బంజారాహిల్స్‌: మసాజ్‌ చేస్తూ గొలుసు కొట్టేశారు... | chain robbery In Barber Shop | Sakshi
Sakshi News home page

బంజారాహిల్స్‌: మసాజ్‌ చేస్తూ గొలుసు కొట్టేశారు...

Jun 18 2023 7:52 AM | Updated on Jun 18 2023 8:19 AM

chain robbery In Barber Shop - Sakshi

మసాజ్‌కు వెళ్లిన యువకుడి మెడలో నుంచి బంగారు గొలుసు చోరీకి గురైన ఘటన బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో

బంజారాహిల్స్‌: బార్బర్‌ షాప్‌కు మసాజ్‌కు వెళ్లిన యువకుడి మెడలో నుంచి బంగారు గొలుసు చోరీకి గురైన ఘటన బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు... టోలిచౌకి ఎండీ లైన్స్‌లో నివసించే సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ఆదిత్య తొడలపల్లి టోలిచౌకి ఐఏఎస్‌ కాలనీలో ఉన్న అవిద్స్‌ బార్బర్‌ షాప్‌కు మసాజ్‌ కోసం వెళ్లారు.

మసాజ్‌ పూర్తి చేసుకున్న తర్వాత ఇంటికి వచ్చి చూడగా మెడలో ఉన్న బంగారు గొలుసు కనిపించలేదు. సుమారు రూ. 80 వేల విలువ చేసే బంగారు గొలుసును మసాజ్‌ చేస్తున్న సమయంలో సదరు వ్యక్తి దొంగిలించి ఉంటాడని అనుమానిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంజారాహిల్స్‌ క్రైం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement