subrahmanyam swamy
-
‘ఆయనకు పాకిస్తానీ గర్ల్‌ఫ్రెండ్స్ ఉన్నారు’
సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే భారత్ హిందూ పాకిస్తాన్‌గా తయారవుతుందని మాజీ కేంద్ర మంత్రి శశి థరూర్ చేసిన వ్యాఖ్యలనపై బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి స్పందించారు. శశిథరూర్‌కు మతిభ్రమించినట్టుగా ఉందని, ఆయనకు తక్షణం వైద్య సాయం అందించాలని ప్రధాని నరేంద్ర మోదీకి సుబ్రహ్మణ్య స్వామి గురువారం సూచించారు. అవసరమైతే శశిథరూర్‌ను చికిత్స నిమిత్తం మెంటల్ ఆస్పత్రికి తరలించాలని అన్నారు. థరూర్ వ్యాఖ్యలు ఆయన అసహనానికి అద్దం పడుతున్నాయని, పాక్‌పై అసలు ఆయనకు అంత ప్రేమ ఎందుకు అని ప్రశ్నించారు. ప్రధాని నరేంద్ర మోదీని అధికారం నుంచి తొలగించేందుకు సాయపడాలని పాక్ ప్రధానిని సైతం ఆయన కోరారన్నారు. శశిథరూర్‌కు పాకిస్తానీ గర్ల్‌ఫ్రెండ్స్ ఉన్నారని వారంతా ఐఎస్ఐ మనుషులని వ్యాఖ్యానించారు. థరూర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ తన వైఖరి వెల్లడించాలని డిమాండ్ చేశారు. మరోవైపు థరూర్ హిందూ పాకిస్తాన్ వ్యాఖ్యలను కేంద్ర మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోర్ సైతం తప్పుపట్టారు. -
'అయోధ్యలో రామమందిరాన్ని నిర్మించండి'
న్యూఢిల్లీ: అయోధ్యలో రామమందిర నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వీహెచ్‌పీ సీనియర్ నేత అశోక్ సింఘాల్, బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి కోరారు. మందిర నిర్మాణానికి న్యాయపరమైన అడ్డంకులపై చర్చించేందుకు వచ్చే జనవరిలో జాతీయ సదస్సు ఏర్పాటు చేస్తామని తెలిపారు. బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో రామమందిరం నిర్మిస్తామని హామీ ఇచ్చిందని అశోక్ సింఘాల్, సుబ్రహ్మణ్యస్వామి గుర్తు చేశారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల తర్వాతైనా కేంద్ర ప్రభుత్వం తన వైఖరి ప్రకటించాలని కోరారు. లేదంటే తమ కార్యాచరణను ప్రకటిస్తామని చెప్పారు. -
'చిదంబరాన్ని నిందితుడిగా చేర్చాల్సిందే'
న్యూఢిల్లీ: ఎయిర్‌సెల్ - మ్యాక్సిస్ కేసుపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) నివేదికను కోర్టుకు సమర్పించింది. కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరంను నిందితుడిగా చేర్చాలంటూ బీజేపీ సీనియర్ నేత బ్రహ్మణ్యస్వామి పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించిన విచారణ ఈనెల 23న చేపట్టనున్నట్టు సమాచారం.