‘ఇండియా’ కూటమికి మిత్రపక్షమైన అప్నా దళ్ (కామెరవాడి) ఉత్తరప్రదేశ్‌లో రాబోయే లోక్‌సభ ఎన్నికలకు మూడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఫుల్‌పూర్, మీర్జాపూర్, కౌశాంబి మూడు స్థానాల్లో పోటీ చేయాలని పార్టీ నిర్ణయించింది.
“అప్నా దళ్ (కె) కేంద్ర కార్యవర్గ సమావేశం జాతీయ అధ్యక్షురాలు కృష్ణ పటేల్ ఆధ్వర్యంలో జరిగింది. ఇండియా కూటమిలో భాగంగా మూడు స్థానాల్లో పోటీ చేయాలని సమావేశంలో నిర్ణయించారు' అని కేంద్ర కార్యాలయ కార్యదర్శి రామ్ సనేహి పటేల్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్‌లు సీట్ల పంపకాన్ని నిర్ణయించుకున్నాయి, దాని ప్రకారం కాంగ్రెస్ 17 స్థానాల్లో పోటీ చేయగా, సమాజ్‌వాదీ పార్టీ 63 స్థానాల్లో తమ అభ్యర్థులను నిలబెట్టనుంది. సమాజ్‌వాదీ పార్టీ తృణమూల్ కాంగ్రెస్‌కి భదోహి సీటును ఇచ్చింది. అక్కడ లలితేష్ త్రిపాఠిని అభ్యర్థిగా నిలిపింది. అప్నాదళ్ (కె) సీట్లను ప్రకటించడంపై సమాజ్‌వాదీ పార్టీ నేతలను ప్రశ్నించగా.. దాని గురించి తమకు తెలియదన్నారు.
2019 లోక్‌సభ ఎన్నికలలో అప్నా దళ్ (సోనీలాల్) నాయకురాలు అనుప్రియ పటేల్ (Anupriya Patel) సమాజ్‌వాదీ పార్టీకి చెందిన రామ్ చరిత్ర నిషాద్‌పై పోటీ చేసి 2,32,008 ఓట్ల తేడాతో గెలిచారు. అప్నా దళ్ (సోనీలాల్) ఎన్‌డీఏ మిత్రపక్షంగా ఉంది. అనుప్రియా పటేల్ మోదీ ప్రభుత్వంలో వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అనుప్రియ అప్నా దళ్ (సోనేలాల్) పార్టీని స్థాపించిన సోనే లాల్ పటేల్ కుమార్తె. రాబోయే ఎన్నికల్లో మీర్జాపూర్‌లో అప్నా దళ్ (సోనేలాల్) వర్సెస్ అప్నా దళ్ (కామెరావాడి) మధ్య పోటీ జరుగుతుందని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment