నిద్రిస్తున్న అన్నను గొడ్డలితో.. | axe attack, man kills his brother | Sakshi
Sakshi News home page

నిద్రిస్తున్న అన్నను గొడ్డలితో..

Published Mon, Mar 13 2017 9:37 AM | Last Updated on Mon, Jul 30 2018 8:37 PM

axe attack, man kills his brother

అమ్రాబాద్: నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని అమ్రాబాద్‌ మండలంలో దారుణం చోటుచేసుకుంది. సొంత తమ్ముడే నిద్రిస్తున్న అన్నను గొడ్డలితో నరికి చంపాడు.

వివరాలు.. బీకే తిర్మలాపురం గ్రామంలోని గెట్టగోని కాశయ్య(34), శ్రీశైలం అనే వ్యక్తులు అన్నదమ్ములు. వీరి మధ్య గత కొంతకాలంగా కుటుంబ తగాదాలు, ఆస్తి గొడవలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో నిద్రిస్తున్న అన్న కాశయ్యను తమ్ముడు గొడ్డలితో నరికి చంపాడు. కాశయ్య భార్య అరుణ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement