అమ్రాబాద్ : మహబూబ్‌నగర్ జిల్లా అమ్రాబాద్ పోలీసులు ఆదివారం సాయంత్రం అక్రమంగా తరలిస్తున్న సుమారు 10 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. మాదవానిపల్లి నుంచి వెంకటేశ్వరబావి గ్రామానికి టాటా ఏస్ వాహనంలో బియ్యాన్ని తరలిస్తున్నారు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ ఆదిరెడ్డి సిబ్బందితో కలసి మాదవానిపల్లి సమీపంలో వాహనాన్ని అడ్డగించి బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. బాలింగంశేట్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.