సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే భారత్ హిందూ పాకిస్తాన్‌గా తయారవుతుందని మాజీ కేంద్ర మంత్రి శశి థరూర్ చేసిన వ్యాఖ్యలనపై బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి స్పందించారు. శశిథరూర్‌కు మతిభ్రమించినట్టుగా ఉందని, ఆయనకు తక్షణం వైద్య సాయం అందించాలని ప్రధాని నరేంద్ర మోదీకి సుబ్రహ్మణ్య స్వామి గురువారం సూచించారు.
అవసరమైతే శశిథరూర్‌ను చికిత్స నిమిత్తం మెంటల్ ఆస్పత్రికి తరలించాలని అన్నారు. థరూర్ వ్యాఖ్యలు ఆయన అసహనానికి అద్దం పడుతున్నాయని, పాక్‌పై అసలు ఆయనకు అంత ప్రేమ ఎందుకు అని ప్రశ్నించారు. ప్రధాని నరేంద్ర మోదీని అధికారం నుంచి తొలగించేందుకు సాయపడాలని పాక్ ప్రధానిని సైతం ఆయన కోరారన్నారు.
శశిథరూర్‌కు పాకిస్తానీ గర్ల్‌ఫ్రెండ్స్ ఉన్నారని వారంతా ఐఎస్‌ఐ మనుషులని వ్యాఖ్యానించారు. థరూర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ తన వైఖరి వెల్లడించాలని డిమాండ్ చేశారు. మరోవైపు థరూర్ హిందూ పాకిస్తాన్ వ్యాఖ్యలను కేంద్ర మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోర్ సైతం తప్పుపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment