నిజామాబాద్ క్రైం(నిజామాబాద్ అర్బన్):
చోరీలు చేస్తున్నవారిని పట్టుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా మోసాలు అవుతూనే ఉన్నాయి. తాజాగా జిల్లా కేంద్రంలో దుండగులు ఓ అమాయకుడిని మాయ మాటల్లో దింపి అతడి దృష్టి మళ్లించి డబ్బులు ఎత్తుకు పోయారు. ఈ సంఘటన జరిగి మూడు రోజుల తర్వాత వెలుగుచూసింది. మాక్లూర్ మండలం మామిడిపల్లి గ్రామానికి చెందిన పటేవార్ పవన్‌కుమార్ ఈనెల 8న తన సోదరుడు రూ. 50 వేలు, స్నేహితుడికి రూ.40వేలు వారి ఖాతాల్లో డిపాజిట్ చేసేందుకు బైక్‌పై జిల్లా కేంద్రంలోని బస్టాండ్ వెనుక గల ఎస్‌బీఐకి వచ్చాడు.
డిపాజిట్ మిషన్ పనిచేయక డబ్బులను కవర్‌లో పెట్టుకుని బైక్‌కు వద్దకు పెట్రోల్ టాంక్‌పై ఉండే కవర్‌లో డబ్బుల కవర్ పెట్టాడు. అప్పటికే నలుగురు దుండగులు పవన్‌కుమార్‌ను గమనిస్తూ అతడిని వెంబడించారు. ముగ్గురు బైక్ వద్ద ఉండగా, మరోకరు సంబంధం లేకుండా బ్యాంక్ నుంచి బయటకు వస్తున్నట్లు నటిస్తూ పవన్ వద్దకు రాగానే రూ.500లు కింద పడేశాడు. అనంతరం పవన్‌కు కిందపడిన డబ్బులు నీవేనా.. అంటూ ముందుకెళ్లాడు. వారి మాయమాటలు నమ్మిన పవన్ తన బైక్‌ను స్టాండ్ చేసి పక్కకు వచ్చి కిందపడిన డబ్బులను తీసుకుంటుండగా, బైక్ వద్ద నిలబడిన ముగ్గురు దుండగులు డబ్బుల కవర్‌ను ఒకరు తీసుకోగా, మరొకరు డబ్బులతో పారిపోయాడు.
మరొక దుండగుడి చేతిలో కవర్‌ను పవన్ గుర్తించి కేకలు పెడుతూ అతడి వెంటపడ్డాడు. అయినా అతడు చిక్కకుండా పరారయ్యాడు. పట్టపగలే ఈ సంఘటన జరిగినా చోరీ చేసివాడిని మాత్రం ఎవరు పట్టుకోలేక పోయారు. అనంతరం బాధితుడు విషయాన్ని ఒకటోటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఎస్‌బీఐకి అక్కడి సీసీ కెమోరాలను పరిశీలించారు. దుండగులు చోరీకి పాల్పడిన విధానాన్ని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దుండగుల కోసం గాలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment