అమ్రాబాద్ (మహబూబ్ నగర్) : ఓ పశువులకాపరిపై ఎలుగుబంటి దాడి చేసిన సంఘటన సోమవారం సాయంత్రం అమ్రాబాద్ మండలంలోని కొత్తపల్లి అడవిప్రాంతంలో జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన ప్రకారం... కొత్తపల్లి గ్రామానికి చెందిన మాధ్య అనే పశువుల కాపరి గ్రామ వ్యవసాయ పొలాల సమీపంలోని అడవి ప్రాంతంలో పశువులను మేపుతున్నాడు.
ఈ క్రమంలో పొదల్లో ఉన్న పిల్లల ఎలుగుబంటి అకస్మాత్తుగా అతడిపై పడి దాడి చేసింది. తోటిపశువుల కాపరుల అరుపులతో ఎలుగుబంటి పారిపోయింది. ఈ సంఘటనలో మాధ్యకు తల, శరీరభాగాలకు తీవ్రగాయాలు కాగా ప్రైవేట్ వాహనంలో అచ్చంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
పశువులకాపరిపై ఎలుగు దాడి
Published Mon, Sep 14 2015 7:48 PM | Last Updated on Sun, Sep 3 2017 9:24 AM
Advertisement
Advertisement