chain robbery
-
బంజారాహిల్స్: మసాజ్ చేస్తూ గొలుసు కొట్టేశారు...
బంజారాహిల్స్: బార్బర్ షాప్‌కు మసాజ్‌కు వెళ్లిన యువకుడి మెడలో నుంచి బంగారు గొలుసు చోరీకి గురైన ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు... టోలిచౌకి ఎండీ లైన్స్‌లో నివసించే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆదిత్య తొడలపల్లి టోలిచౌకి ఐఏఎస్ కాలనీలో ఉన్న అవిద్స్ బార్బర్ షాప్‌కు మసాజ్ కోసం వెళ్లారు. మసాజ్ పూర్తి చేసుకున్న తర్వాత ఇంటికి వచ్చి చూడగా మెడలో ఉన్న బంగారు గొలుసు కనిపించలేదు. సుమారు రూ. 80 వేల విలువ చేసే బంగారు గొలుసును మసాజ్ చేస్తున్న సమయంలో సదరు వ్యక్తి దొంగిలించి ఉంటాడని అనుమానిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంజారాహిల్స్ క్రైం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
అబ్రకదబ్ర..కుక్కర్లో బంగారం వేడి చేస్తే..!
చిత్తూరు, గుడిపాల : నగలను శుభ్రం చేయిస్తామని నమ్మించి మూడు సవర్ల బంగారు చెయిన్ కొట్టేశార్రా నాయనా! అని ఓ మహిళ గొల్లుమంది. వివరాలు..మరకాలకుప్పం దళితవాడకు చెందిన మంజుల (40) ఇంటివద్దకు గురువారం ఉదయం 10.30 గంటలకు ఒక మఓటార సైకిల్లో ఇద్దరు ఆగంతకులు వచ్చారు. వారిద్దరూ హిందీలో మాట్లాడారు. మంజులను పిలిచి తాము బంగారు, వెండి వస్తువులు, నగలను తళతళలాడేలా శుభ్రపరుస్తామని చెప్పారు. దీంతో ఆమె తొలుత కాలి పట్టీలు ఇవ్వడంతో వారు శుభ్రం చేసి ఇచ్చారు. ఆ తరువాత తన మెడలో ఉన్న మూడుసవర్ల బంగారాన్ని వారికి ఇచ్చింది. ఆ గొలుసు కుక్కర్లో వేసి వేడి చేసి, కుక్కర్ చల్లబడ్డాక ఆ చెయిన్‌ను తీసుకుంటే కొత్త నగలా ఉంటుందని వారు ఊదరగొట్టారు. ఇది నిజమే కాబోలని ఆ అమాయరాలు నమ్మింది. ఆ తర్వాత వారు అన్నట్లే ఆ చెయిన్‌ను కుక్కర్లో వేడి చేశారు. నగలు శుభ్రం చేసినందుకు ఆమె నుంచి కొంత డబ్బు తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. కొంతసేపటికి కుక్కర్ చల్లబడడంతో నగ ఎలా మెరిసిపోతోందో చూద్దామని ఉత్కంఠతతో ఆమె కుక్కర్ మూత తీసి చూసింది. అంతే! గుండెల్లో రాయి పడ్డట్లైంది. అందులో చల్లారిన నీళ్లు తప్ప బంగారు చెయిన్ లేకపోవడంతో ఊరంతా తెలిసేలా శోకాలు పెట్టింది. ఆ జంతర్‌మంతర్ మాయగాళ్ల కోసం బంధువులతో గాలించింది. వాళ్లెప్పుడో జంప్ అయ్యారని బోధపడేసరికి ఈసారి పోలీస్ స్టేషన్‌కు పరుగులు తీసింది. ఎస్ఐ షేక్షావలి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఫీజు డబ్బు కోసం చోరీ
కర్నూలు: డిగ్రీ చదువుతున్న ఓ విద్యార్థి టర్మ్ ఫీజు డబ్బు కోసం చోరీకి పాల్పడి పోలీసులకు చిక్కాడు. ఈ ఘటన కర్నూలు ఆర్టీసీ బస్టాండ్‌లో చోటుచేసుకుంది. నాల్గో పట్టణ పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కోడుమూరు మండలం అమడగుండ్ల గ్రామానికి చెందిన పవన్ కుమార్..కర్నూలులోని ఓ ప్రైవేట్ కళాశాలలో బీఎస్సీ(మ్యాథ్స్) ఫైనలియర్ చదువుతున్నాడు. ప్రతి రోజూ గ్రామం నుంచి కర్నూలు వచ్చేవాడు. ఈ నెల 2వ తేదీ సాయంత్రం.. ఏపీఎస్పీ పదో బెటాలియన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్ నర్సింహారెడ్డి భార్య మాధవి కర్నూలు ఆర్టీసీ బస్టాండులో బస్సు ఎక్కుతుండగా..ఆమె మెడలోని మూడు తులాల గొలుసును పవన్ కుమార్ చోరీ చేశాడు. అనుమానంపై పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని విచారించారు. టర్మ్ ఫీజు చెల్లించేందుకు డబ్బు లేకపోవడంతో చోరీకి పాల్పడినట్లు అంగీకరించాడు. దీంతో సదరు విద్యార్థిపై కేసు నమోదు చేసి.. అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. -
లాటరీ పేరిట లూటీ చేశాడు!
మీకు లాటరీ వచ్చిందని మాయ మాటలు చెప్పి, రెండు కుటుంబాలకు టోకరా వేశాడో దుండగుడు. ఒకే రోజు బాన్సువాడతో పాటు వర్ని మండలం అపాంధిఫారంలో ఇదే తరహాలో బాధితులను మోసగించాడు. అమాయకులను మాయ చేసి, ఐదు తులాల బంగారు గొలుసులతో ఉడాయించాడు. బాన్సువాడ టౌన్(బాన్సువాడ): మాయమాటలు చెప్పి రెండున్నర పుస్తెల తాడు తో ఉడాయించాడో దుండగుడు. ఈ ఘటన బాన్సువాడలో మంగళవారం చోటు చేసుకుంది. బాధితుల కథ నం ప్రకారం.. పట్టణంలోని గౌలిగూడకు చెందిన వ నందాస్ రాజు, రుక్మిణి దంపతులు నివాసముంటు న్నారు. మంగళవారం మధ్యాహ్నం వేళ రుక్మిణి ఇంటి ఎదుట దుస్తులు ఉతుకుండగా, ఓ దుం డగుడు బైక్‌పై వచ్చి ఆమెతో మాట కలిపాడు. ‘మీ భర్త పేరు రాజు కదా.. ఆయన మా దగ్గర స్కీం కట్టా డు. స్కీంలో మీకు లాటరీ తగిలింది.. మీ భర్త నిన్ను తీసుకొని షోరూంకు రమ్మన్నాడని’ చెప్పాడు. దుండగుడి మాటలు నమ్మని రుక్మిణి.. మా ఆయన ఏ స్కీం కట్టలేదు.. అదంతా అబద్దమని కొట్టి పడేసింది. అయి తే, మీ ఆయన దగ్గర నుంచే వస్తున్నా.. ఆయన షోరూంలో ఉన్నాడు.. నిన్ను తీసుకుని రమ్మన్నాడని నమ్మబలికాడు. రెండో సారి చెప్పడంతో అతడి మాట లు నమ్మిన రుక్మిణి వెంట వెళ్లేందుకు సిద్ధపడింది. మీ మెడలో ఉన్న పుస్తెల తాడు ఇంట్లో పెట్టి రండి అని అగంతకుడు చెప్పడంతో ఆమె తాళి తీసి వంటింట్లోని స్టీలు డబ్బాలో దాచిపెట్టింది. అనంతరం అత్త లలితతో కలిసి రుక్మిణి దుండగుడి బైక్‌పై వెళ్లా రు. అగంతకుడు వారిని ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ సమీపంలో దింపి.. మీరు షోరూంకు పదండి, నేను అన్నం తిని వస్తానని చెప్పి వెళ్లిపోయాడు. దీంతో వారిద్దరు షోరూం వరకు నడుచుకుంటూ వెళ్లారు. అగంతకుడు నేరుగా రాజు ఇంటికి వచ్చి రుక్మిణి మామతో మాట కలిపాడు. నీ కోడలు షోరూం దగ్గర ఉంది.. వంటింట్లో పెట్టిన పుస్తెల తాడు తీసుకురమ్మన్నదని చెప్పి, చైన్ తీసుకొని ఉడాయించాడు. అయితే, షోరూంలో భర్త లేకపోవడంతో మోసపోయానని గ్రహించిన రుక్మిణి ఇంటికి వచ్చి వంటింట్లో చూడగా పుస్తెల తాడు కనిపించలేదు. దీంతో మామను అడగగా, మీరే తెమ్మన్నారని దుండగుడు వచ్చి తీసుకెళ్లాడని చెప్పడంతో ఆమె లబోదిబోమంటూ గ్యాస్ ఏజెన్సీ వద్దకు వెళ్లి చూడగా నిందితుడు కనిపించలేదు. దీంతో భర్తతో కలిసి ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. బంగారం గిఫ్ట్‌గా వచ్చిందని.. వర్ని(బాన్సువాడ): గిఫ్ట్ వచ్చిందని చెప్పి రెండున్నర తులాల చైన్‌తో ఉడాయించాడో దుండగుడు. ఎస్సై చంద్రశేఖర్ కథనం ప్రకారం.. అపాంధి ఫారంలో నివాసముండే గుగ్లోత్ సుభద్ర, దేవిదాస్ దంపతుల ఇంటికి మంగళవారం ఓ అగంతకుడు వచ్చాడు. స్కీంలో మీ అబ్బాయికి స్కూటీ, మూడు తులాల బంగారం వచ్చిందని.. మీరు నాతో వస్తే వాహనం, బంగారం ఇస్తానని చెప్పడంతో ఆశపడ్డ దంపతులు తమ బైక్‌పై అతడి వెంట వెళ్లారు. కొం త దూరం వెళ్లిన తర్వాత అగంతకుడు నేను ఇప్పు డే వస్తా.. ఇక్కడే ఉండండి అని చెప్పి అక్కడి నుంచి తిరిగి వచ్చాడు. నేరుగా సుభద్ర ఇంటికి చేరుకున్న దుండ గుడు.. ఆమె కోడలు సుమలతతో ‘నీ మెడలో ఉన్న గొలుసును మీ అత్త తీసుకురమ్మని నన్ను పంపిందని’ చెప్పాడు. అంతకు ముందే అత్త, మామతో కలిసి దుండగుడు వెళ్లడం గమనించిన సుమలత మెడలోని రెండున్నర తులాల పుస్తెల తాడును తీసి అతడికివ్వగా, అగంతకుడు అక్కడి నుంచి ఉడాయించాడు. అయితే, రోడ్డుపై చాలాసేపు వేచి చూసిన సుభద్ర దంపతులు మోసపోయామని గుర్తించి ఇంటికి చేరుకున్నారు. అయితే, దుండగుడు చైన్ తీసుకెళ్లిన విషయాన్ని కోడలు చెప్పడంతో బాధితులు లబోదిబోమంటూ చుట్టుపక్కల వెతికారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
మహిళ నుంచి బంగారు గొలుసు అపహరణ
అమ్రాబాద్ : ఓ మహిళ మెడలో నుంచి దుండగుడు బంగారు గొలుసును అపహరించుకెళ్లాడు. వివరాలిలా ఉన్నాయి. అమ్రాబాద్ మండలం జంగంరెడ్డిపల్లిలో ముదిరెడ్డి జంగమ్మ నివాసముంటోంది. కాగా, శనివారం ఉదయం కుటుంబ సభ్యులు శుభకార్యం నిమిత్తం వేరే గ్రామానికి వెళ్లగా రాత్రి ఈమె ఇంట్లో ఒంటరిగా నిద్రించింది. ఇదే అదనుగా భావించిన ఓ గుర్తుతెలియని వ్యక్తి ఆదివారం తెల్లవారుజామున ఇంట్లోకి ప్రవేశించాడు. ఆమె మెడలో నుంచి రూ.90వేల విలువజేసే మూడు తులాల బంగారు గొలుసును లాక్కెళ్లిపోయాడు. వెంటనే మేల్కొన్న బాధితురాలు కేకలు వేయడంతో చుట్టుపక్కలవారు వచ్చారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో హెడ్‌కానిస్టేబుల్ ఖాదర్ మొíß యొద్దీన్ కేసు దర్యాప్తు జరుపుతున్నారు. -
కల్లు తాగించి.. గొలుసు ఎత్తుకెళ్లారు!
రాజేంద్రనగర్: కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఓ మహిళ కల్లు తాగడం కోసం కల్లు కంపౌడ్‌కు వెళ్లింది. అక్కడ పరిచయమైన ఇద్దరు మహిళలు ఆమెకు పూటుగా కల్లుతాగించారు. అనంతరం ఆమె మెడలోని బంగారు గొలుసును ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ హైదర్‌గూడలోని ఓ కల్లు దుకాణంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. శనివారం ఉదయం మత్తు నుంచి తేరుకున్న సదరు మహిళ పుస్తెలుతాడు మెడలో కనిపించకపోవడంతో పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.