'అయోధ్యలో రామమందిరాన్ని నిర్మించండి' | Rammandir in ayodya should be built, says ashok singhal | Sakshi
Sakshi News home page

'అయోధ్యలో రామమందిరాన్ని నిర్మించండి'

Published Wed, Sep 30 2015 4:53 PM | Last Updated on Sun, Sep 3 2017 10:15 AM

'అయోధ్యలో రామమందిరాన్ని నిర్మించండి'

'అయోధ్యలో రామమందిరాన్ని నిర్మించండి'

న్యూఢిల్లీ: అయోధ్యలో రామమందిర నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వీహెచ్పీ సీనియర్ నేత అశోక్ సింఘాల్, బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి కోరారు. మందిర నిర్మాణానికి న్యాయపరమైన అడ్డంకులపై చర్చించేందుకు వచ్చే జనవరిలో జాతీయ సదస్సు ఏర్పాటు చేస్తామని తెలిపారు.

బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో రామమందిరం నిర్మిస్తామని హామీ ఇచ్చిందని అశోక్ సింఘాల్, సుబ్రహ్మణ్యస్వామి గుర్తు చేశారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల తర్వాతైనా కేంద్ర ప్రభుత్వం తన వైఖరి ప్రకటించాలని కోరారు. లేదంటే తమ కార్యాచరణను ప్రకటిస్తామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement