ఆ హీరోయిన్ ఇప్పుడు ఏం చేస్తోంది? | Katrina kaif trending in social media after photoshoot | Sakshi
Sakshi News home page

ఆ హీరోయిన్ ఇప్పుడు ఏం చేస్తోంది?

Published Mon, Nov 28 2016 8:40 AM | Last Updated on Tue, Sep 3 2019 8:44 PM

ఆ హీరోయిన్ ఇప్పుడు ఏం చేస్తోంది? - Sakshi

ఆ హీరోయిన్ ఇప్పుడు ఏం చేస్తోంది?

కత్రినా కైఫ్ సినిమాలు హిట్ అయి చాలా కాలమైంది. ఆమె ఇంతకుముందు నటించిన మూడు సినిమాలు ఫాంటమ్, ఫితూర్, బార్ బార్ దేఖో.. మూడూ బాక్సాఫీసు వద్ద ఫట్టయ్యాయి. తర్వాత ప్రస్తుతం తన మాజీ బోయ్‌ఫ్రెండు రణబీర్ కపూర్‌తో కలిసి జగ్గా జాసూస్ అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా విడుదలకు కూడా ఇంకా చాలా సమయం ఉంది. ఇప్పటి లెక్కప్రకారం అయితే ఏప్రిల్ 7వ తేదీన ఆ సినిమా విడుదల కావాల్సి ఉంది. అయితే.. ఈలోపు ఖాళీగా ఉండం ఎందుకని రకరకాల ఫొటోషూట్లు చేస్తోంది క్యాట్. 
 
అందులో భాగంగా సెలబ్రిటీ డిజైనర్ మనీష్ మల్హోత్రాతో కలిసి మాల్దీవులకు వెళ్లింది. అక్కడ ఓ ఫ్యాషన్ మ్యాగజైన్ వాళ్ల బ్రైడల్ ఎడిషన్ కోసం ఫొటోషూట్‌లో పాల్గొంటోంది. అక్కడ వీళ్లిద్దరూ కలిసి దిగుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండవుతున్నాయి. మరి కత్రినా ఫొటో షూట్ అంటే మామూలుగా ఉండదు కదా మరి.. నల్లటి బికినీ వేసుకుని, దానిపైన పసుపు రంగు కేప్ ధరించిన కత్రినా.. చక్కగా మనీష్ ఒళ్లో కూర్చుని మరీ ఓ ఫొటో తీయించుకుంది. ఆ ఫొటోను మనీష్ మల్హోత్రా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి, దానికి 'పోజర్స్ ఇన్ మాల్దీవ్స్' అనే క్యాప్షన్ పెట్టాడు. అంతేకాదు.. కత్రినా, మిగిలిన టీం అంతా ఉంది కదా అని తన బర్త్‌డే కూడా అక్కడే చేసేసుకున్నాడు. ఇక కత్రినా కూడా మరో్ తెల్లటి దుస్తులతో కూడిన తన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. అప్పటి నుంచి వీళ్లిద్దరూ తెగ ట్రెండవుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement