ఫొటోలో కనిపిస్తున్న ఈ జీవి.. బాహుబలి కంటే బలమైంది. పేరు ఒరిబాటిడ్ మైట్ లేదా ఆర్మర్డ్ మైట్. చూడటానికి ఇది 0.2 మి.మీ నుంచి 1.4 మి.మీ పరిమాణంలో.. ఇసుక రేణువంత ఉంటుంది. కానీ, శక్తి విషయంలో మాత్రం అత్యంత బలమైంది. ఇంతకాలం చీమ మాత్రమే తన శరీర బరువుకంటే వంద రెట్లు ఎక్కువ బరువును మోయగలదని అనుకున్నాం.
ఇప్పుడు ఇది చీమను మించిన బాహుబలి అని తేలింది. ఇది తన శరీర బరువు కంటే సుమారు 1,180 రెట్ల అధిక బరువును ఎత్తగలదని ఈ మధ్యే శాస్త్రవేత్తలు కనుగొన్నారు. వంద మైక్రోగ్రాముల బరువు మాత్రమే ఉండే ఆర్మర్డ్ మైట్ ప్రపంచంలోనే అత్యంత బలమైన జీవి. ఇతర పురుగులు, కీటకాలు, జంతువుల కంటే ఈ జీవి ఇంత బలంగా ఉండటానికి ప్రధాన కార ణాలలో ఒకటి వాటి ఎక్సోస్కెలిటన్.
ఇది ఎముక కంటే తేలికగా.. బలంగా ఉంటూ కండరాలకు ఎక్కువ శక్తిని అందిస్తుంది. శరీర ఉపరితల వైశాల్యం పెద్దగా ఉండటం వల్ల కూడా అది అంతంత బరువులు ఎత్తగలుగుతోందని చెప్తున్నారు శాస్త్రవేత్తలు. కేవలం అడవుల్లో మాత్రమే.. అరుదుగా కనిపించే ఈ ఆర్మర్డ్ మైట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment