సాక్షి, న్యూఢిల్లీ: దేశం నుంచి ఐదేళ్లలో 370.11 మిలియన్ అమెరికన్ డాలర్ల విలువైన మానవ కేశాలు ఎగుమతి అయ్యాయని కేంద్ర వాణిజ్యశాఖ సహాయమంత్రి అనుప్రియ పటేల్ తెలిపారు. రాజ్యసభలో శుక్రవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ.. 2018–19లో 34.46 మిలియన్ డాలర్లు, 2019–20లో 5.70 మిలియన్ డాలర్లు, 2020–21లో 11.65 మిలియన్ డాలర్లు, 2021–22లో 149.07 మిలియన్ డాలర్లు, 2022–23లో అత్యధికంగా 169.23 మిలియన్ డాలర్ల విలువైన కేశాలు ఎగుమతి చేసినట్లు వివరించారు.
మానవ కేశాలు, ఉత్పత్తుల అసోసియేషన్, ప్లెక్స్ కౌన్సిల్ సమాచారం మేరకు ప్రపంచంలోనే అత్యధికంగా మానవ కేశాలు లభించేది భారతదేశంలోనే అని తెలిపారు. దేశంలో లభించే కేశాలు నాణ్యమైనవిగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినట్లు చెప్పారు. అరుణాచల్‌ప్రదేశ్ మీదుగా మయన్మార్ నుంచి చైనాకు భారతీయ మానవ కేశాల అక్రమ రవాణాకు సంబంధించి ఆధారాలు లేవని, కస్టమ్స్ వద్ద కేసులేమీ నమోదు కాలేదని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment