లక్నో(యూపీ): తన సోదరి పల్లవి పటేల్ కు పార్టీ ఉపాధ్యక్ష పదవి కట్టబెట్టడాన్ని అప్నా దళ్ ఎంపీ అనుప్రియ పటేల్ తప్పుబట్టారు. అప్నా దళ్ అధ్యక్షురాలు, తన తల్లి కృష్ణా పటేల్ తీసుకున్న నిర్ణయాన్ని ఆమె వ్యతిరేకించారు. పార్టీ రాజ్యాంగం ప్రకారం తన సోదరి నియామకం చెల్లదన్నారు. పార్టీ అధ్యక్షురాలు తనకు తానుగా కొత్తపదవి సృష్టించే అధికారం లేదన్నారు.
ఉపాధ్యక్ష పదవిని రద్దు చేస్తూ ఈనెల 20న జరిగిన జాతీయ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఏకగ్రీవం తీర్మానం చేసిందని అనుప్రియ తెలిపారు. అనుప్రియ అప్నా దళ్ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. అనుప్రియ అక్కను పార్టీ ఉపాధ్యక్ష పదవిలో ఇటీవల కృష్ణా పటేల్ నియమించారు.
తల్లిపై ఎంపీ అనుప్రియ ఆగ్రహం
Published Wed, Oct 22 2014 8:28 PM | Last Updated on Sat, Sep 2 2017 3:15 PM
Advertisement