అమ్రాబాద్ (మహబూబ్‌నగర్) : నిరుపేదలకు అందాల్సిన రేషన్ బియ్యాన్ని అక్రమంగా బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన విజిలెన్స్ అధికారులు 26 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకొని వాటిని తరలిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేశారు. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా అమ్రాబాద్ మండలంలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది.