మహిళ నుంచి బంగారు గొలుసు అపహరణ | Chain robbery from Women | Sakshi
Sakshi News home page

మహిళ నుంచి బంగారు గొలుసు అపహరణ

Published Sun, Aug 21 2016 11:03 PM | Last Updated on Mon, Sep 4 2017 10:16 AM

Chain robbery from Women

 అమ్రాబాద్‌ : ఓ మహిళ మెడలో నుంచి దుండగుడు బంగారు గొలుసును అపహరించుకెళ్లాడు. వివరాలిలా ఉన్నాయి. అమ్రాబాద్‌ మండలం జంగంరెడ్డిపల్లిలో ముదిరెడ్డి జంగమ్మ నివాసముంటోంది. కాగా, శనివారం ఉదయం కుటుంబ సభ్యులు శుభకార్యం నిమిత్తం వేరే గ్రామానికి వెళ్లగా రాత్రి ఈమె ఇంట్లో ఒంటరిగా నిద్రించింది. ఇదే అదనుగా భావించిన ఓ గుర్తుతెలియని వ్యక్తి ఆదివారం తెల్లవారుజామున ఇంట్లోకి ప్రవేశించాడు. ఆమె మెడలో నుంచి రూ.90వేల విలువజేసే మూడు తులాల బంగారు గొలుసును లాక్కెళ్లిపోయాడు. వెంటనే మేల్కొన్న బాధితురాలు కేకలు వేయడంతో చుట్టుపక్కలవారు వచ్చారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో హెడ్‌కానిస్టేబుల్‌ ఖాదర్‌ మొíß యొద్దీన్‌ కేసు దర్యాప్తు జరుపుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement