హెయిర్ కటింగ్ కోసం సెలూన్‌కు వెళ్లి ఒక వ్యక్తి సెలూన్ యజమాని కుమారునితో ‘బయటకు వెళ్లి సిగరెట్ కాల్చుకో’ అని అన్నాడు. ఈ మాట విన్న ఆ యువకుడు ఆగ్రహంతో ఊగిపోవడంతో అక్కడి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. జరుగున్న సంఘటనను అక్కడున్నవారంతా నిర్ఘాంతపోయి చూశారు.
దేశరాజధాని ఢిల్లీలో సిగరెట్ తాగే విషయంలో చోటు చేసుకున్న వివాదం దారుణానికి దారితీసింది. ఈ ఉదంతం ఢిల్లీలోని కిషన్‌గఢ్‌లో చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒక వ్యక్తిపై దాడికి పాల్పడిన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మద్యం మత్తులో సెలూన్‌కు వచ్చిన ఒక యువకుడు అక్కడే ఉంటున్న 38 ఏళ్ల వ్యక్తిపై కత్తెరతో పలుమార్లు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. అభయ్ కుమార్ అనే వ్యక్తి హెయిర్ కంటింగ్ కోసం సెలూన్‌కు వెళ్లాడు.
అదే సమయంలో దుకాణం యజమాని కుమారుడు మెహిత్ మహలావత్(22) అక్కడికి వచ్చాడు. అతను మద్యం మత్తులో ఉండి, సిగరెట్ కాలుస్తున్నాడు. దీంతో అభయ్ అతనితో ‘బయటకు వెళ్లి సిగరెట్ కాల్చుకో’అని అన్నాడు. ఈ మాట విన్న వెంటనే మోహిత్ ఆగ్రహంతో ఊగిపోతూ అక్కడేవున్న కత్తెర తీసుకుని పలుమార్లు అభయ్‌పై దాడి చేశాడు. ఈ ఘటనలో అభయ్ శరీరంపై 9 చోట్ల గాయాలయ్యాయి. బాధితుడిని స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. బాధితుని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడిని అరెస్టు చేశారు.
ఇది కూడా చదవండి: హెల్మెట్లు చాలావరకూ నలుపు రంగులోనే ఎందుకుంటాయంటే..
Comments
Please login to add a commentAdd a comment