Amrabad
-
నల్లమల టైగర్ జోన్ లో ఓరోజు.. ఆమ్రాబాద్ నుంచి సాక్షి గ్రౌండ్ రిపోర్ట్
-
నాగర్ కర్నూల్: అమ్రాబాద్ అడవుల్లో అగ్నిప్రమాదం
సాక్షి, నాగర్ కర్నూల్: జిల్లాలోని అమ్రాబాద్ అడవుల్లో అగ్నిప్రమాదం సంభవించింది. దోమలపెంట వద్ద అటవీప్రాంతంలో మంటలు చెలరేగాయి. దాదాపు ఐదు హెక్టార్ల మేర అడవి దగ్ధమైనట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం అందాల్సి ఉంది. ఇదీ చదవండి: ఖాతాలు, మనుషులే.. పరాన్నజీవులు! -
ఎలుక మూతి.. సౌండ్ వింటే గుండె ఆగి చస్తాయ్!!
సాక్షి, నాగర్ కర్నూల్: జానెడు పొడవు.. 2,3 కిలోల బరువు.. ఎలుకలాంటి ముఖం.. జాతి మాత్రం జింక. మన దేశంలో అరుదైన మూషిక జింకలు అవి. జింకల జాతిలో అతి చిన్నవి అయిన ఈ మూషిక జింకలకు నల్లమల అభయారణ్యం కేంద్రంగా మారుతోంది. అంతరించిపోయే దశలో ఉన్న మూషిక జింకలను సంరక్షించేందుకు అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలో ప్రత్యేకంగా ‘మౌస్ డీర్ సాఫ్ట్ రిలీజ్’కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. బరువు తక్కువ.. భయం ఎక్కువ! భారత ఉప ఖండంలో మాత్రమే విరివిగా కనిపించే మూషిక జింకలు నల్లమల అటవీ ప్రాంతంలో 20 ఏళ్ల కిందే అంతరించిపోయినట్టు అంచనా. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ జింకలను అంతరించిపోతున్న జాతిగా గుర్తించి వన్యప్రాణి సంరక్షణ చట్టంలోని షెడ్యూల్ 1లో చేర్చింది. మూషిక జింకలకు భయం ఎక్కువ. పెద్ద శబ్దాలు, జంతువులు దాడి చేసినప్పుడు వాటి గుండె ఆగి మరణిస్తాయని జంతుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. మూషిక జింకలు రాత్రివేళల్లో ఎక్కువగా సంచరిస్తాయి. అడవిలో నేలరాలిన పండ్లు, పూలు, ఆకులను తింటాయి. మారేడు, ఉసిరి, పరక, గొట్టి, మంగకాయలు, పుట్టగొడుగులు, చిన్నచిన్న పొదల లేత ఆకులను ఇష్టంగా తింటాయి. మూషిక జింక గర్భాధారణ కాలం ఆరునెలలు. ఒక ఈతలో ఒకట్రెండు పిల్లలను మాత్రమే కంటుంది. అయితే వెంటనే మళ్లీ సంతానోత్పత్తికి సిద్ధం కావడం వీటి ప్రత్యేకత. వీటిని చిరుత పులులు, అడవి కుక్కలు, గద్దలు, అడవి పిల్లులు వేటాడుతాయి. వీటికితోడు వేట, అడవుల నరికివేత, కార్చిచ్చుల వంటివి మూషిక జింకల ఉనికికి ముప్పుగా మారుతున్నాయి. మంచి ఫలితాలు కన్పిస్తున్నాయి అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో 2017 నుంచి మౌస్‌డీర్ సాఫ్ట్ రిలీజ్ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. నల్లమలలో అంతరించిపోయిన మూషిక జింకల జాతిని తిరిగి పెంచేందుకు అటవీ శాఖ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. క్రమంగా మూషిక జింకల సంఖ్య పెరుగుతోంది. నిత్యం 50 ట్రాప్ కెమెరాలతో వాటి కదలికలను గమనిస్తున్నాం. ::: రోహిత్ గోపిడి, జిల్లా అటవీశాఖ అధికారి, నాగర్‌కర్నూల్ 3 దశల్లో.. ప్రత్యేక జాగ్రత్తల మధ్య.. అటవీశాఖ హైదరాబాద్‌లోని జూపార్క్, సీసీఎంబీ సంస్థలతో కలసి మూషిక జింకల సంతతిని పెంచేందుకు చర్యలు తీసుకుంటోంది. మొదట 2008లో శేషాచలం అడవుల నుంచి నాలుగు ఆడ, రెండు మగ మూషిక జింకలను తీసుకొచ్చి హైదరాబాద్ జూపార్క్‌లోని బ్రీడింగ్ కేంద్రంలో ఉంచారు. వాటి సంఖ్య పెరిగిన తర్వాత 2017 సెప్టెంబర్ 12 నుంచి ‘మౌస్ డీర్ సాఫ్ట్ రిలీజ్’ప్రోగ్రాం కింద అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో విడతల వారీగా విడుదల చేస్తున్నారు. ► ఒక్కో బ్యాచ్‌లో ఆరు ఆడ, రెండు మగ మూషిక జింకలను వదులుతున్నారు. ఇది మూడు దశలుగా జరుగుతుంది. ఇందుకోసం నల్లమల అటవీ ప్రాంతంలోని ఫర్హాబాద్ సమీపంలో మూడు కంపార్ట్మెంట్లను అధికారులు ఏర్పాటు చేశారు. ► తొలిదశలో క్యారెట్, దానిమ్మ, అరటి వంటి బయటి ఆహారాన్ని అందించి పరిరక్షిస్తారు. ► రెండో దశలో బయటి ఆహారాన్ని తగ్గిస్తూ.. అడవిలో సహజంగా లభించే ఆహారాన్ని అందజేస్తారు. ► మూడో దశలో అడవిలోకి వదిలి బయటి నుంచి నీరు, ఆహారం ఇవ్వకుండా సహజ వాతావరణంలో అవే వెతుక్కుని తీసుకునేలా అలవాటు చేస్తారు. ► మొత్తంగా 30 రోజుల పరిశీలన అనంతరం పూర్తిగా అడవిలో వదిలేస్తారు. అయితే వాటి పరిస్థితిని పర్యవేక్షించేందుకు అడవిలో అక్కడక్కడా 50 వరకు ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు మొత్తంగా 144 మూషిక జింకలను విడుదల చేశారు. -
ఇలా చేస్తే అడవి అంటుకోదు!
నాగర్‌కర్నూల్: అనుకోకుండా అడవులకు నిప్పు అంటుకుంటే జరిగే నష్టం ఊహించలేనిది. కేవలం వృక్ష సంపదనే కాకుండా అడవుల్లో పెరిగే పశుపక్షాదులు, జంతువులను కూడా నష్టపోవాల్సి ఉంటుంది. ప్రతియేటా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అక్కడక్కడా మంటలు చెలరేగి కొంత మేర నష్టం కలుగుతూనే ఉంది. ముఖ్యంగా ప్రతి వేసవిలో శ్రీశైలం వెళ్లేదారిలో అక్కడక్కడా కొంత మంది పర్యాటకులు, సమీప గ్రామాలకు చెందినవారు పశువులను మేపే సమయంలో చేసే చిన్నచిన్న పొరపాట్ల వల్ల మంటలు పుట్టుకురావడంతో వాటిని ఆర్పేందుకు అధికారులు నానా తిప్పలు పడాల్సిన పరిస్థితి నెలకొంటుంది. అసలే వేసవిలో రాలిన ఆకులు ఎండిపోయి ఉండడంతో వేగంగా మంటలు వ్యాపించే అవకాశం ఉంది. అయితే ఈసారి అటవీ శాఖాధికారులు జిల్లావ్యాప్తంగా పొంచి ఉన్న అటవీ ప్రాంతాల్లో ఫైర్‌లైన్స్ ఏర్పాటు చేసి అగ్నిప్రమాదాలకు అడ్డుకట్ట వేసేందుకు చర్యలు చేపట్టారు. అతిపెద్ద టైగర్ రిజర్వ్ ప్రాజెక్టు దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వ్ ప్రాజెక్టుగా అమ్రాబాద్ అభయారణ్యం గుర్తింపు పొందింది. ఇది 2,611.39 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉండగా ఇందులో 2,166.37 చదరపు కిలోమీటర్లు అభయారణ్యం కాగా, 445.02 చదరపు కిలోమీటర్లు బఫర్‌జోన్‌గా ఉంది. అయితే గతంతో పోలిస్తే ఈ ఏడాది అటవీ ప్రాంతాన్ని సంరక్షించేందుకు అధికారులు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి చర్యలు తీసుకున్నారు. ఎక్కడైనా అగ్గి రాజుకుంటే మంటలు వ్యాపించకుండా ఫైర్‌లైన్స్‌ను ఏర్పాటు చేశారు. 3 మీటర్లు, 5 మీటర్ల వెడల్పుగా ఉండే ఫైర్‌లైన్స్‌ను ఏర్పాటు చేశారు. కేవలం నల్లమల్ల అభయారణ్యం మాత్రమే కాకుండా అటవీ ప్రాంతం విస్తరించి ఉన్న కొల్లాపూర్, లింగాల, అచ్చంపేట, అమ్మాబాద్ వంటి సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి మొత్తం 1,200 కిలోమీటర్ల మేరకు ఈ ఫై¯ర్‌లైన్స్‌ను ఏర్పాటు చేశారు. అంతే కాకుండా శ్రీశైలం వెళ్లేదారిలో పర్యాటకులు రోడ్డు పక్కన సేద తీరడానికి, భోజనాలు చేసేందుకు దాదాపు 222 కిలోమీటర్ల మేర వీవ్‌లైన్స్‌ను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా నల్లమల పరిధిలో ఎక్కడైనా మంటలు అంటుకుంటే వాటిని ఆర్పేందుకు వెంటనే అక్కడికి చేరుకునేలా 6 టీంలను ఏర్పాటు చేశారు. ఒక్కో టీంలో 5 మంది సిబ్బంది ఉండగా వారికి ఒక వాహనంతోపాటు మంటలను ఆర్పేందుకు ఆధునిక యంత్రాలను అందించారు. ఇక అటవీ ప్రాంతాల్లో ఉండే ఆయా గ్రామాలకు సంంధించిన ప్రజలు పశువులను మేపేందుకు అడవుల్లోకి వెళ్లి ధూమపానం చేసేందుకు అగ్గిరాజేయడం, వాటిని ఆర్పకుండా నిర్లక్ష్యం వహించడం వల్ల కూడా అడవికి మంటలు అంటుకునే ప్రమాదం ఉంది. ఈ విషయంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో ఇప్పటికే ఆయా గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. అడవిలో అగ్ని ప్రమాదాలతో జరిగే నష్టాలు, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే విధించే శిక్షలపై అవగాహన కల్పించారు. ప్రతిఏటా రూ.లక్షల్లో నిధులు ఖర్చు చేస్తున్నా ఎక్కడో ఒకచోట ప్రమాదాలు జరుగుతూనే ఉండగా ఈసారి అధికారులు తీసుకునే చర్యలు ఎంతమేర ఫలిస్తాయో వేచిచూడాలి. అవగాహన కల్పించాం.. అడవిలో ఎలాంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా అన్నిరకాలుగా రక్షణ చర్యలు చేపడుతున్నాం. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి అవసరమైన చోట ఫైర్‌లైన్స్ ఏర్పాటు చేశాం. ఎక్కడైనా నిప్పంటుకుంటే వెంటనే అక్కడికి చేరుకుని ఆర్పేలా 6 ప్రత్యేక ఫైర్‌టీంలను ఏర్పాటు చేశాం. అటవీ పరిసర ప్రాంతాల్లోని గ్రామాల ప్రజలకు కూడా ఈ విషయమే అవగాహన కల్పించాం. - కృష్ణగౌడ్, డీఎఫ్ఓ, నాగర్‌కర్నూల్ అమ్రాబాద్, అడవీ ప్రాంతం, ఎండకాలం, మంటలు, రిజర్వ్‌లు, అవగాహన -
ఆలయంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు
సాక్షి, అమ్రాబాద్: పదర మండలం రాయలగండి లక్ష్మీ చెన్నకేశవస్వామి ఆలయంలో ధ్వజ స్తంభం ఎదుట ఉన్న అగ్నిగుండాన్ని మంగళవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపారు. అగ్ని గుండం కోసం పేర్చిన రాళ్లను తొలగించి, తవ్వకాలు జరిపి యథాస్థానంలో ఉంచారు. బుధవారం ఉదయం స్థానికంగా ఉన్న భక్తులు కొంత మంది చూసి తవ్వకాలు జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పదర ఎస్ఐ సురేష్‌కుమార్ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. అక్కడున్న వారిని విచారించారు. కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సురేష్ కుమార్ తెలిపారు. గతంలోనూ తవ్వకాల ప్రయత్నం ఆలయంలో తవ్వకాలు జరిపిన ప్రదేశం ఇదిలాఉండగా గత ఆగస్టు 10వ తేదీన రాయలగండిలో గుప్త నిధుల తవ్వకాల ప్రయత్నం జరిగింది. ఓ కారులో గుప్తనిధుల కోసం రాయలగండి లక్ష్మీచెన్నకేశవ స్వామి ఆలయం సమీపంలో పరికరాలతో అణ్వేషన జరుపుతుండగా స్థానికులు గుర్తించి వెంబడించారు. కారులో పరారైన దుండగులను మన్ననూర్‌లో ప్రజలు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. వచ్చిన ఐదు మంది దుండగులతో పాటు కారును, గుప్తనిధుల అన్వేషణకు తెచ్చుకున్న డిటోనేటర్, పౌడర్, వివిధ పరికరాలను స్వాధీనం చేసుకొని వారి పై కేసు నమోదు చేశారు. అప్పట్లో అన్వేషణ ప్రయత్నం జరగడం, బుధవారం తవ్వకాలు బయట పడటంతో స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రాయలగండి ఆలయం వద్ద పోలీసు పహారా ఉంటే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
‘కేటీఆర్ ట్వీట్ కొండంత అండనిచ్చింది’
సాక్షి, హైదరాబాద్: సేవ్ నల్లమల్ల పేరుతో మేధావులు, సామాజిక కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం ఎంతో ఊపిరినిచ్చిందని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు అన్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ నల్లమల్లకు మద్దతుగా చేసిన ట్విట్ మాకు కొండంత అండగా అనిపించిందిని సంతోషం వ్యక్తం చేశారు. శనివారం ఆయన అసెంబ్లీలో మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. గతంలో వజ్ర నిక్షేపాలు రాబర్ట్ వాద్రాకు కేటాయిస్తే సీఎం కేసీఆర్‌తో కలిసి తామంతా ముక్తకంఠంతో ఖండించినట్లు ఆయన గుర్తుచేశారు. తన నియోజకవర్గ ప్రజలకు ఇంత మంది అండగా ఉంటూ నాకు మరింత ధైర్యం ఇచ్చారన్నారు. నల్లమల్ల యూరేనియం తవ్వకాలపై కేసీఆర్ స్పందించటం లేదు అనటం పూర్తి అవాస్తవమని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఆయన మాట్లాడుతూ..‘టీఆర్ఎస్ ప్రభుత్వం యురేనియం తవ్వకాలకు అనుమతి ఇచ్చింది అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కానీ ఎక్కడా కూడా ప్రభుత్వం పర్యావరణ అనుమతులు ఇవ్వలేదు. ప్రజా వ్యతిరేక నిర్ణయం తీసుకునే నైజం మాది కాదు. ఉద్యమం చేసి తెలంగాణ సాధించాం. పోరాటం చేసే శక్తి మాకుంది. నల్లమల్లపై కేంద్ర ప్రభుత్వంకు వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. ప్రధానమంత్రి స్వయంగా పులుల దినోత్సవం రోజు అమ్రాబాద్‌లో పులుల సంఖ్యను చెప్పారు. ఆసియాలోనే అతిపెద్ద పులులు ఉన్న అడవిగా ఆమ్రాబాద్‌కు పేరుంది. అడవులు కాపాడుకోవాలని సీఎం కేసీఆర్ అటవిలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడుతున్నారు. యురేనియంపై నేను ప్రాణం ఉన్నంత వరకు పోరాటం చేస్తా. సీఎం కేసీఆర్ సూచనలు, సలహాలు తీసుకొని మరో ఉద్యమానికి స్వీకారం చూడతాం. నా నియోజకవర్గంలోని ప్రజలకు అండగా ఉన్న మీడియా,సామాజిక కార్యకర్తలకు ధన్యవాదాలు’ అని వ్యాఖ్యానించారు. -
అమ్రాబాద్‌లో మంత్రి హరిష్‌రావు పర్యటన
-
నిద్రిస్తున్న అన్నను గొడ్డలితో..
అమ్రాబాద్: నాగర్‌కర్నూల్ జిల్లాలోని అమ్రాబాద్ మండలంలో దారుణం చోటుచేసుకుంది. సొంత తమ్ముడే నిద్రిస్తున్న అన్నను గొడ్డలితో నరికి చంపాడు. వివరాలు.. బీకే తిర్మలాపురం గ్రామంలోని గెట్టగోని కాశయ్య(34), శ్రీశైలం అనే వ్యక్తులు అన్నదమ్ములు. వీరి మధ్య గత కొంతకాలంగా కుటుంబ తగాదాలు, ఆస్తి గొడవలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో నిద్రిస్తున్న అన్న కాశయ్యను తమ్ముడు గొడ్డలితో నరికి చంపాడు. కాశయ్య భార్య అరుణ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
మహిళ నుంచి బంగారు గొలుసు అపహరణ
అమ్రాబాద్ : ఓ మహిళ మెడలో నుంచి దుండగుడు బంగారు గొలుసును అపహరించుకెళ్లాడు. వివరాలిలా ఉన్నాయి. అమ్రాబాద్ మండలం జంగంరెడ్డిపల్లిలో ముదిరెడ్డి జంగమ్మ నివాసముంటోంది. కాగా, శనివారం ఉదయం కుటుంబ సభ్యులు శుభకార్యం నిమిత్తం వేరే గ్రామానికి వెళ్లగా రాత్రి ఈమె ఇంట్లో ఒంటరిగా నిద్రించింది. ఇదే అదనుగా భావించిన ఓ గుర్తుతెలియని వ్యక్తి ఆదివారం తెల్లవారుజామున ఇంట్లోకి ప్రవేశించాడు. ఆమె మెడలో నుంచి రూ.90వేల విలువజేసే మూడు తులాల బంగారు గొలుసును లాక్కెళ్లిపోయాడు. వెంటనే మేల్కొన్న బాధితురాలు కేకలు వేయడంతో చుట్టుపక్కలవారు వచ్చారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో హెడ్‌కానిస్టేబుల్ ఖాదర్ మొíß యొద్దీన్ కేసు దర్యాప్తు జరుపుతున్నారు. -
వరుణుడి కోసం ‘జడకొప్పు’
అమ్రబాద్: వరుణ దేవుడు కరుణించి వర్షం కురింపించాలని మండలంలోని జంగంగరెడ్డి రైతులు, మహిళలు పొడవాటి కర్రకు పగ్గాలు(తాళ్లు) చుట్టి ఉదయం నుంచి సాయంత్రం వరకు రామ భజనతో జడకొప్పు వేశారు. వర్షం కురిసే వరకు అల్లిన జడకొప్పు తొలగించమని ప్రతిన చేశారు. అదేవిధంగా స్థానిక ఆలయాల్లో విగ్రహాలను నీళ్లతో అభిశేకాలు చేశారు. పూజలు చేసి వర్షం కురిపించాలని మొక్కుకున్నారు. -
దళితులపై దాడులుచేస్తున్న వారిపై చర్యతీసుకోవాలి
అమ్రాబాద్: గోసంరక్షక దళం పేరుతో హిందూమతోన్మాదులు పనిగట్టుకొని దళితులపై దాడులు చేస్తున్నారని వారిని కఠినంగా శిక్షించాలని తెలంగాణ విద్యార్థి వేదిక అధ్యక్షుడు ప్రశాంత్, జ్యోతి లింగయ్య ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉత్తరప్రదేశ్, గుజరాత్,మధ్యప్రదేశ్, రాష్ట్రాల్లో ఇప్పటికే దాడులు చేశారని, సంఘటనకు బాధ్యులైన వారిని శిక్షించలేదని తెలిపారు. మరోసారి తూర్పుగోదావరి జిల్లా తమనప్ప గ్రామంలో చనిపోయిన ఆవు చర్మాన్ని వలుస్తున్న దళితుల పై దాడులు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దళితులపై కపట ప్రేమ చూపిస్తున్న కేంద్రప్రభుత్వం ఇప్పటికైన దళితులపై దాడులు చేసిన గో సంరక్షకదళం వారిని కఠినంగా శిక్షించాలని పేర్కొన్నారు. -
10 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
అమ్రాబాద్ : మహబూబ్‌నగర్ జిల్లా అమ్రాబాద్ పోలీసులు ఆదివారం సాయంత్రం అక్రమంగా తరలిస్తున్న సుమారు 10 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. మాదవానిపల్లి నుంచి వెంకటేశ్వరబావి గ్రామానికి టాటా ఏస్ వాహనంలో బియ్యాన్ని తరలిస్తున్నారు. సమాచారం అందుకున్న ఎస్ఐ ఆదిరెడ్డి సిబ్బందితో కలసి మాదవానిపల్లి సమీపంలో వాహనాన్ని అడ్డగించి బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. బాలింగంశేట్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. -
26 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం
అమ్రాబాద్ (మహబూబ్‌నగర్) : నిరుపేదలకు అందాల్సిన రేషన్ బియ్యాన్ని అక్రమంగా బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన విజిలెన్స్ అధికారులు 26 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకొని వాటిని తరలిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేశారు. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా అమ్రాబాద్ మండలంలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. -
పశువులకాపరిపై ఎలుగు దాడి
అమ్రాబాద్ (మహబూబ్ నగర్) : ఓ పశువులకాపరిపై ఎలుగుబంటి దాడి చేసిన సంఘటన సోమవారం సాయంత్రం అమ్రాబాద్ మండలంలోని కొత్తపల్లి అడవిప్రాంతంలో జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన ప్రకారం... కొత్తపల్లి గ్రామానికి చెందిన మాధ్య అనే పశువుల కాపరి గ్రామ వ్యవసాయ పొలాల సమీపంలోని అడవి ప్రాంతంలో పశువులను మేపుతున్నాడు. ఈ క్రమంలో పొదల్లో ఉన్న పిల్లల ఎలుగుబంటి అకస్మాత్తుగా అతడిపై పడి దాడి చేసింది. తోటిపశువుల కాపరుల అరుపులతో ఎలుగుబంటి పారిపోయింది. ఈ సంఘటనలో మాధ్యకు తల, శరీరభాగాలకు తీవ్రగాయాలు కాగా ప్రైవేట్ వాహనంలో అచ్చంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
ఎలుగుబంటి దాడిలో రైతుకు తీవ్రగాయాలు
ఆమ్రాబాద్ (మహబూబ్‌నగర్ జిల్లా) : ఎలుగుబంటి దాడిలో ఓ రైతుకు తీవ్ర గాయాలయ్యాయి. మహబూబ్‌నగర్ జిల్లా ఆమ్రాబాద్ మండలం ముక్తేశ్వరం గ్రామానికి చెందిన రైతు ముక్త్యాలు(40) శనివారం సాయంత్రం పొలంలో వ్యవసాయ పనుల్లో ఉన్నాడు. కాగా రాత్రి 7 గంటల సమయంలో సమీప అటవీ ప్రాంతం నుంచి వచ్చిన ఓ ఎలుగుబంటి అతడిపై దాడికి దిగింది. సమీపంలోనే ఉన్న రైతులు వెంటనే కర్రలతో వచ్చి ఎలుగుబంటిని పారదోలారు. ఎలుగుబంటి దాడిలో తీవ్రంగా గాయపడిన ముక్త్యాలును అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
గొర్రెల కాపరిపై ఎలుగు దాడి
అమ్రాబాద్ (మహబూబ్‌నగర్ జిల్లా) : గొర్రెల మేత కోసం వెళ్లిన కాపరిపై ఎలుగుబంటి దాడి చేసి తీవ్రంగా గాయపర్చింది. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా అమ్రాబాద్ మండలం ఉప్పునూతలబికే గ్రామంలోని అటవీ ప్రాంతంలో శనివారం జరిగింది. మండలంలోని కుమ్మరోనిపల్లి గ్రామానికి చెందిన వెంకటయ్య గత నెల రోజులుగా తన గొర్రెల మందను ఉప్పునూతలబికే గ్రామం సమీపంలోని అటవీప్రాంతానికి మేతకు తీసుకెళ్తున్నాడు. కాగా ఈ క్రమంలోనే శనివారం గొర్రెల మేతకు వెళ్లిన అతనిపై ఎలుగుబండి దాడి చేసింది. ఈ విషయాన్ని గమనించిన మరికొంతమంది గొర్రెల కాపరులు ఎలుగుబంటిని తరిమికొట్టారు. తీవ్రంగా గాయపడిన వెంకటయ్యను అచ్చంపేట ఆస్పత్రికి తరలించారు. ఇదే మండలంలో శుక్రవారం మరో రైతు ఎలుగుబంటి దాడిలో గాయపడిన విషయం తెలిసిందే. దీంతో మండలంలోని ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. -
ప్రజల గుండెల్లో ‘రాజన్న’గా వైఎస్
* మహబూబ్‌నగర్ జిల్లా పరామర్శ యాత్రలో షర్మిల * అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల కోసం తపించారు * పేదవాడిని తన భుజాలపై మోశారు * ప్రాంతాలు, రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేశారు * రెండోరోజు యాత్రలో మూడు కుటుంబాలకు ఓదార్పు * నాగర్‌కర్నూలు, అచ్చంపేట, కొల్లాపూర్‌లో జన నీరాజనం పరామర్శ యాత్ర నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: అధికారం ఉన్నా లేకున్నా నిత్యం ప్రజల పక్షాన నిలిచి వారి సంక్షేమం గురించి తపించిన నేత వైఎస్ రాజశేఖరరెడ్డి అని షర్మిల కొనియాడారు. పేదవాడిని తన భుజాలపై మోసిన రాజశేఖరరెడ్డి తెలుగు ప్రజల హృదయాల్లో రాజన్నగా కొలువయ్యారన్నారు. ఒక వ్యక్తి మరణిస్తే వందలాది మంది గుండెలాగి ప్రాణాలు కోల్పోవడం దేశ చరిత్రలో ఎక్కడా లేదని, ప్రజల ప్రేమ, అభిమానం ఎంతగానో ఉంటే తప్ప ఇలా జరగదని పేర్కొన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబాలను ఓదార్చేందుకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన పరామర్శ యాత్ర మహబూబ్‌నగర్ జిల్లాలో రెండోరోజుకు చేరుకుంది. మంగళవారం ఉదయం అమ్రాబాద్ మండల కేంద్రంలో భోగం రంగయ్య కుటుంబాన్ని పరామర్శించిన షర్మిల.. అక్కడ్నుంచి అచ్చంపేట, నాగర్ కర్నూలు మీదుగా కోడేరు మండలంలోని ఎత్తెం గ్రామానికి చేరుకున్నారు. అక్కడ పుట్టపాగ నర్సింహ కుటుంబాన్ని, కొల్లాపూర్‌లో కటికె రాంచంద్రయ్య కుటుంబాన్ని పరామర్శించారు. వారి కుటుంబీకులకు ధైర్యం చెప్పారు. ఒక్కో కుటుంబంతో గంటకు పైగా గడిపారు. పిల్లల చదువులు, ఇతర స్థితిగతులను తెలుసుకున్నారు. పేద కుటుంబాలకు వైఎస్ కుటుంబం ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. షర్మిల వచ్చిన విషయాన్ని తెలుసుకొని ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అమ్రాబాద్, అచ్చంపేట, కొల్లాపూర్‌లలో ప్రజలనుద్దేశించి షర్మిల ప్రసంగించారు. ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించారు.. ప్రజలు తమ ప్రాణం కన్నా మిన్నగా నాన్నను ప్రేమించారని, అందుకే ఆయన మరణాన్ని తట్టుకోలేక గుండెలు పగిలి చనిపోయారని, వారికి, వారి కుటుంబాలకు శిరసు వంచి నమస్కరిస్తున్నానని షర్మిల ఉద్వేగంతో అన్నారు. రాజశేఖరరెడ్డి బతికుంటే రాష్ట్రం లో పేదరికం ఉండేది కాదని, గుడిసె అనేదే లేకుండా చేసేవారని చెప్పారు. ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, పింఛన్లు, 108 వంటి పథకాల ద్వారా లక్షలాది మంది పేదలను ఆదుకున్నారన్నారు. రుణమాఫీ, విద్యుత్ బకాయిల రద్దు, ఇన్పుట్ సబ్సిడీ, మద్దతు ధరల పెంపు వంటి నిర్ణయాలతో రైతు పక్షపాతిగా నిలిచారని గుర్తుచేశారు. రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా చేయాలని కలలుగని, ఎన్నో ప్రాజెక్టులకు అంకురార్పణ చేశారని చెప్పారు. వైఎస్సార్సీపీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ... ఈ యాత్ర రాజకీయాల కోసం చేయడం లేదన్నారు. వైఎస్ మరణానంతరం నల్లకాలువ వద్ద జగన్ ఇచ్చిన మాట కోసమే యాత్ర చేస్తున్నట్లు చెప్పారు. మహబూబ్‌నగర్ జిల్లా పార్టీ కన్వీనర్ ఎడ్మ కిష్టారెడ్డి మాట్లాడుతూ... తెలంగాణలో రైతులకు ప్రభుత్వం భరోసా కల్పించడం లేదని, అందుకే ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, పార్టీ నేతలు రెహమాన్, శివకుమార్, నల్లా సూర్యప్రకాశ్ రావు, సత్యం శ్రీరంగం, మామిడి శ్యాంసుం దర్ రెడ్డి, భీష్వ రవీందర్, జి.రాంభూపాల్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, కొండా రాఘవరెడ్డి, భగవంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్ పథకాలకు అభిమానులే రక్షకులు:షర్మిల
మహబూబ్‌నగర్: మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రతి పేదవాడిని అభిమానించి, ప్రేమించి, గుండెలలో పెట్టుకున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల అన్నారు. అందుకే పేదవాడి సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం ఆయన అనేక పథకాలు ప్రవేశపెట్టారని చెప్పారు. మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తి నుంచి ఆమె రెండవరోజు పరామర్శ యాత్ర ప్రారంభించారు. ప్రతి గ్రామంలోనూ ఆమెకు అపూర్వ స్వాగతం లభించింది. మన్ననూరులో ఆమె అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అక్కడ నుంచి అమ్రాబాద్ చేరుకొని అక్కడ వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. పార్టీ జెండా ఆవిష్కరించారు. అనంతరం అమ్రాబాద్, అచ్చంపేటలలో అశేష అభిమానులు ఉద్దేశించి ఆమె మాట్లాడారు. మహానేత వైఎస్ఆర్ ప్రవేశ పెట్టిన పథకాలన్నీ ప్రతిపేదవాడికీ అందేలా పోరాడవలసిన బాధ్యత అయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు, మనందరదీ అన్నారు. ప్రతిపేదవాడు గర్వంగా తలెత్తుకొని కార్పోరేట్ ఆస్పత్రిలో ఉచితంగా వైద్యం చేయించుకునేలా 'ఆరోగ్యశ్రీ' అనే అద్భుత పథకం ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. పేదరికం కారణంగా ఏ ఒక్క విద్యార్థి చదువు ఆగిపోకూడదని 'ఫీజు రీయింబర్స్మెంట్' పథకాన్ని ప్రవేశపెట్టి లక్షలాది మంది విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకునేందుకు అవకాశం కల్పించారని చెప్పారు. ప్రతి కుటుంబానికి పక్కా ఇల్లు ఉండాలన్న ఉద్దేశంతో 'ఇందిరమ్మ ఇల్లు' పథకం ద్వారా 46లక్షల పక్కా ఇళ్లు నిర్మించారనన్నారు. అలాగే 104, 108, జలయజ్ఞం, ఉచిత విద్యుత్... వంటి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. అయిదేళ్లపాటు ఏ ఒక్క ఛార్జీ, పన్ను పెంచకుండా పాలన సాగించారని చెప్పారు. ఒక వ్యక్తి మరణిస్తే ఆ బాధ తట్టుకోలేక, ఆ నిజాన్ని జీర్ణించుకోలేక కొన్ని వందల మంది మరణించడం ప్రజాస్వామ్య చరిత్రలో ఎప్పుడైనా చూశామా? అని ఆమె ప్రశ్నించారు. అది ఒక్క మహానేత విషయంలో జరిగిందన్నారు. ఆయన అధికారంలో ఉన్నా, లేకున్నా ప్రజల పక్షానే ఉన్నారని, అందువల్లే అలా జరిగిందని తెలిపారు. అమ్రాబాద్‌లో వైఎస్ మరణ వార్తను జీర్ణించుకోలేక అమరుడైన పర్వతనేని రంగయ్య భార్య అనసూయను షర్మిల పరామర్శించారు. కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారు. అండగా ఉంటామని వారికి భరోసా ఇచ్చారు. ఆ తరువాత ఎత్తం గ్రామంలో నరసింహ కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు. తాము అండగా ఉంటామని ఆ కుటుంబానికి ధైర్యం చెప్పారు. ఈ యాత్రంలో షర్మిల వెంట పార్టీ తెలంగాణ వర్కింగ్ ప్రసిడెంట్ పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఎమ్మెల్యేలు తాటి వెంకటేశ్వర్లు, పాయం వెంకటేశ్వర్లు, పార్టీ నాయకులు మామిడి శ్యాం సుందర రెడ్డి, నల్లా సూర్యప్రకాశ్, కొండా రాఘవ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, బీస్వా రవీందర్, ఎడ్మ కృష్ణా రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ** మరిన్ని చిత్రాలకు క్లిక్ చేయండి -
వైఎస్సార్ ఆశయాలను బతికిద్దాం
-
ఆమ్రాబాద్‌లో షర్మిల పరామర్శ యాత్ర