విలపిస్తున్న బాధితులు
మీకు లాటరీ వచ్చిందని మాయ మాటలు చెప్పి, రెండు కుటుంబాలకు టోకరా వేశాడో దుండగుడు. ఒకే రోజు బాన్సువాడతో పాటు వర్ని మండలం అపాంధిఫారంలో ఇదే తరహాలో బాధితులను మోసగించాడు. అమాయకులను మాయ చేసి, ఐదు తులాల బంగారు గొలుసులతో ఉడాయించాడు.
బాన్సువాడ టౌన్(బాన్సువాడ): మాయమాటలు చెప్పి రెండున్నర పుస్తెల తాడు తో ఉడాయించాడో దుండగుడు. ఈ ఘటన బాన్సువాడలో మంగళవారం చోటు చేసుకుంది. బాధితుల కథ నం ప్రకారం.. పట్టణంలోని గౌలిగూడకు చెందిన వ నందాస్ రాజు, రుక్మిణి దంపతులు నివాసముంటు న్నారు. మంగళవారం మధ్యాహ్నం వేళ రుక్మిణి ఇంటి ఎదుట దుస్తులు ఉతుకుండగా, ఓ దుం డగుడు బైక్‌పై వచ్చి ఆమెతో మాట కలిపాడు. ‘మీ భర్త పేరు రాజు కదా..
ఆయన మా దగ్గర స్కీం కట్టా డు. స్కీంలో మీకు లాటరీ తగిలింది.. మీ భర్త నిన్ను తీసుకొని షోరూంకు రమ్మన్నాడని’ చెప్పాడు. దుండగుడి మాటలు నమ్మని రుక్మిణి.. మా ఆయన ఏ స్కీం కట్టలేదు.. అదంతా అబద్దమని కొట్టి పడేసింది. అయి తే, మీ ఆయన దగ్గర నుంచే వస్తున్నా.. ఆయన షోరూంలో ఉన్నాడు.. నిన్ను తీసుకుని రమ్మన్నాడని నమ్మబలికాడు. రెండో సారి చెప్పడంతో అతడి మాట లు నమ్మిన రుక్మిణి వెంట వెళ్లేందుకు సిద్ధపడింది.
మీ మెడలో ఉన్న పుస్తెల తాడు ఇంట్లో పెట్టి రండి అని అగంతకుడు చెప్పడంతో ఆమె తాళి తీసి వంటింట్లోని స్టీలు డబ్బాలో దాచిపెట్టింది. అనంతరం అత్త లలితతో కలిసి రుక్మిణి దుండగుడి బైక్‌పై వెళ్లా రు. అగంతకుడు వారిని ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ సమీపంలో దింపి.. మీరు షోరూంకు పదండి, నేను అన్నం తిని వస్తానని చెప్పి వెళ్లిపోయాడు. దీంతో వారిద్దరు షోరూం వరకు నడుచుకుంటూ వెళ్లారు. అగంతకుడు నేరుగా రాజు ఇంటికి వచ్చి రుక్మిణి మామతో మాట కలిపాడు.
నీ కోడలు షోరూం దగ్గర ఉంది.. వంటింట్లో పెట్టిన పుస్తెల తాడు తీసుకురమ్మన్నదని చెప్పి, చైన్ తీసుకొని ఉడాయించాడు. అయితే, షోరూంలో భర్త లేకపోవడంతో మోసపోయానని గ్రహించిన రుక్మిణి ఇంటికి వచ్చి వంటింట్లో చూడగా పుస్తెల తాడు కనిపించలేదు. దీంతో మామను అడగగా, మీరే తెమ్మన్నారని దుండగుడు వచ్చి తీసుకెళ్లాడని చెప్పడంతో ఆమె లబోదిబోమంటూ గ్యాస్ ఏజెన్సీ వద్దకు వెళ్లి చూడగా నిందితుడు కనిపించలేదు. దీంతో భర్తతో కలిసి ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.
బంగారం గిఫ్ట్‌గా వచ్చిందని..
వర్ని(బాన్సువాడ): గిఫ్ట్ వచ్చిందని చెప్పి రెండున్నర తులాల చైన్‌తో ఉడాయించాడో దుండగుడు. ఎస్సై చంద్రశేఖర్ కథనం ప్రకారం.. అపాంధి ఫారంలో నివాసముండే గుగ్లోత్ సుభద్ర, దేవిదాస్ దంపతుల ఇంటికి మంగళవారం ఓ అగంతకుడు వచ్చాడు. స్కీంలో మీ అబ్బాయికి స్కూటీ, మూడు తులాల బంగారం వచ్చిందని.. మీరు నాతో వస్తే వాహనం, బంగారం ఇస్తానని చెప్పడంతో ఆశపడ్డ దంపతులు తమ బైక్‌పై అతడి వెంట వెళ్లారు.
కొం త దూరం వెళ్లిన తర్వాత అగంతకుడు నేను ఇప్పు డే వస్తా.. ఇక్కడే ఉండండి అని చెప్పి అక్కడి నుంచి తిరిగి వచ్చాడు. నేరుగా సుభద్ర ఇంటికి చేరుకున్న దుండ గుడు.. ఆమె కోడలు సుమలతతో ‘నీ మెడలో ఉన్న గొలుసును మీ అత్త తీసుకురమ్మని నన్ను పంపిందని’ చెప్పాడు. అంతకు ముందే అత్త, మామతో కలిసి దుండగుడు వెళ్లడం గమనించిన సుమలత మెడలోని రెండున్నర తులాల పుస్తెల తాడును తీసి అతడికివ్వగా, అగంతకుడు అక్కడి నుంచి ఉడాయించాడు.
అయితే, రోడ్డుపై చాలాసేపు వేచి చూసిన సుభద్ర దంపతులు మోసపోయామని గుర్తించి ఇంటికి చేరుకున్నారు. అయితే, దుండగుడు చైన్ తీసుకెళ్లిన విషయాన్ని కోడలు చెప్పడంతో బాధితులు లబోదిబోమంటూ చుట్టుపక్కల వెతికారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment