General Category
-
554 మంది జడ్జీల్లో 430 మంది జనరల్ కేటగిరీయే
న్యూఢిల్లీ: 2018 నుంచి హైకోర్టు జడ్జీలుగా నియమితులైన 554 మందిలో 430 మంది జనరల్ కేటగిరీకి చెందిన వారేనని న్యాయ శాఖ మంత్రి కిరెన్ రిజిజు రాజ్యసభలో తెలిపారు. మిగిలిన వారిలో 58 మంది ఇతర వెనుకబడిన కులాలకు, 19 మంది షెడ్యూల్ కులాలకు చెందిన వారు కాగా, కేవలం ఆరుగురు షెడ్యూల్ తెగలకు, 27 మంది మైనారిటీలని వివరించారు. మొత్తమ్మీద 84 మంది మహిళా జడ్జీలున్నారని చెప్పారు. మొత్తం జడ్జీల్లో జనరల్ కేటగిరీకి చెందిన వారే 77% పైగా ఉన్నారన్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జీల నియామకాలకు రిజర్వేషన్లు లేవని మంత్రి పేర్కొన్నారు. అత్యున్నత న్యాయ వ్యవస్థలోనూ సామాజిక వైవిధ్యం సాధించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. జడ్జీల నియామకాలకు ప్రతిపాదనలు పంపే సమయంలో అర్హులైన ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, మహిళా జడ్జీల పేర్లను కూడా పరిశీలించాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను కోరుతోందని వెల్లడించారు. 2018 నుంచి ఇప్పటి వరకు సుప్రీంకోర్టులో 30 మంది జడ్జీలు నియమితులయ్యారని చెప్పారు. దేశవ్యాప్తంగా ఉన్న జిల్లా జడ్జీల్లో 612 మంది ఎస్సీలు, 204 మంది ఎస్టీలు, 1,329 మంది ఓబీసీలు, 1,406 మంది మహిళలు ఉన్నారని ఒక ప్రశ్నకు సమాధానంగా పేర్కొన్నారు. -
జనరల్ కోటా నుంచే ఈడబ్ల్యూఎస్: కేంద్రం
న్యూఢిల్లీ: సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు అమలవుతున్న 50 శాతం రిజర్వేషన్ కోటాలో ఎలాంటి కోత లేదని, కేవలం జనరల్ కోటా నుంచే ఈడబ్ల్యూఎస్‌కు స్థానం కల్పించామని కేంద్రం సుప్రీంకోర్టులో స్పష్టంచేసింది. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఉన్న 50 శాతం రిజర్వేషన్ స్వాతంత్య్రతకు ఎలాంటి భంగం వాటిల్లలేదని కేంద్రప్రభుత్వం తరఫున హాజరైన అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ సుప్రీంకోర్టు సీజే జస్టిస్ లలిత్ నేతృత్వంలోని ఐదుగురు జడ్జీల రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించారు. ప్రవేశాలు, ఉద్యోగాల్లో ఆర్థికంగా బలహీనమైన వర్గాల(ఈడబ్ల్యూఎస్)కు కేంద్రం 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్న విషయం విదితమే. రిజర్వేషన్ కల్పనకు ఆర్థిక పరిస్థితి గీటురాయి కాదని, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్‌ను కోర్టు సమరి్థంచాలనుకుంటే అంతకుముందుగా ఇందిరా సహానీ(మండల్) తీర్పును çసమీక్షించాలని తమిళనాడు ప్రభుత్వం కోరింది. ఇదీ చదవండి: పట్టణ శ్రేయస్సు ముఖ్యం -
సీబీఎస్ఈ ఫీజు 24 రెట్లు పెంపు
న్యూఢిల్లీ: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) 10వ, 12వ తరగతుల ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల పరీక్ష ఫీజును 24 రెట్లు అంటే ప్రస్తుతమున్న రూ.50 నుంచి అమాంతం రూ.1,200కు పెంచింది. అదేవిధంగా జనరల్ కేటగిరీ విద్యార్థుల ఫీజును రూ.750 నుంచి రూ.1,500గా నిర్ణయించింది. ఈ మేరకు సీబీఎస్ఈ గత వారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇప్పటికే ఫీజు చెల్లింపు ప్రక్రియ మొదలు కావడంతో పాత రుసుము చెల్లించిన విద్యార్థులు పెంచిన మొత్తాన్ని కూడా చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. పెంచిన ప్రకారం ఫీజును గడువులోగా చెల్లించని విద్యార్థులను 2019–20 వార్షిక పరీక్షలు రాసేందుకు అనుమతించబోమని తెలిపింది. తాజా విధానం ప్రకారం.. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల విద్యార్థులు ఐదు సబ్జెక్టులకు పరీక్ష ఫీజు రూ.1,200 చెల్లించాలి. ఇంతకు ముందు ఇది రూ.350 మాత్రమే. జనరల్ కేటగిరీ వారికి ఇప్పటి వరకు ఉన్న ఫీజు రూ.750ను రూ.1,500కు పెంచింది. ఈ విధానం 10, 12వ తరగతుల విద్యార్థులకు వర్తిస్తుంది. 12వ తరగతి ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు అదనంగా ఒక సబ్జెక్టు పరీక్ష రాయాలంటే గతంలో ఎలాంటి ఫీజు ఉండేది కాదు. ఇకపై వారు రూ.300 చెల్లించాల్సి ఉంటుంది. జనరల్ కేటగిరీ విద్యార్థులు కూడా అదనపు సబ్జెక్టు కోసం రూ.150 బదులు రూ.300 చెల్లించాల్సి ఉంటుంది. అయితే, 100 శాతం అంధ విద్యార్థులకు మాత్రం సీబీఎస్ఈ పరీక్ష రుసుమును మినహాయించింది. మైగ్రేషన్ ఫీజును కూడా రూ.150 నుంచి రూ.350కి పెంచింది. -
కులాలకు అతీతంగా ఒకే చట్టం ఉండాలి: సుప్రీం
న్యూఢిల్లీ: దేశంలో చట్టాలు పౌరులందరికీ సమానంగా, కులాలకు అతీతంగా ఉండాల్సిన అవసరముందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఎస్టీ,ఎస్టీలపై వేధింపుల నిరోధక చట్టంపై గతంలో ఇచ్చిన తీరును పునఃసమీక్షించాలని దాఖలైన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం బుధవారం విచారణకు స్వీకరించింది. ఈ సందర్భంగా జస్టిస్ అరుణ్‌మిశ్రా, జస్టిస్ యు.యు.లలిత్‌ల ధర్మాసనం స్పందిస్తూ.. ‘దేశంలో జనరల్ కేటగిరీకి ఓ చట్టం, ఎస్సీ,ఎస్టీలకు మరో చట్టం ఉండటానికి వీల్లేదు. అందరికీ ఒకే చట్టం ఉండాలి’ అని వ్యాఖ్యానించింది. అటార్నీ జనరల్ వేణుగోపాల్ స్పందిస్తూ.. గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు సమస్యాత్మకంగా మారిందనీ, దీన్ని సమీక్షించాలని కోరారు. దీన్ని వికాస్‌సింగ్ అనే న్యాయవాది వ్యతిరేకించారు. ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీం, తీర్పును రిజర్వులో ఉంచింది. -
పేదల కోటాపై స్టేకు సుప్రీం నో
న్యూఢిల్లీ: జనరల్ కేటగిరీలోని పేదలకు విద్య, ఉద్యోగాల్లో ఇటీవల కల్పించిన 10 శాతం రిజర్వేషన్ల అమలును నిలుపుదల చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. కానీ ఈ కోటాకు వీలుకల్పిస్తున్న రాజ్యాంగ సవరణ చట్ట చెల్లుబాటును పరిశీలించేందుకు అంగీకరించింది. 10 శాతం రిజర్వేషన్ల అమలు నిర్ణయాన్ని సవాలుచేస్తూ దాఖలైన పిటిషన్లపై ప్రభుత్వ స్పందన కోరుతూ బెంచ్ శుక్రవారం నోటీసులు జారీచేసింది. జనహిత అభియాన్, యూత్ ఫర్ ఈక్వాలిటీ అనే స్వచ్ఛంద సంస్థలు ఈ పిటిషన్లను వేశాయి. ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదిస్తూ..ఈ పిటిషన్లకు విచారణార్హత లేదని, కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై స్టే ఇవ్వొద్దని విజ్ఞప్తి చేశారు. రిజర్వేషన్ల ప్రయోజనాలు పొందేందుకు ఆర్థిక స్థితిగతులు మాత్రమే ప్రాతిపదిక కావొద్దని యూత్ ఫర్ ఈక్వాలిటీ తన పిటిషన్లో పేర్కొంది. 50 శాతమే ఉండాలన్న రిజర్వేషన్ల పరిమితిని తాజా చట్టం ఉల్లంఘిస్తోందని గుర్తుచేసింది. ‘ఎస్సీ/ఎస్టీ చట్ట సవరణ’పై యోచన ఎస్సీ, ఎస్టీ(సవరణ) వేధింపుల నిరోధక చట్టం–2018పై కేంద్ర ప్రభుత్వ సమీక్షతోపాటు, ఈ చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టే అంశాన్ని పరిశీలించనున్నట్లు కోర్టు తెలిపింది. ఎస్సీ/ఎస్టీ వేధింపుల చట్టం తీవ్రంగా దుర్వినియోగం అవుతోందనీ, ఈ చట్టం కింద దాఖలైన ఫిర్యాదులపై తక్షణం ప్రభుత్వ ఉద్యోగులను కానీ ఇతరులను కానీ అరెస్టు చేయరాదంటూ గత ఏడాది కోర్టు ఆదేశాలిచ్చింది. మరోవైపు, క్రెడిట్, డెబిట్ కార్డులను ఉపయోగించినప్పు డు జరిగే ఫెయిల్డ్ ట్రాన్సాక్షన్స్‌లలో డబ్బు వెంటనే వాపసు అయ్యేలా చూడాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్)ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. అయితే, పిటిషనర్ ముందుగా ఈ సమస్యను ఆర్బీఐ దృష్టికి తీసుకెళ్లాలని సూచించింది. -
రైల్వేలో పేదల కోటా కింద 23 వేల ఉద్యోగాలు
న్యూఢిల్లీ: అగ్రవర్ణాల పేదల(ఈడబ్ల్యూఎస్)కు 10 శాతం రిజర్వేషన్‌ను అమలుచేయబోయే తొలి ప్రభుత్వ విభాగంగా భారతీయ రైల్వే నిలవబోతోందని ఆ శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. రాబోయే రెండేళ్లలో దాదాపు 23,000 మందికి ఈ కోటా కింద ఉద్యోగాలు ఇస్తామని వెల్లడించారు. ఆరు నెలల్లోగా 1.31 లక్షల ఖాళీలను భర్తీ చేస్తామనీ, రాబోయే రెండేళ్లలో మరో లక్ష ఉద్యోగుల్ని తీసుకుంటామని పేర్కొన్నారు. 2019–20 మధ్యకాలంలో 53 వేల మంది, 2020–21 కాలంలో 46 వేల మంది ఉద్యోగులు రైల్వేశాఖ నుంచి పదవీ విరమణ చేయబోతున్నారని తెలిపారు. -
ఈబీసీ కోటా అమలుకు రెడీ
పట్నా : అగ్రవర్ణ పేదలకు జనరల్ కోటాలో పది శాతం రిజర్వేషన్ కల్పించేందుకు అవసరమైన న్యాయ సలహా తీసుకుంటున్నామని, త్వరలోనే దీని అమలుకు పూనుకుంటామని బిహార్ సీఎం నితీష్ కుమార్ వెల్లడించారు. అగ్రవర్ణ పేదలకు జనరల్ కోటాలో పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల రాజ్యాంగ సవరణను చేపట్టిన సంగతి తెలిసిందే. అత్యంత వెనుకబడిన కులాల వారికి జాతీయ స్దాయిలో ప్రత్యేక రిజర్వేషన్‌ను కల్పించాలని నితీష్ కుమార్ డిమాండ్ చేశారు. కాగా తమ పార్టీ పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకమని ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. బిహార్‌లో ఇటీవల చోటుచేసుకున్న మూక హత్యలను ప్రస్తావిస్తూ ఇవి శాంతి భద్రతల సమస్యకు సంబంధించినవి కావని, వీటిని నియంత్రించేందుకు సామాజిక చైతన్యం పెరిగేలా ప్రచార కార్యక్రమాలు చేపట్టాలన్నారు. -
50% అడ్డంకి కాబోదు: జైట్లీ
జనరల్ కేటగిరీలో 10శాతం రిజర్వేషన్లు కల్పిస్తామంటూ కాంగ్రెస్ సహా అన్ని పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోల్లో ప్రకటించాయి. సుప్రీంకోర్టు రిజర్వేషన్లపై 50 శాతం పరిమితి విధించినందున మరో 10 శాతం రిజర్వేషన్ కల్పించడం కోర్టు తీర్పుకు ధిక్కరించినట్లవుతుందన్న వాదన అర్థ రహితం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 16(4) ప్రకారం సుప్రీంకోర్టు విధించిన 50శాతం పరిమితి కులాల ప్రాతిపదికన ఇచ్చే రిజర్వేషన్లకు మాత్రమే వర్తిస్తుంది. అంతేతప్ప, జనరల్ కేటగిరీకి కాదు. గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు మార్లు నోటిఫికేషన్ల ద్వారా రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రయత్నించిన కారణంగా విఫలమయ్యాయి. ఆర్టికల్ 368 పార్ట్ 3 ప్రకారం..ప్రాథమిక హక్కుల సవరణకు రాష్ట్రాల అంగీకారం పొందాల్సిన అవసరం కూడా లేదు. ఉదాహరణకు..ప్రమోషన్లకు సంబంధించి ఆర్టికల్ 15(5)కు చేపట్టిన సవరణ పార్లమెంట్ ఆమోదం ద్వారానే జరిగింది. ఇప్పటివరకు సామాజికంగా వెనుకబడిన వర్గాలకు మాత్రమే రాజ్యాంగం రిజర్వేషన్ కల్పిస్తోంది. ప్రస్తుత 124వ రాజ్యాంగ సవరణ–2019 ద్వారా ఆర్థికంగా బలహీన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించేందుకు కొన్ని నిబంధనలను చేరుస్తున్నాం. కులం, ఆర్థికత ఆధారంగా పౌరులకు సమాన అవకాశాలు కల్పించాలి. అయితే, సమానులను అసమానంగా చూడరాదు. అసమానులను కూడా సమానంగా భావించరాదు. రాజ్యాంగ మూల స్వరూపాన్ని మార్చకుండా మేం చేపట్టిన ఈ ప్రయత్నం సఫలమవుతుందని ఆశిస్తున్నాం. ఎన్నికల మేనిఫెస్టోలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజరేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ..మాటపై నిలబడి బిల్లుకు ఆమోదం తెలపాలి. ప్రతిపక్షాలు నిరసనలు తెలపడం మాని, మనస్ఫూర్తిగా బిల్లుకు ఆమోదం ప్రకటించాలి. అనుప్రియా పటేల్, అప్నాదళ్ ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో మాదిరిగా కాకుం డా ఆర్థికంగా వెనుకబడిన వారికి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పిస్తున్నాం. 2021 లో కుల ప్రాతిపదికన జన గణన చేపట్టి స్పష్టత తీసుకువస్తాం. ప్రైవేట్ రంగానికి కూడా ఈ రిజర్వేషన్లు వర్తింప జేసే విషయాన్ని పరిశీలిస్తున్నాం. రాం విలాస్ పాశ్వాన్, కేంద్రమంత్రి జనరల్ కేటగిరీలో 60శాతం రిజర్వేషన్లను రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చాలి. తద్వారా సుప్రీంకోర్టులో సవాల్ చేసే వీలుండదు. ప్రైవేట్ రంగంలో కూడా 60శాతం రిజర్వేషన్లు కల్పించాలి. దీంతోపాటు ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీసెస్ ఏర్పాటు చేయాలి. దీనివల్ల పారదర్శకత పెరుగుతుంది. -
పట్టుదలే ఆయుధం
కొత్తగూడెం: కృషి, పట్టుదల ఉంటే వయస్సు, వివాహం, పిల్లలు ఇతరత్రా విజయానికి ఆటంకాలు కావని జిల్లాకు చెందిన ఓ మహిళ నిరూ పించింది. కొత్తగూడెంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో పగడాలకవిత ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. పదోతరగతి తర్వాత దూరవిద్యలోనే ఉన్నత విద్యను ఆమె అభ్యసించారు. ఇటీవల గురుకుల నోటిఫికేషన్లో పీజీటీ విభాగంలో జోనల్ స్థాయిలో మహిళల ఓపెన్ కేటగిరీలో 7వ ర్యాంకు, జనరల్ కేటగిరీలో 9వ ర్యాంకు సాధించి ఉద్యోగ బెర్తును ఖరారు చేసుకున్నారు. అంతేకాకుండా టీజీటీ విభాగంలోనూ 1:2 ఇంటర్వూ్యకు అర్హతను సాధించారు. దూర విద్యతో ఉన్నత విద్య... జిల్లాలోని అశ్వాపురం మండలం రామచంద్రాపురానికి చెందిన పగడాల కవితకు పదో తరగతి పూర్తి చేయగానే వివాహమైంది. కవితకు చదువుపై ఉన్న ఆసక్తిని ఆమె భర్త తుక్కాని శ్రీనివాసరెడ్డి గుర్తించి ప్రోత్సహించారు. అతని సలహా లు, సూచనలతో దూర విద్యా విధానంలో బీఏ, ఎంఏ (తెలుగు) పూర్తి చేశారు. ఆ తర్వాత 2015 లో పాల్వంచలోని మదర్‌థెరిస్సా కళాశాలలో బీఈడీ పూర్తి చేశారు. అనంతరం ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుని ఆమె కష్టపడ్డారు. కోచింగ్ లేకుండానే... గరుకులాల్లో ఉద్యోగాన్ని సాధించేందుకు ఎలాంటి కోచింగ్‌ను కవిత తీసుకోలేదు. కేవ లం తన ఇంటి వద్దనే ఆమె సాధన చేసే వారు. డీఎస్సీకి ప్రిపేర్ అవుతుండగానే గురుకుల టీచర్స్ నోటిఫికేషన్ విడుదల కావడంతో టీజీటీ, పీజీటీ విభాగాల్లో దరఖాస్తు చేసుకున్నారు. 102 మార్కులతో ప్రిలిమ్స్‌లో మెయిన్స్‌కు క్వాలీఫై అయ్యారు. అనంతరం మెయిన్స్‌లోనూ ఉత్తమ మార్కులను సాధించి పీజీటీ విభాగంలో మహిళల ఓపెన్ కేటగిరిలో 7వ ర్యాంకు, జనరల్‌లో 9వ ర్యాంకును సాధించి ఉద్యోగ బెర్తును ఖరారు చేసుకున్నారు. టీజీటీ విభాగంలోను 1:2 తో అర్హత సాధించారు. భర్త మార్గదర్శకంలో.. నా భర్త శ్రీనివాసరెడ్డి స్ఫూర్తితో డిగ్రీ, పీజీ, బీఈడీను పూర్తి చేశాను. ఆయన మార్గదర్శకత్వంలోనే ఉద్యోగానికి అర్హత సాధించా ను. ఉద్యోగం సాధించాలన్న కసి, పట్టుదల ఉంటే మిగతావేమీ అడ్డుకావు. ప్రణాళిక, తగిన మెటీరియల్స్ తో సాధన చేయాలి. నా లక్ష్య సాధనలో భర్త, కుమారుడి సహాయ సహకారాలు మరువలేనివి. విద్యార్థుల్లో తెలుగుపై మమకారం, పట్టును పెంచేలా భోదన చేసేందుకు నా వంతు కృషి చేస్తా. –పగడాల కవిత -
లక్కీఛాన్స్!
జిల్లా పరిషత్ అధ్యక్ష పీఠం రిజర్వేషన్ ఖరారైంది. ఈ కుర్చీని జనరల్ అభ్యర్థికి కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈసారి జెడ్పీ చైర్మన్ పదవి బీసీ (మహిళ) లకు కేటాయించే అవకాశముందని ప్రచారం జరిగినప్పటికీ, చివరి నిమిషంలో రిజర్వేషన్ తారుమారైంది. ఈ అనూహ్య పరిణామంతో బలమైన సామాజికవర్గాలు ‘స్థానిక సంస్థల’ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి. రిజర్వేషన్ల కేటాయింపుతో జాతకాలు మారిపోవడం, అనుకూల సీట్లు ఇతర వర్గాలకు ఖరారు కావడంతో ఉసూరుమన్న ఆయా వర్గాలు తాజా పరిణామాలతో సురక్షిత మండలాల అన్వేషణలో మునిగిపోయాయి. వాస్తవానికి జెడ్పీ చైర్మన్ స్థానం జనరల్ అభ్యర్థులకే కేటాయించినా...ఏ సామాజికవర్గమైనా పోటీ చేసే అవకాశం కలిగింది. 2006 ఎన్నికల్లో జెడ్పీ చైర్మన్ కుర్చీ జనరల్ మహిళకు కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ సారి బీసీలకు కేటాయించే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపించాయి. అయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని యూనిట్‌గా తీసుకొని రిజర్వేషన్లు ఖరా రు చేస్తే మన జిల్లా బీసీలకే దక్కేది. అంతేకాకుండా తెలంగాణలోని హైదరాబాద్ మినహా తొమ్మిది జిల్లాలు ఏదో ఒక కేటగిరీకి రిజర్వ్ అవుతుండడం.. జనరల్‌గా ఒక జిల్లాకు అవకాశం రావడంలేదని, రాష్ట్ర విభజన నేపథ్యంలో ఈ అంశం తమకు తలనొప్పిగా పరిణమిస్తుందని ప్రభుత్వం భావించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ యూనిట్‌గా రిజర్వేషన్ ఖ రారు చేయడంతో రంగారెడ్డి జిల్లాకు జనరల్ కేటగిరీ లభించినట్లు అధికారవర్గాల ద్వారా తెలిసింది. రొటేషన్ పద్ధతిలో రిజర్వేషన్ల ప్రక్రియను చేపట్టిన ప్రభుత్వం...1995 నుంచి ఇప్పటివరకు కేటాయించిన రిజర్వేషన్లను ప్రామాణికంగా తీసుకుంది. తాజాగా జెడ్పీ సీటు జనరల్‌కు రిజర్వ్ కావడంతో ఆశావహుల్లో సంతోషం వెల్లివిరుస్తోంది. అయ్యో పాపం! ఆఖరి నిమిషంలో జెడ్పీ చైర్మన్‌గిరీ రిజర్వేషన్ అనుకూలించినా.. జిల్లా ప్రాదేశిక స్థానాల రిజర్వేషన్లు స్థానికనేతలకు మింగుడు పడటంలేదు. ముఖ్యంగా జిల్లా రాజకీయాలను శాసించే బలమైన సామాజికవర్గం నాయకులకు తాజా పరిణామాలు ఆశనిపాతం గా మారాయి. గత ఎన్నికల్లో రిజర్వ్డ్ స్థానాల్లో ఈ సారైనా అవకాశం దక్కకపోతుందా అని ఎదురుచూసిన నేతలకు నిరాశే మిగిలింది. మం డలం/జిల్లాలో చక్రం తిప్పాలని భావించిన పలువురు ఆశావహులకు రిజర్వేషన్ల రూపంలో ఎదురుదెబ్బ తగిలింది. తమ గెలుపునకు సురక్షిత గ్రామం/ మండలం నుంచి పోటీ చేద్దామని వ్యూహరచన చేస్తున్నప్పటికీ, స్థానికంగా సహకారం అందుతుందో లేదోననే భయం వారిని వెంటాడుతోంది. దీనికితోడు వేరొక సీటు నుంచి బరిలోకి దిగితే వ్యయం తడిసిమోపెడవుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. జెడ్పీ సీటు జనరల్‌కు కేటాయించినా.. స్థానికంగా పోటీచేసే అవకాశం లేకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నారు. మరోవైపు ప్రాదేశిక పోరు ఎమ్మెల్యే అభ్యర్థులకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ఆర్థిక భారాన్ని ఊహించుకొని తల బాదుకుంటున్నారు. ధన ప్రవాహంతో కూడుకున్న ఎన్నికలు కావడం.. ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా అతిత్వరలో జరిగే సాధారణ ఎన్నికల్లో తమ గెలుపోటములను ప్రభావితం చేస్తాయని బెంగ పడుతున్నారు. -
జెడ్పీ పీఠం జనరల్..
సాక్షి, కాకినాడ :‘జిల్లా పరిషత్’ చైర్మన్ పీఠం జనరల్ కేటగిరీలోకి మారింది. సుదీర్ఘచరిత్ర కలిగిన జిల్లా పరిషత్ పీఠానికి ఈసారి ఏ వర్గానికి చెందిన వారైనా ఎన్నిక కాగల అవకాశం ఉంది. మినీ అసెంబ్లీగా పేరున్న జెడ్పీ పీఠాన్ని జనరల్ చేయడంతో.. దాన్ని అధిరోహించాలని ఉబలాటపడే నాన్ రిజర్వ్డ్ కేటగిరీకి చెందిన ఆశావహులైన రాజకీయ నాయకులు అరుదైన అవకాశం తలుపు తడుతున్నట్టు భావిస్తున్నారు. ప్రభుత్వం రాష్ట్రాన్ని యూనిట్‌గా తీసుకొని జిల్లా పరిషత్‌ల రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేసింది. 2006 నుంచి అమలు చేస్తున్న రొటేషన్ పద్ధతిలో ఈ రిజర్వేషన్ల ఖరారు జరిగింది. ఈ క్రమంలో తూర్పు గోదావరి జిల్లా పరిషత్ పీఠం దశాబ్దం తర్వాత జనరల్ కేటగిరీకి కేటాయించారు. అదే విధంగా మండల ప్రజాపరిషత్ అధ్యక్షుల రిజర్వేషన్ల ప్రక్రియ కూడా కొలిక్కి వచ్చింది. ఇందుకు సంబంధించిన వివరాలను శనివారం జిల్లా పరిషత్ సీఈఓ మజ్జి సూర్యభగవాన్ విలేకరులకు తెలిపా రు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ, జెడ్పీ పీఠాలకు సంబంధించి రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో రాజకీయ పార్టీలు అభ్యర్థుల వేటలో పడ్డాయి. మరొకపక్క వివిధ పార్టీలకు చెందిన ఆశావహులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు పార్టీ టికెట్ల కోసం నేతల చుట్టూ ప్రదక్షిణ లు మొదలు పెట్టారు.ఇదీ జిల్లా పరిషత్ చరిత్ర.. 1917లో ఆవిర్భవించిన జిల్లా బోర్డు 1959లో జిల్లా పరిషత్గా రూపాంతరం చెందింది. 1987లో జిల్లా ప్రజాపరిషత్‌గా రూపు మార్చుకున్నప్పటికీ 1995లో మళ్లీ జిల్లా పరిషత్గా మారింది. జిల్లా బోర్డుకు పదిమంది చైర్మన్లుగా పనిచేయగా, జిల్లా ప్రజాపరిషత్‌కు ఇద్దరు, జిల్లా పరిషత్‌కు ఎనిమిది మంది చైర్మన్లుగా సేవలందించారు. వివిధ సందర్భాల్లో సుమారు ఏడేళ్ల పాటు స్పెషలాఫీసర్లు జిల్లా ప్రజాపరిషత్, జిల్లా పరిషత్ పాలకపగ్గాలు చేపట్టారు. కాగా 1917లో ఏర్పడిన తొలి జిల్లా బోర్డు చైర్మన్ పదవిని దివాన్ బహద్దూర్ దురుశేటి శేషగిరిరావు పంతులు(1917-1923) చేపట్టగా, తర్వాత వరుసగా రావుబహద్దూర్ మాదిరెడ్డి వెంకటరత్నం నాయుడు (1923-1926), రావుబహద్దూర్ పోకల గోవిందరావు నాయుడు (1926-1929) ఆ పదవులను నిర్వహించారు. కేంద్ర మానవవనరుల శాఖమంత్రి ఎంఎం పళ్లంరాజు తాతగారైన దివంగత మల్లిపూడి పళ్లంరాజు స్వాతంత్య్రానికి పూర్వం మూడు దఫాలు (1929-32), (1939-40), (1941-42) జిల్లా బోర్డును ఏలారు. రాజా కాకర్లపూడి రాజగోపాలనర్శరాజు బహద్దూర్(1933-1936), మెండు వీరన్న (1937-38), జబ్దాతు అక్రాన్ శ్రీబులుసు బుచ్చి సర్వారాయుడు (1943-46), మారిన నరసన్న(1949-53) జిల్లా బోర్డు చైర్మన్లుగా సేవలందించారు. ఇక 1959లో జిల్లా పరిషత్గా ఏర్పడిన తర్వాత తొలి చైర్మన్‌గా తోట రామస్వామి(1959-64) ఏలుబడి సాగించారు. ఆ తర్వాత వరుసగా కేంద్ర మాజీ మంత్రి ఎస్‌బీపీబీకే సత్యనారాయణరావు(1964-76), మాజీ మంత్రి పంతం పద్మనాభం (1981-83), ప్రస్తుత స్థానిక సంస్థల ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు (1983-1986) జెడ్పీ పగ్గాలు చేపట్టారు. 1987లో ఏర్పడిన జిల్లా ప్రజా పరిషత్ పీఠాన్ని వరుసగా లోక్‌సభ మాజీ స్పీకర్ జీఎంసీ బాలయోగి (1987-1991), గారపాటి గంగాధర రామారావు చౌదరి(1991-92) చేపట్టారు. ఆ తర్వాత నాలుగేళ్ల పాటు ఎన్నికలు జరగకపోవడంతో ప్రత్యేకాధికారులుగా ఐఏఎస్ అధికారులు రణదీప్ సుధాన్(1992-93), రాజీవ్‌శర్మ(1993-94), రాజీవ్ రంజన్ మిశ్రా (1994), సమీర్ శర్మ(1994-95) ప్రత్యేకాధికారులుగా వ్యవహరించారు. తిరిగి 1995లో జిల్లా పరిషత్గా మారాక వంగా గీతా విశ్వనాథ్ (1995-2000), గుత్తుల బులిరాజు (నెలరోజులు) పని చేశారు. ఆ తర్వాత మళ్లీ సతీష్ చంద్ర రెండు నెలల పాటు ప్రత్యేకాధికారిగా వ్యవహరించారు. అనంతరం దున్నా జనార్దనరావు (2001-2006), చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ (2006-2011) చైర్మన్లుగా పనిచేశారు. ఆ తర్వాత ఎం.రవిచంద్ర (2011-12) ప్రత్యేకాధికారిగా వ్యవహరించారు. ప్రస్తుతం జిల్లాకలెక్టర్ నీతూప్రసాద్ 2012 మార్చి 7 నుంచి ప్రత్యేకాధికారిగా విధులు నిర్వర్తిస్తున్నారు.