అయోధ్య దీపోత్సవం.. రెండు గిన్నిస్ వరల్డ్ రికార్డులు | Ayodhya Deepotsav first after Ram temple consecration record in sight updates | Sakshi
Sakshi News home page

అయోధ్య దీపోత్సవం.. రెండు గిన్నిస్ వరల్డ్ రికార్డులు

Published Wed, Oct 30 2024 6:32 PM | Last Updated on Wed, Oct 30 2024 8:17 PM

Ayodhya Deepotsav first after Ram temple consecration record in sight updates

లక్నో: అయోధ్యలో అట్టహాసంగా నిర్వహించిన దీపోత్సవ వేడుక బాల రాముడి సాక్షిగా రెండు గిన్నిస్ ప్రపంచ రికార్డులను సొంతం చేసుకుంది. సరయూ నది తీరంలో అధిక సంఖ్యలో భక్తులు ఏకకాలంలో దీపాలతో హారతి ప్రదర్శించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించారు. 

అదేవిధంగా ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం, టూరిజం డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో 25,12,585 దీపాలను భక్తులు వెలిగించి రికార్టు సృష్టించారు. అతిపెద్ద నూనె దీపాల ప్రదర్శనకు గాను మరో గిన్నిస్ వరల్డ్ రికార్టును అయోధ్య దీపోత్సవం సాధించింది. గిన్నిస్‌ ధ్రువీకరణ పత్రాలు  ఉత్తర్‌ప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ అందుకున్నారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ కన్సల్టెంట్ నిశ్చల్ బరోట్ నేతృత్వంలోని 30 మంది బృందం 55 ఘాట్‌లలో డ్రోన్‌లను ఉపయోగించి దీపాలను లెక్కించింది. 

 

 

ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో సరయూ నది తీరాన దీపోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించారు.  లక్షల దీపాలతో సరయూ తీరం దేదీప్యమానంగా వెలుగుతోంది. ఈ కార్యక్రమానికి సీఎం యోగి ఆదిత్యానాథ్‌ హాజరై ప్రత్యేక పూజలు చేశారు.  25 లక్షలకు పైగా దీపాలు వెలిగించారు.

  
 

గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లక్ష్యంతో అధికారులు స్థానిక చేతివృత్తుల వారి నుంచి 28 లక్షల దీపాలు ఆర్డర్ చేశారు. ఈ వేడుక నేపథ్యంలో ప్రజల భద్రత కోసం అయోధ్య  నగరం అంతటా సుమారు 10,000 మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. అందులో సగం మంది సాధారణ దుస్తులలో ఉన్నారు.
 

పదో నంబర్‌ ఘాట్ వద్ద కార్యక్రమానికి  శుభసూచకంగా స్వస్తిక్‌ రూపంలో  సుమారు 80 వేల దీపాలను పెట్టారు. ఘాట్ల వద్ద 5 వేల నుంచి 6 వేల మంది అతిథులు బస చేసేందుకు ఏర్పాటుపూర్తి చేసినట్లు దీపోత్సవ్ నోడల్ అధికారి సంత్ శరణ్ మిశ్రా తెలిపారు. కార్యక్రమానికి  హాజరుకాలేని వారి కోసం నలభై జంబో ఎల్‌ఈడీ స్క్రీన్‌ల ద్వారా ప్రత్యక్ష ప్రసారాన్ని ప్రసారం చేశారు.

 

ఈ వేడుకలో మయన్మార్, నేపాల్, థాయిలాండ్, మలేషియా, కంబోడియా, ఇండోనేషియా వంటి ఆరు దేశాలకు చెందిన కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు,  లేజర్‌ షో  ఆకట్టుకుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement