దళితులపై దాడులుచేస్తున్న వారిపై చర్యతీసుకోవాలి | Stop attacks on sc people | Sakshi
Sakshi News home page

దళితులపై దాడులుచేస్తున్న వారిపై చర్యతీసుకోవాలి

Published Fri, Aug 12 2016 8:15 PM | Last Updated on Mon, Sep 4 2017 9:00 AM

Stop attacks on sc people

అమ్రాబాద్‌: గోసంరక్షక దళం పేరుతో హిందూమతోన్మాదులు పనిగట్టుకొని దళితులపై దాడులు చేస్తున్నారని వారిని కఠినంగా శిక్షించాలని తెలంగాణ విద్యార్థి వేదిక అధ్యక్షుడు ప్రశాంత్, జ్యోతి లింగయ్య ఒక  ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఉత్తరప్రదేశ్, గుజరాత్,మధ్యప్రదేశ్, రాష్ట్రాల్లో ఇప్పటికే దాడులు చేశారని, సంఘటనకు బాధ్యులైన వారిని శిక్షించలేదని తెలిపారు. మరోసారి తూర్పుగోదావరి జిల్లా తమనప్ప గ్రామంలో చనిపోయిన ఆవు చర్మాన్ని వలుస్తున్న దళితుల పై దాడులు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దళితులపై కపట ప్రేమ చూపిస్తున్న కేంద్రప్రభుత్వం ఇప్పటికైన దళితులపై దాడులు చేసిన గో సంరక్షకదళం వారిని కఠినంగా శిక్షించాలని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement