ట్యాపింగ్‌ లింక్స్‌ | Phone Tapping Case: Police Station Changed Latest News Updates | Sakshi
Sakshi News home page

పీఎస్‌ మారింది.. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామం

Published Mon, May 20 2024 11:55 AM | Last Updated on Mon, May 20 2024 1:36 PM

Phone Tapping Case: Police Station Changed Latest News Updates

హైదరాబాద్‌, సాక్షి: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో  కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసు విచారణ జరుగుతున్న పోలీస్‌ స్టేషన్‌ పరిధి మారింది. బంజారాహిల్స్‌ నుంచి జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌కు మార్చారు. ఈ కేసులో నిందితుడు రాధాకిషన్‌రావు నుంచి కీలక సమాచారాన్ని రాబట్టింది బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లోనే. అయితే ఈ మార్పునకు గల కారణాలపై దర్యాప్తు అధికారులు స్పష్టత ఇవ్వలేదు. 

ఇదిలా ఉంటే.. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక ఆధారాలను దర్యాప్తు అధికారులు సేకరించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మరిన్ని అరెస్టులు జరగొచ్చని సమాచారం. కొందరు పోలీసు అధికారులతో పాటు ప్రైవేట్‌ వ్యక్తులను కూడా అరెస్ట్‌ చేయాలని పోలీసులు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement