న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర కేబినెట్ను పునర్వ్యవస్థీకరించారు. మంత్రివర్గంలోకి కొత్తగా 19 మందిని తీసుకున్నారు. స్వతంత్ర మంత్రి ప్రకాష్ జవదేకర్కు కేబినెట్ హోదాతో పదోన్నతి కల్పించారు. మంగళవారం ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు.
అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు కేంద్ర మంత్రివర్గ విస్తరణలో పెద్దపీట వేశారు. రాజస్థాన్కు నాలుగు.. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలకు మూడేసి చొప్పున.. మహారాష్ట్రకు రెండు.. కర్ణాటక, పశ్చిమ బెంగాల్, అసోం, ఉత్తరాఖండ్లకు ఒక్కొక్కటి చొప్పున మంత్రి పదవులు దక్కాయి. దళిత ఎంపీలకు ప్రాధాన్యమిచ్చారు. బీజేపీలో కొత్తముఖాలకు చోటు కల్పించారు. ఎన్డీయే మిత్రపక్షాలయిన రిపబ్లికన్ పార్టీకి చెందిన దళిత ఎంపీ రామ్‌దాస్ అథవాలే (మహారాష్ట్ర), అప్నా దళ్‌కు చెందిన అనుప్రియా పటేల్ (ఉత్తరప్రదేశ్)కు మంత్రి పదవులు దక్కాయి. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రులు పాల్గొన్నారు.
జవదేకర్కు పదోన్నతి
స్వతంత్ర హోదాతో ఉన్న ప్రకాష్ జవదేకర్కు పదోన్నతి లభించింది. కేబినెట్ మంత్రిగా తొలుత ఆయన ప్రమాణం చేశారు.
కొత్త మంత్రులు
ఫగన్‌సింగ్ కులస్తే (మధ్యప్రదేశ్)
ఎస్‌ఎస్ అహ్లూవాలియా(పశ్చిమబెంగాల్ )
రమేశ్ చంద్రప్ప జిగజినగీ (కర్ణాటక)
విజయ్ గోయల్ (రాజస్థాన్)
రామ్‌దాస్ అథవాలే (మహారాష్ట్ర)
రాజేన్ గొహెయిన్ (అసోం)
అనిల్ మాధవ్ దవే (మధ్యప్రదేశ్)
పురుషోత్తం రుపాలా (గుజరాత్)
ఎంజే అక్బర్ (మధ్యప్రదేశ్)
అర్జున్ రామ్ మేఘవాల్ (రాజస్థాన్)
జశ్వంత్ సింగ్ భాబోర్ (గుజరాత్)
మహేంద్రనాథ్ పాండే (ఉత్తరప్రదేశ్)
అజయ్ తమ్తా (ఉత్తరాఖండ్)
కృష్ణరాజ్ (ఉత్తరప్రదేశ్)
మన్‌సుఖ్‌భాయ్ మాండవీయ (గుజరాత్)
అనుప్రియా పటేల్ (ఉత్తరప్రదేశ్)
సీఆర్ చౌదరి (రాజస్థాన్)
పీపీ చౌదరీ (రాజస్థాన్)
సుభాష్ రామ్‌రావ్ భామ్రే(మహారాష్ట్ర)
కొత్త మంత్రులు వీరే..
Published Tue, Jul 5 2016 11:23 AM | Last Updated on Sat, Apr 6 2019 9:38 PM
Advertisement