
ఫ్యాషన్ షోలో ర్యాంప్ వాక్ చేసే మోడల్స్‌ను అనుకరిస్తూ ఓ వ్యక్తి వినూత్న వీడియోను షూట్ చేశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. మోడల్స్ ధరించిన దుస్తులను చిత్రీకరించడానికి అతను ఉపయోగించిన పరికరాలు నెటిజన్లను కేకలు పెట్టిస్తున్నాయి.
దీనికి సంబంధించిన వీడియోను డాక్టర్ అజయిత అనే ట్విట్టర్ యూజర్ తన ప్రొఫైల్ పోస్టు చేశారు. ఈ వీడియోకు ‘ఈ రోజుల్లో చాలా ఫ్యాషన్ షోలు’ అనే క్యాప్షన్ పెట్టారు. కాగా, ఈ వీడియోలో ‘మోడల్’ షహీల్ షెర్మాంట్ ఫ్లెయిర్.. ఫ్యాషన్ షోలో ఉపయోగించే ఫ్యాన్సీ దుస్తులకు బదులుగా ఇంట్లో వాడుకునే వస్తువులను ఎంచుకున్నాడు. ఆ వస్తువులను పట్టుకుని ర్యాంప్ వాక్‌ను అనుకరిస్తూ కనిపించాడు. ఆ వస్తువుల్లో వాకర్, స్కర్ట్, అల్యూమినియం నిచ్చెన, ఓ అమ్మాయి, రేకును ఉపయోగించాడు.
ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలవడంలో నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఇది ఫ్యాషన్ షోనా లేక ఇంట్లో దోపిడీ చేస్తున్నాడా అంటూ స్పందించారు. మరో నెటిజన్.. ‘అది పారిస్ లేక మిలన్’ అంటూ కామెంట్స్ చేశాడు.
That third one got me reeling 😂😂😂 https://t.co/FupJhEuRaK
— Black Dynamite (@jamesrautta) June 29, 2022
ఇది కూడా చదవండి: విమానంలోంచి గుట్టలు గుట్టలుగా చేపలు...