దేశవ్యాప్తంగా రిటైల్ మార్కెట్లలో పప్పు ధాన్యాల ధరలు దిగొచ్చాయి.
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా రిటైల్ మార్కెట్లలో పప్పు ధాన్యాల ధరలు దిగొచ్చాయి. పలు ప్రధాన నగరాల్లో ప్రస్తుతం పప్పు ధాన్యాల ధరలు కిలోకు రూ.115-170 మధ్య ఉన్నాయి. అయినా నిల్వలపై పరిమితిని ఎత్తివేసేందుకు ప్రభుత్వం విముఖత చూపింది.
ధరలు ఇలాగే తగ్గుతాయో లేదో మరికొంత కాలం పరిశీలిస్తామని ఆహార శాఖ రాంవిలాస్ మంత్రి పాశ్వాన్ చెప్పారు. పప్పు ధాన్యాల ధరలు దేశీయంగా కనీస మద్దతు ధర కన్నా తగ్గితే, ధరల స్థిరీకరణ నిధిని ఉపయోగించి రైతుల నుంచి ప్రభుత్వమే ధాన్యాలను నేరుగా కొంటుందని ఆయన వెల్లడించారు.