ఏవండీ.. మీ స్నేహితుడు రాత్రంతా మన ఇంట్లోనే నిద్రించాడు..! | wife complaint against husband Friend | Sakshi
Sakshi News home page

ఏవండీ.. మీ స్నేహితుడు రాత్రంతా మన ఇంట్లోనే నిద్రించాడు..!

Feb 19 2025 7:40 AM | Updated on Feb 19 2025 8:20 AM

wife complaint against husband Friend

బంజారాహిల్స్‌(హైదరాబాద్): ‘మనం ఊరెళ్లిన సమయంలో నీ స్నేహితుడు మన ఇంటికి వచ్చి కూతురి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని.. రాత్రంతా ఇంట్లోనే నిద్రించాడని’భార్య తన భర్తకు చెప్పింది. చేసింది నా స్నేహితుడే కదా పోనీలే అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడు. ఈ ఘటనపై చర్యలు తీసుకోవాల్సిందిగా బాధిత తల్లి బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.  

బంజారాహిల్స్‌ రోడ్‌ నం.5లోని ఓ బస్తీలో నివసించే భార్యాభర్తలు తమ 14 ఏళ్ల కూతురితో పాటు మిగతా ఇద్దరిని ఇంట్లోనే వదిలేసి ఈనెల 17వ తేదీన మహబూబ్‌నగర్‌కు వెళ్లారు. రాత్రి ఆమె భర్త స్నేహితుడు మోహన్‌సింగ్, సోను బాధితురాలి ఇంటికి వచ్చారు. ఇంట్లోనే మద్యం సేవించారు. అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో నిద్రిస్తున్న బాలిక(14) గదిలోకి వెళ్లిన సోను ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. నోరు నొక్కి అక్కడే పడుకున్నాడు. ఆమె అరవడానికి ప్రయత్నించగా బెదిరించాడు. తెల్లవారుజామున 6గంటల ప్రాంతంలో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. 

ఇంటికి వచ్చిన తల్లికి బాలిక జరిగిన విషయాన్ని చెప్పింది. ఇదే విషయాన్ని బాధిత తల్లి తన భర్త దృష్టికి తీసుకొచి్చంది. వచ్చింది నా స్నేహితుడే కదా అంటూ భర్త నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడు. దీంతో బాధితురాలు తన కూతురి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపట్ల చర్యలు తీసుకోవలంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు మోహన్‌సింగ్, సోనుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement