చిత్రదుర్గ: అయోధ్య రామమందిర ప్రారంభ వేడుకలు మొదలైన వేళ రాజకీయపార్టీలు ఈ విషయంలో విమర్శలకు తెర తీశాయి. బీజేపీ రామమందిర పప్రారంభోత్సవాన్ని రానున్న పార్లమెంట్ ఎన్నికల కోసం వాడుకుంటోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. కర్ణాటక ప్లానింగ్, స్టాటిస్టిక్స్ మంత్రి దశరథయ్య సుధాకర్ ఇదే విషయమై బీజేపీపై విరుచుకుపడ్డారు.
‘గత ఎన్నికల సమయంలో బీజేపీ పుల్వామాలో సైనికులపై జరిగిన దాడిని వాడుకుని ఓట్లు కొల్లగొట్టింది. ఇప్పుడు ఇదే తరహాలో రామ మందిర ఓపెనింగ్‌పై ఇదే వ్యూహాన్ని అవలంబిస్తోంది. రాముడు అందరి దేవుడు.
బీజేపీ దేశంలో మత విశ్వాసాలను వాడుకొని ఓట్లు కొల్లగొట్టాలనుకుంటోంది. రామ మందిర ఓపెనింగ్ ఒక ఎన్నికల స్టంట్. నేను కూడా మందిర నిర్మాణానికి విరాళంతో పాటు ఇటుకలు అందించా’ అని చిత్రదుర్గలో సుధాకర్ మీడియాతో అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment