
ఐదుగురు మంత్రులపై వేటు
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ తన కేబినెట్ నుంచి ఐదుగురు మంత్రులకు ఉద్వాసన పలికారు. కేంద్ర సహాయ మంత్రులు నిహాల్చంద్ (పంచాయతీరాజ్), రామ్ శంకర్ కటారియ (మానవ వనరుల అభివృద్ధి), సన్వర్ లాల్ (జలవనరులు), మోహన్ కుందారియా (వ్యవసాయం), మనుసుఖ్భాయ్ వాసవ్లను (గిరిజన వ్యవహారాలు) కేబినెట్ నుంచి తొలగించారు. కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ప్రధాని మోదీ ఈ నిర్ణయం తీసుకున్నారు.
కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో మోదీ భారీగా మార్పులు, చేర్పులు చేశారు. ఐదుగురు మంత్రులపై వేటు వేసిన మోదీ.. కొత్తగా 19 మంది మంత్రులను కేబినెట్లోకి తీసుకున్నారు. స్వతంత్ర మంత్రి ప్రకాష్ జవదేకర్కు కేబినెట్ హోదా కల్పించారు. మంగళవారం కొత్త మంత్రులు ప్రమాణం చేశారు.