జీడి పిక్కల సేకరణ కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి చేయడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు.
అరకు : జీడి పిక్కల సేకరణ కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి చేయడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన విశాఖ జిల్లా అరకులోయలోని కొత్తబల్లుగూడ పంచాయతి పరిధిలోని జనుముగూడ గ్రామంలో గురువారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కొర్ర సుంక్ర(52) అనే వ్యక్తి జీడిపిక్కలు సేకరించడానికి అటవీ ప్రాంతానికి వెళ్లాడు. అక్కడ ఎలుగుబంటి దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఇది గుర్తించిన స్థానికులు అతన్ని ఆస్పత్రికి తరలించారు.