
అనుప్రియా పటేల్
గోరఖ్‌పూర్: కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ బీజేపీ నేతలకు షాకిచ్చారు. ఉత్తరప్రదేశ్‌లోని దియోరియా జిల్లాలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్న కార్యక్రమానికి ఆమె గైర్హాజరయ్యారు. మిత్రపక్షాలను బీజేపీ పట్టించుకోవడం లేదని అనుప్రియ భర్త, అప్నాదళ్ చీఫ్ ఆశిష్ పటేల్ మంగళవారం మీడియా సమావేశం ఏర్పాటుచేసి మరీ ఆరోపించిన నేపథ్యంలో అనుప్రియ గైర్హాజరు కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ విషయమై అప్నాదళ్ నేత అనురాగ్ మాట్లాడుతూ.. ప్రభుత్వం అనుప్రియకు అధికారిక ఆహ్వానం పంపలేదని తెలిపారు. అందువల్లే దియోరియాలో వైద్య కళాశాల ప్రారంభోత్సవానికి ఆమె రాలేదన్నారు. మరోవైపు ఈ విషయమై దియోరియా బీజేపీ మీడియా ఇన్‌చార్జ్ సత్యేంద్ర మణి స్పందిస్తూ.. మంత్రి అనుప్రియ మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవంతో పాటు సిద్ధార్థ్ నగర్‌లో జరిగిన మరో కార్యక్రమానికి హాజరుకాలేదని వెల్లడించారు. అయితే ఇందుకు కారణం ఏంటో తనకు తెలియదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment