Ukrainian Soldier Proposes to Girlfriend at Military Checkpoint Video Viral - Sakshi
Sakshi News home page

యుద్దం ఎఫెక్ట్‌.. దేశం వీడుతున్న ప్రేయసి‌.. లవ్‌ ప్రపోజ్‌ చేసిన ఉక్రెయిన్‌ సైనికుడు.. వీడియో వైరల్‌

Published Wed, Mar 9 2022 6:24 PM | Last Updated on Wed, Mar 9 2022 6:54 PM

Ukrainian Soldier Proposes To Girlfriend At Military Checkpoint - Sakshi

కీవ్‌: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కారణంగా ఆ దేశ ప్రజలు జీవన విధానం అ‍స్తవ్యస్తమైపోయింది. బాంబు దాడులకు నివాస సముదాయాలు కూలిపోయాయి. చాలా మంది ఉక్రేనియన్లు వీధిన పడ్డారు. ఉక్రెయిన్‌లో హృదయ విదారక ఘటనలు పలువురికి కంట తడి పెట్టిస్తున్నాయి. రష్యా దాడుల నేపథ‍్యంలో పలువురు ఉక్రెయిన్‌ ప్రజలు ఆ దేశం నుండి ఇతర దేశాలకు తరలిపోతున్నారు. ఈ క్రమంలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. యుద్దం కారణంగా ఉక్రెయిన్‌కు వీడిపోతున్న తన ప్రేయసికి లవ్‌ ప్రపోజ్‌ చేశాడు ఉక్రెయిన్‌ సైనికుడు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. లవ్‌ ప్రపోజ్‌ చేసిన తీరు చూసి నెటిజన్లు ఫన్నీగా, ఎమోషనల్‌గా కామెంట్స్‌ చేస్తున్నారు. 

ఇంతకీ ఎలా జరిగిందంటే.. ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ సమీపంలోని ఫాస్టివ్ చెక్‌పోస్ట్‌ నగరాన్ని వీడుతున్న ప్రజలను ఆ దేశ సైనికులు తనిఖీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక కారులో ప్రయాణిస్తున్న కొందరు వ్యక్తులను సైనికులు ఆపి.. వారి కారును, పత్రాలను పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా ఆ కారులో ప్రయాణిస్తున్న వారిలో తన ప్రియురాలు ఉన్నట్లు ఒక సైనికుడు గమనించాడు. తనిఖీ చేస్తుండగా వెనక్కి నిలుచుని ఉన్న ఆమె వద్దకు వెళ్లి మోకాలిపై కూర్చొని ఒక చేతిలో ఉంగరం, మరో చేతిలో పుష్ఫగుచ్చంతో పెళ్లి ప్రపోజల్‌ను ఆమె ముందుంచాడు. సడెన్‌గా ఇలా ప్రియుడిని చూసిన ఆనందంలో ఆమె ఒక్కసారిగా సర్‌ప్రైజ్‌ అయ్యింది.  క్షణాల వ్యవధిలో ఆమె.. అతడిని హగ్‌ చేసుకొని తాను పెళ్లి రెడీ అన్న సంకేతంతో ముద్దుపెట్టింది. అనంతరం అతడు ఉంగరాన్ని ఆమె వేలికి తొడిగాడు. ఆ సమయంలో అక్కడున్న మిగతా సైనికులు, ఇతరులు ఆ జంటకు అభినందనలు తెలిపారు.

కాగా, 14 రోజులుగా బాంబు దాడులతో దద్దరిల్లుతున్న ఉక్రెయిన్‌లో ఇలాంటి ఓ ఘటన చోటుచేసుకోవడం అందరినీ ఆనందపరిచింది. ఈ సందర్బంగా ఈ జంటకు అంతా మంచే జరగాలంటూ సోషల్‌ మీడియాలో నెటిజన్లు కోరుకుంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement