మోదీ టీమ్లోకి మరో ఇద్దరు మహిళలు | Krishna Raj, Anupriya Patel take oath as Cabinet ministers | Sakshi
Sakshi News home page

మోదీ టీమ్లోకి మరో ఇద్దరు మహిళలు

Published Tue, Jul 5 2016 12:08 PM | Last Updated on Sat, Apr 6 2019 9:38 PM

మోదీ టీమ్లోకి మరో ఇద్దరు మహిళలు - Sakshi

మోదీ టీమ్లోకి మరో ఇద్దరు మహిళలు

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ తన మంత్రివర్గంలో మరో ఇద్దరు మహిళలకు అవకాశం కల్పించారు. కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో ఉత్తరప్రదేశ్కు చెందిన మహిళా ఎంపీలు కృష్ణరాజ్, అనుప్రియా పటేల్‌కు మంత్రి పదవులు దక్కాయి. మంగళవారం ఉదయం రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష‍్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు.

వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర కేబినెట్ విస్తరణలో ఆ రాష్ట్రానికి పెద్దపీట వేశారు. కృష్ణరాజ్ బీజేపీ ఎంపీ కాగా, అనుప్రియా పటేల్ ఎన్డీయే మిత్రపక్షం ఆప్నా దళ్ ఎంపీ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement