతున్నారన్నారు. మానసిన వ్యాధులతో బాధపడుతున్న వారిని సమాజం ఏకాకుల్ని చేయడం, వివక్ష చూపడంతో వారు చికిత్సకు దూరమవుతున్నారని తెలిపారు. ఇలాంటి వ్యక్తుల విషయంలో సమాజం వైఖరి మారాలన్నారు. చికిత్స విషయంలో ఆరోగ్య వ్యవస్థను సున్నితంగా, ఆమోదయోగ్యంగా మార్చడంలో ఎదురయ్యే సవాళ్లను అందరూ కలసికట్టుగా అధిగమించాలన్నారు. భౌతికంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే పరిపూర్ణ ఆరోగ్యవంతులమవుతామని కేంద్ర సహాయ మంత్రి అనుప్రియ పటేల్ అన్నారు. దేశంలో దాదాపు ఏడు శాతం ప్రజలు మానసిక రుగ్మతలతో బాధపడుతున్నారని, సమస్య పరిష్కారానికి మానసిక నిపుణుల అవసరముందన్నారు. అందుకు జాతీయ మానసిక ఆరోగ్య పథకం కింద కేంద్రం నిధులు కేటాయిస్తోందని చెప్పారు. -
అనుప్రియపై దాడి, 158 మందిపై కేసు
ప్రతాప్‌గఢ్: కేంద్ర మంత్రి అనుప్రియ పటేల్ పట్ల అనుచితంగా ప్రవర్తించిన కేసులో 158 మందిపై ఉత్తరప్రదేశ్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రాణిగంజ్ పోలీసు స్టేషన్ లో కేసులు పెట్టారు. స్థానిక నాయకుడు వినోద్ దూబే సహా 157 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు సీనియర్ పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు. అనుప్రియ పటేల్, అప్నా దళ్ కార్యకర్తల పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించారన్న ఆరోపణలతో కేసు నమోదు చేసినట్టు చెప్పారు. అనుప్రియ పటేల్ ఆదివారం ప్రతాప్‌గఢ్ జిల్లాలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె కాన్వాయ్ పై దుండగులు దాడి చేశారు. అధికార సమాజ్‌వాదీ పార్టీ కార్యకర్తలే తన కాన్వాయ్‌పై దాడిచేశారని అనుప్రియ ఆరోపించారు. తమ రోడ్ షోను అడ్డుకోవాలన్న కుట్రతో తమపై దాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు. కేంద్ర మంత్రినైన తనకే రక్షణ లేకుంటే సామాన్యుల పరిస్థితి ఏంటని ఆమె ప్రశ్నించారు. -
కడుపు నింపుకోడానికే ఒళ్లు అమ్ముకుంటున్నారు: మంత్రి
మహిళలు కడుపు నింపుకోడానికే తమ శరీరాలు అమ్ముకుంటున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ వ్యాఖ్యానించారు. నరేంద్రమోదీ ప్రభుత్వం చేపట్టిన పథకాలను ఉపయోగించుకోవాలి తప్ప.. ఇలా చేయకూడదని సరోగసీ బిల్లు గురించి మాట్లాడుతూ ఆమె ఇలా చెప్పారు. సులభంగా డబ్బు సంపాదించుకోవడం కోసం ఆయా కుటుంబాలు ఈ మహిళలతో వాళ్ల గర్భాలు అద్దెకు ఇచ్చేలా చేస్తున్నాయని మండిపడ్డారు. మహిళలకు సొంత నిర్ణయాలు తీసుకునే హక్కు ఉంటుంది కదా అని ప్రశ్నించగా, భారతదేశంలో ఎంతమంది మహిళలు సొంతంగా నిర్ణయాలు తీసుకోగలుగుతున్నారని ఆమె అన్నారు. వాళ్లతో బలవంతంగా ఇలా చేయిస్తున్నారని చెప్పారు. జీవనోపాధి కోసం గర్భాలను అద్దెకు ఇవ్వడం ఒక్కటే మార్గం కాదన్న విషయాన్ని మహిళలకు చెప్పాలని ప్రభుత్వం భావిస్తోందని అనుప్రియా పటేల్ అన్నారు. వాణిజ్యపరమైన సరొగసీని నిషేధిస్తూ కేంద్ర మంత్రివర్గం గత వారం ఒక బిల్లును ఆమోదించింది. కేవలం సన్నిహిత బంధువులు మాత్రమే ఇలా చేయొచ్చని ఈ బిల్లు చెబుతోంది. కొత్తగా పెళ్లయిన జంటలు, ఎన్నారైలు, గేలు సరొగసీ ద్వారా పిల్లలను పొందడానికి వీల్లేకుండా నిషేధిస్తోంది. అయితే.. దీనివల్ల పిల్లలు లేని జంటలకు అవకాశాలు తగ్గిపోతాయని కొందరు అంటున్నారు. దీనివల్ల అక్రమంగా సరొగసీకి వెళ్లే అవకాశాలు ఎక్కువవుతాయని, నిజంగా పిల్లలు కావాలనుకునేవాళ్లు థాయ్‌లాండ్ లాంటి ఇతర దేశాలకు వెళ్లే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఢిల్లీలోని సుప్రసిద్ధ లేడీ శ్రీరామ్ కాలేజిలో చదివిన అనుప్రియా పటేల్.. అక్రమ సరొగసీ మీద గట్టిగా పోరాడుతున్నారు. మన దేశంలో ఈ పేరుతో దాదాపు 200 కోట్ల డాలర్ల వ్యాపారం జరుగుతోందని ఆమె అంటున్నారు. -
'నా కుమార్తెను బీజేపీ లాక్కెళ్లింది'
వారణాసి: తన కుమార్తెను బీజేపీ లాక్కుపోయిందని కేంద్ర మంత్రి అనుప్రియ పటేల్ తల్లి, అప్నాదళ్ పార్టీ అధ్యక్షురాలు కృష్ణా పటేల్ ఆరోపించారు. తమ పార్టీని బీజేపీ మోసం చేసిందని విమర్శించారు. 'లోక్‌సభ ఎన్నికల్లో కుర్మీ సామాజిక వర్గం ఓట్ల కోసం మా పార్టీని పావుగా బీజేపీ వాడుకుంది. ఇప్పుడు మా కుటుంబంలో చిచ్చు పెట్టింద'ని కృష్ణా పటేల్ పేర్కొన్నారు. అప్నా దళ్ నుంచి బహిష్కరించిన అనుప్రియకు కేంద్ర మంత్రి పదవి కట్టబెట్టడాన్ని ఆమె తప్పుబట్టారు. నాయకత్వంపై తల్లితో విభేదించిన అనుప్రియను గతేడాది పార్టీ నుంచి బహిష్కరించారు. 'నా కూతురి విషయంలో బీజేపీ చేసింది తప్పు. నా కూతుర్ని లాక్కుపోయి మమ్మల్ని బీజేపీ మోసం చేసింది. అనుప్రియకు మంత్రి పదవి ఇస్తున్న విషయం మాట మాత్రంగానైనా మాకు చెప్పలేదు. సంకీర్ణ కూటమిలో ఉన్న పార్టీకి కనీస సమాచారం ఇవ్వకపోవడం దారుణం. మేము ఎక్కువకాలం ఎన్డీలే కొనసాగకపోవచ్చు. భవిష్యత్ ఎన్నికల్లో మేము ఒంటరిగా బరిలోకి దిగుతామ'ని కృష్ణా పటేల్ పేర్కొన్నారు. -
తల్లి తరిమేస్తే.. కేంద్రమంత్రి అయ్యారు!
అనుప్రియా పటేల్.. ఈ పేరు కేంద్ర మంత్రివర్గంలో కొత్తగా వినిపించినా, చాలా ప్రముఖంగానే వినిపించింది. నరేంద్రమోదీ కొత్తగా తీసుకున్న 19 మందిలో ఈమె ఒకరు. ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ 35 ఏళ్ల ఎంపీ.. మంత్రివర్గంలో అతి పిన్న వయస్కురాలు. అయితే.. ఆమె మంత్రి అయినందుకు అనుప్రియ తల్లి మాత్రం అస్సలు సంతోషించడం లేదట. యూపీలో బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న అప్నాదళ్ అధ్యక్షురాలు కృష్ణా పటేల్ కూతురే అనుప్రియా పటేల్. అయితే, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న పేరుతో గత సంవత్సరమే తన కూతురిని కృష్ణాపటేల్ ఆరేళ్ల పాటు పార్టీనుంచి బహిష్కరించారు. వాస్తవానికి 2009లో అప్నాదళ్ వ్యవస్థాపకుడు, అనుప్రియ తండ్రి సోనేలాల్ మరణించినప్పటి నుంచి పార్టీ అధ్యక్ష పదవి కోసం తల్లీ కూతుళ్ల మధ్య పెద్ద యుద్ధమే జరుగుతోంది. వచ్చే సంవత్సరం యూపీలో ఎన్నికలు జరగనుండటంతో అనుప్రియను తీసుకోవడం మంచిదని బీజేపీ భావించినట్లు తెలుస్తోంది. ఆమె కుర్మి కులానికి చెందినవారు కావడం.. ఆ కులం యూపీలో రాజకీయంగా పట్టున్న బీసీ కులం కావడం కూడా కలిసొచ్చే అంశాలని భావిస్తున్నారు. కుర్మి కులానికే చెందిన బిహార్ సీఎం నితీష్ కుమార్‌కు చెక్ పెట్టడానికి ఈమె ఉపయోగపడతారని అనుకుంటున్నారు. ఢిల్లీలోని ప్రతిష్ఠాత్మక లేడీ శ్రీరామ్ కాలేజి నుంచి సైకాలజీలో డిగ్రీతో పాటు ఎంబీఏ కూడా చేసిన అనుప్రియా పటేల్ మంచి వక్తగా పేరొందారు. 2012 యూపీ ఎన్నికల్లోనే తొలిసారిగా ఆమె రాజకీయాల్లోకి ప్రవేశించారు. రెండేళ్ల తర్వాత లోక్‌సభకు ఎన్నికయ్యారు. పార్లమెంటులో కూడా ఆమె తన ప్రశ్నలతో, వాగ్ధాటితో అందరినీ ఆకట్టుకున్నారు. అప్నాదళ్ పార్టీకి లోక్‌సభలో ఇద్దరే ఎంపీలున్నారు. ఒకరు అనుప్రియ కాగా, మరొకరు హరివంశ్ సింగ్. ఆయన పటేల్ తల్లికి అనుచరుడు. తన కూతురిని మంత్రిగా చేస్తే బీజేపీతో తెగతెంపులు చేసుకుంటామని కూడా ఇటీవలే కృష్ణాపటేల్ బెదిరించినట్లు తెలిసింది. -
మోదీ టీమ్‌లోకి మరో ఇద్దరు మహిళలు
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ తన మంత్రివర్గంలో మరో ఇద్దరు మహిళలకు అవకాశం కల్పించారు. కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన మహిళా ఎంపీలు కృష్ణరాజ్, అనుప్రియా పటేల్‌కు మంత్రి పదవులు దక్కాయి. మంగళవారం ఉదయం రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర కేబినెట్ విస్తరణలో ఆ రాష్ట్రానికి పెద్దపీట వేశారు. కృష్ణరాజ్ బీజేపీ ఎంపీ కాగా, అనుప్రియా పటేల్ ఎన్డీయే మిత్రపక్షం ఆప్నా దళ్ ఎంపీ. -
కొత్తగా 9 మందికి ఛాన్స్!
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధం చేశారు. కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో 9 మందికి అవకాశం కల్పించనున్నారని సమాచారం. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఉత్తరప్రదేశ్ కు పెద్దపీట వేసే అవకాశముందని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. యూపీకి చెందిన భాగస్వామ్య పక్షం అప్నా దళ్ కు చెందిన బీసీ ఎంపీ అనుప్రియ పటేల్ కు కేబినెట్లో స్థానం కల్పించనున్నట్టు తెలుస్తోంది. యూపీకి చెందిన పలువురు బీజేపీ నాయకులకు కూడా కేబినెట్ బెర్త్ ఖాయమంటున్నారు. మంత్రిపదవులు వస్తాయని భావిస్తున్న యూపీ బీజేపీ నేతలు సోమవారం అమిత్ షాను కలిశారు. రాజస్థాన్ బికనీర్ లోక్ స్థానానికి ప్రాతినిథ్యం వహిస్తున్న దళితనేత పీపీ చౌధురి కూడా కేబినెట్ లో చేర్చుకుంటారని సమాచారం. ఎస్ఎస్ ఆహ్లువాలియా, రాజ్యసభ సభ్యుడు విజయ్ గోయల్, ఉత్తరాఖండ్ దళిత ఎంపీ అజయ్ తమ్తా, గుజరాత్ రాజ్యసభ ఎంపీ పురుషోత్తం రూపాల, మహారాష్ట్ర ఆర్పీఐ ఎంపీ రామదాస్ అథవాలే, యూపీ ఎంపీ మహేంద్ర నాథ్ పాండే, యూపీ దళిత ఎంపీ క్రిషన్ రాజ్ లకు మంత్రి పదవులు దక్కనున్నాయని తెలుస్తోంది. కొంత మంది మంత్రులను తప్పించే అవకాశముందంటున్నారు. అయితే సీనియర్ మంత్రులకు పదవీగండం లేదని సమాచారం. మంగళవారం ఉదయం 11 గంటలకు కేబినెట్ విస్తరణ ఉంటుందని ప్రభుత్వ ప్రధాన సమాచార ప్రతినిధి ఫ్రాంక్ నొరొన్హా ట్వీట్ చేశారు. -
తల్లిపై ఎంపీ అనుప్రియ ఆగ్రహం
లక్నో(యూపీ): తన సోదరి పల్లవి పటేల్ కు పార్టీ ఉపాధ్యక్ష పదవి కట్టబెట్టడాన్ని అప్నా దళ్ ఎంపీ అనుప్రియ పటేల్ తప్పుబట్టారు. అప్నా దళ్ అధ్యక్షురాలు, తన తల్లి కృష్ణా పటేల్ తీసుకున్న నిర్ణయాన్ని ఆమె వ్యతిరేకించారు. పార్టీ రాజ్యాంగం ప్రకారం తన సోదరి నియామకం చెల్లదన్నారు. పార్టీ అధ్యక్షురాలు తనకు తానుగా కొత్తపదవి సృష్టించే అధికారం లేదన్నారు. ఉపాధ్యక్ష పదవిని రద్దు చేస్తూ ఈనెల 20న జరిగిన జాతీయ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఏకగ్రీవం తీర్మానం చేసిందని అనుప్రియ తెలిపారు. అనుప్రియ అప్నా దళ్ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. అనుప్రియ అక్కను పార్టీ ఉపాధ్యక్ష పదవిలో ఇటీవల కృష్ణా పటేల్ నియమించారు. -
మహిళా రిజర్వేషన్లలో ఉపకోటా ఉండాల్సిందే!
జేడీ(యూ) డిమాండ్ న్యూఢిల్లీ: మహిళా రిజర్వేషన్లలో ఎస్సీ, ఎస్సీ, ఓబీసీలకు ఉపకోటా కల్పించాలంటున్న బీజేపీ భాగస్వామ్య పక్షం అప్నాదళ్ సరసన జేడీ(యూ) కూడా చేరింది. ఈ అంశంపై అప్నాదళ్ ఎంపీ అనుప్రియా పటేల్ చేసిన డిమాండ్‌కు జేడీ(యూ) పూర్తిగా మద్దతిస్తోందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ త్యాగి శనివారం తెలిపారు. పార్లమెంటు, అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే ఉద్దేశంతో రూపొందించిన మహిళా బిల్లులో ఓబీసీలకు, ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక ఉప కోటా ఇవ్వాలన్న అంశానికి తాము సానుకూలమని అనుప్రియా పటేల్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. మహిళా బిల్లుకు బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందంటూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈనెల 9న పార్లమెంటు ఉభయ సభలనుద్దేశించి చేసిన ప్రసంగంలో స్పష్టంచేశారు. ఈ నేపథ్యంలో అందులో ఉపకోటా కల్పించాలని అనుప్రియ వ్యాఖ్యానించారు. తాజాగా మహిళా కోటాలో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఉపకోటా కల్పించడం సమర్థనీయమేనని త్యాగి స్పష్టంచేశారు. గతంలో బీజేపీ నేత ఉమాభారతి కూడా ఇదే తరహా డిమాండ్‌ను ప్రస్తావించారని, అలాగే బీజేపీ నేత గోపీనాథ్ ముండే సైతం కోటాలో ఉపకోటా కల్పించాలని డిమాండ్ చేశారని త్యాగి గుర్తుచేశారు.