sasi tharoor
-
శశి థరూర్ ఒడిలో వానరం..ఫొటోలు వైరల్
తన నివాసంలో సేద తీరుతున్న కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్‌ను అనుకోని అధితి రూపంలో ఓ వానరం ఆయన్ను చుట్టుముట్టింది.పేపర్ చదువుతున్న శశి థరూర్ చుట్టూ తిరుగుతూ తెగ అల్లరి చేసింది. ఆ ఘటనకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు కాంగ్రెస్ సోషల్ మీడియా నెట్‌వర్క్‌లలో తెగ చక్కెర్లు కొడుతున్నాయి.ఇంతకి ఏం జరిగిందంటే?శశిథరూర్.. బుధవారం ఉదయం తన ఇంటి ఆవరణంలో పేపర్ చదువుతున్నారు. ఆ సమయంలో ఓ వానరం ఆయన దగ్గరకు వచ్చింది. పేపర్ చదువుతున్న శశి థరూర్ చుట్టూ తిరిగింది. అనంతరం థరూర్‌లో ఒడిలోకి కూర్చుంది.Had an extraordinary experience today. While i was sitting in the garden, reading my morning newspapers, a monkey wandered in, headed straight for me and parked himself on my lap. He hungrily ate a couple of bananas we offered him, hugged me and proceeded to rest his head on my… pic.twitter.com/MdEk2sGFRn— Shashi Tharoor (@ShashiTharoor) December 4, 2024 -
‘24 గంటల్లో శశిథరూర్ నాకు క్షమాపణ చెప్పాల్సిందే’
తిరువనంతపురం : లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కేరళ రాజకీయం వేడెక్కుతుంది. తిరువనంతపురం లోక్‌సభ బీజేపీ అభ్యర్ధి రాజీవ్ చంద్రశేఖర్.. అదే స్థానం నుంచి బరిలోకి దిగుతున్న కాంగ్రెస్ సీనియర్ నేత, లోక్‌సభ అభ్యర్ధి శశిథరూర్‌కు లీగల్ నోటీసులు పంపారు. శశిథరూర్ తనకు భేషరుతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే చట్టపర్యమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కేరళకు మలయాళ మీడియా సంస్థ న్యూస్24 ఇంటర్వ్యూలో శశిథరూర్.. రాజీవ్ చంద్రశేఖర్ గురించి మాట్లాడారు. ఏప్రిల్ 6న సదరు టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో రాజీవ్ చంద్రశేఖర్ ఓటర్లను, ఓ వర్గానికి చెందిన మత పెద్దలకు డబ్బులు ఇచ్చి ప్రలోభాలకు గురిచేస్తున్నారనే వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై రాజీవ్ చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన తరుపున లాయర్ ద్వారా శశిథరూర్‌కు లీగల్ నోటీసులు అందించారు. నేనే షాకయ్యా తిరువనంతపురం లోక్‌సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్ధి తన గురించి అసత్య ప్రచారం చేస్తున్నారని, ఓటర్లకు డబ్బులిస్తూ ప్రలోభ పెడుతున్నారంటూ నిరాధారమైన ఆరోపణలు చేశారు. ఆ వ్యాఖ్యలు నన్ను షాక్‌కి గురి చేశాయని ఆ నోటీసుల్లో రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. క్షమాపణలు చెప్తారా? లేదంటే ఈ నోటీసులు ఇచ్చిన 24 గంటల్లోపు శశిథరూర్ చేసిన వ్యాఖ్యల్ని తిరిగి వెనక్కి తీసుకోవాలని, ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా ముఖంగా క్షమాపణలు చెప్పాలని అన్నారు. అంతేకాదు తనకు, ఓటర్లకు, ఓ కమ్యూనిటీని కించపరిచినందుకు ఆ వర్గానికి చెందిన ప్రజలకు, మత పెద్దలకు బహిరంగంగా క్షమాణలు చెప్పాలని హెచ్చరించారు. లేని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని శశిథరూర్‌కు ఇచ్చిన నోటీసుల్లో పేర్కొన్నారు. రాజకీయంగా లబ్ధి పొందాలనే రానున్న లోక్‌సభ ఎన్నికల్లో లబ్ధి పొందేలా దుర్మార్గపు ఉద్దేశ్యంతో తన క్లయింట్ రాజీవ్ చంద్రశేఖర్ పరువుకు నష్టం వాటిల్లేలా అసత్యప్రచారం చేశారు. తద్వారా ఓటర్లను ప్రభావితం చేసేలా వ్యవహరిస్తున్నారని, శశిథరూర్ క్షమాపణలు చెప్పాలని రాజీవ్ చంద్రశేఖర్ తరుపు న్యాయవాది శశిథరూర్‌కు పంపిన నోటీసుల్లో కీలక వ్యాఖ్యలు చేశారు. -
‘ఈ ఎన్నికల్లో గెలుపు నాదే’.. శశి థరూర్ ‘ఇంగ్లీష్’పై కేంద్రమంత్రి సెటైర్లు
సాక్షి, తిరువనంతపురం : ఈ సారి జరిగే లోక్‌సభ ఎన్నికలు..‘పాలిటిక్స్ ఆఫ్ ఫర్మామెన్స్..15 ఇయర్స్ ఆఫ్ నాన్ - పర్మార్మెన్స్’ మధ్య జరుగుతున్నాయంటూ కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి తిరువనంతపురం బీజేపీ లోక్‌సభ అభ్యర్ధి చంద్రశేఖర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తొలిసారి లోక్‌సభకు పోటీ చేస్తున్న చంద్రశేఖర్ ఎన్నికలపై మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తన ప్రత్యర్ధి, తిరువనంతపురం సిట్టింగ్ ఎంపీ కాంగ్రెస్ నేత శశి థరూర్‌పై విరుచుకు పడ్డారు. ఈ ఎన్నికలు ‘పనితీరు రాజకీయాలకు..15 సంవత్సరాల పనితీరు లేని రాజకీయాల మధ్య జరుగుతున్నాయని అన్నారు. ఈ సందర్భంగా శశిథరూర్ ఇంగ్లీష్ వాక్చాతుర్యంపై సెటైర్లు వేశారు. ‘ఇది థరూర్, ఎన్డీఏల మధ్య జరిగే పోరాటం కాదు. ఇది కొంత వ్యక్తిత్వానికి సంబంధించినదని నేను అనుకోను. ఇంగ్లీష్ మాట్లాడే నైపుణ్యం గురించి లేదా మరేదైనా అని నేను అనుకోను. ప్రజలే డిసైడ్ చేస్తారు. ఈ ఎన్నికలు గెలుపు కూడా నాదేనంటూ.. ‘‘తిరువనంతపురం ప్రజలకు దీని గురించి బాగా తెలుసు. నేనుకూడా అదే నమ్ముతున్నాను. ఆ ఫలితం ఎన్నికల జయాపజయాల్ని నిర్ధేశించేలా ఉంటుంది. ఈ ఎన్నికల పోరు వ్యక్తుల మధ్య పోరుగా భావించడం లేదు. ఈ ఎన్నికలు గత 10ఏళ్లలో జరిగిన అభివృద్ది రాబోయే ఐదేళ్లలో కొనసాగించడమే’ అని పునరుద్ఘాటించారు. నో విజన్ ఈ సందర్భంగా ప్రతిపక్షాలకు విజన్ లేదని చంద్రశేఖర్ ఆరోపించారు. ప్రతిపక్షం అంటే ‘అవినీతికి పాల్పడే రాజకీయ నాయకులు నరేంద్ర మోదీని ఓడించాలనే ఒకే ఒక్క లక్ష్యంతో కలిసి రావడమే’ అని వ్యాఖ్యానించారు. నా నియోజకవర్గ ప్రజలకు నేను ఎక్కడి వాడినో ఎన్నికల ఫలితాలు వచ్చాక తేలిపోతుందన్నారు. ఆ విషయం నేను చెప్పనవసరం లేదు. (మీడియాను ఉద్దేశిస్తూ) మీరు చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజలకు ఇది ఖచ్చితంగా తెలుసు’ అని చంద్రశేఖర్ అన్నారు. తొలిసారి లోక్‌సభ ఎన్నికల బరిలో కేంద్ర ఐటీశాఖ సహాయ మంత్రి, ప్రస్తుత రాజ్యసభ సభ్యుడిగా ఉన్న రాజీవ్ చంద్రశేఖర్‌ని తొలిసారి కేరళ రాజధాని తిరువనంతపురం లోకసభ స్థానం నుంచి బరిలోకి దించింది. ఇదే స్థానం నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ వరుసగా మూడు సార్లు ఎంపీగా విజయం సాధించారు. -
శశిథరూర్ ప్రత్యర్ధి ఎవరంటే?
తిరువనంతపురం : రానున్న లోక్‌సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ 39 మంది అభ్యర్ధులతో తన తొలి జాబితాను విడుదల చేసింది. 39 మందిలో కేరళ కాంగ్రెస్ నేత శశి థరూర్ తన సొంత నియోజకవర్గం తిరువనంతపురం నుండి పోటీ చేయబోతున్నారు.థరూర్ అదే నియోజకవర్గం నుండి ప్రస్తుతం మూడవసారి పార్లమెంటు సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. 2009లో తొలిసారి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందిన థరూర్ గతంలో కాంగ్రెస్ హయాంలో మానవ వనరుల అభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా, విదేశాంగ శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. ఇక రానున్న ఎన్నికల్లో శశి థరూర్ ప్రత్యర్థి కేంద్ర సమాచార సాంకేతిక శాఖ సహాయ మంత్రి - రాజీవ్ చంద్రశేఖర్. మూడుసార్లు రాజ్య సభ్యుడిగా బాధ్యతలు నిర్వహించన ఆయన తొలిసారి లోక్‌సభకు పోటీ చేయనున్నారు. -
కంచుకోటలో కాంగ్రెస్ ‘కథ’ కంచికేనా?
సాక్షి, తిరువనంతపురం : 2024 ఏడాదిని అన్ని ప్రధాన రాజకీయ పార్టీలూ పొలిటికల్ ఇయర్‌గానే భావిస్తున్నాయి. దేశ నేతలు, ప్రజలందరి దృష్టి రాబోయే లోక్‌సభ సమరంపైనే ఉంది. 2023లో 5 రాష్ట్రాల ఎన్నికల తంతు ముగియగా ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో బీజేపీ భారీ విజయం సాధించి రాష్ట్రాలను తన ఖాతాలో వేసుకుంది. ఇప్పుడు రాబోయే లోక్‌సభ ఎన్నికలపైనే ఫుల్ ఫోకస్ పెట్టింది. దక్షిణాదిలోనూ అత్యధిక స్థానాల్లో గెలిచి వరుసగా మూడోసారి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తోంది కాషాయ పార్టీ. అందుకు తగ్గట్లుగానే వ్యూహరచన చేస్తోంది. ఇందులో భాగంగా వామపక్ష భావజాలం ఉన్న కేరళపై గురిపెట్టింది. దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఎంపీ, ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీ.. కేరళలో మాత్రం ఒక్కరు కూడా విజయం సాధించలేదు. అయితే, కాంగ్రెస్ లోక్‌సభ స్థానానికి కంచుకోటగా ఉన్న తిరువనంతపురాన్ని బద్దలు కొట్టాలని చూస్తోంది. రాజకీయ చైతన్యం కలిగిన కేరళలో బీజేపీ గెలిచి.. దక్షిణాదిలో తమకు తిరుగు లేదని నిరూపించాలని యోచిస్తోంది. గెలపుపై కాషాయం నేతల ధీమా తాజాగా ప్రకటించిన బీజేపీ లోక్‌సభ అభ్యర్ధుల జాబితాలో తిరువనంతపురం సీటును కేంద్ర మంత్రికి కేటాయించింది. ఒక్క ఎంపీ, ఎమ్మెల్యే లేని కేరళలో కూడా తామే గెలుస్తామని కాషాయం నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. శశి థరూర్‌పై కేంద్ర మంత్రి.. కాబట్టే కేంద్ర ఐటీశాఖ సహాయ మంత్రి, ప్రస్తుత రాజ్యసభ సభ్యుడిగా ఉన్న రాజీవ్ చంద్రశేఖర్‌ని తొలిసారి కేరళ రాజధాని తిరువనంతపురం లోకసభ స్థానం నుంచి బరిలోకి దించింది. ఇదే స్థానం నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ వరుసగా మూడు సార్లు ఎంపీగా విజయం సాధించారు. రాజీవ్ చంద్రశేఖర్ లోక్‌సభ స్థానం పోటీ చేయడం ఇదే తొలిసారి. గెలుపు గుర్రాలపై ఆసక్తి.. ఇక తిరువనంతపురం లోక్‌సభ గెలుపు గుర్రాలపై అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఈ ఏడాది జనవరిలో కేరళ బీజేపీ సీనియర్ నేత ఒ.రాజగోపాల్ కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. తిరువనంతపురంలో కాంగ్రెస్ నేత శశిథరూర్ని ఓడించడం కష్టమని అన్నారు. అందుకే థరూర్ తిరువనంతపురం నుండి పదే పదే గెలుస్తున్నారు. భవిష్యత్తులో అదే స్థానంలో శశిథరూర్ కాకుండా మరో నాయకుడు గెలిచే అవకాశం ఉందని జోస్యం చెప్పారు. టార్గెట్ దక్షిణాది లోక్‌సభ ఎన్నికల్లో సొంతంగా 370 సీట్లు గెలుచుకోవాలనే లక్ష్యంతో శ్రమిస్తోంది. 2019లో దేశం మొత్తం 303 లోక్‌సభ స్థానాలు కైవసం చేసుకుని అధికారంలోకి వచ్చిన బీజేపీ అదే ఏడాది దక్షిణాదిలో 129 లోక్‌సభ స్థానాల్లో (పుదుచ్చేరితో కలిపి 130) బీజేపీ కేవలం 29 సీట్లకే పరిమితమైంది. ఈ సారి ఆసంఖ్యను మరింత పెంచేలా దక్షిణాది రాష్ట్రాలపై ఓ కన్నేసింది. ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. కమలం అగ్రనేతల నుంచి ప్రధాని నరేంద్ర మోదీ సైతం వరుస పర్యటనలు చేస్తున్నారు. తమిళనాడు, కేరళ పర్యటనల్లో పలు అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. -
కోహ్లి అసాధారణమైన ప్రతిభకు నిదర్శనమిది
వన్డే ప్రపంచ కప్ 2023 సెమీఫైనల్ వేదికగా విరాట్ కోహ్లి సాధించిన అర్థ శతక సెంచరీ ఫీట్‌పై సర్వత్రా అభినందనలు కురుస్తున్నాయి. క్రీడా అభిమానులతో పాటు క్రీడాయేతర రంగాలకు చెందిన ప్రముఖులు తమ తమ సోషల్ మీడియా ఖాతాల నుంచి కోహ్లికు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. వన్డేల్లో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాడి ఘనత అందుకోవడంపై ప్రధాని నరేంద్ర మోదీ తన ఎక్స్ ఖాతా నుంచి అభినందనలు తెలుపుతూ ఓ సందేశం ఉంచారు. ఇవాళ కోహ్లి 50వ శతకం సాధించడమే కాదు.. అత్యుత్తమ క్రీడాస్ఫూర్తిని నిర్వచించే శ్రేష్టతను, పట్టుదల స్ఫూర్తికి ఉదాహరణగా నిలిచాడు. ఈ అద్భుతమైన మైలురాయి అతని నిరంతర అంకితభావానికి, అసాధారణమైన ప్రతిభకు నిదర్శనం. కోహ్లికి హృదయపూర్వక శుభాకాంక్షలు. భవిష్యత్ తరాలకు బెంచ్‌మార్క్ నెలకొల్పడం కొనసాగిస్తూనే ఉంటాడు.. Today, @imVkohli has not just scored his 50th ODI century but has also exemplified the spirit of excellence and perseverance that defines the best of sportsmanship. This remarkable milestone is a testament to his enduring dedication and exceptional talent. I extend heartfelt… pic.twitter.com/MZKuQsjgsR — Narendra Modi (@narendramodi) November 15, 2023 బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు కోహ్లిని ఎక్స్ వేదికగా అభినందించారు. వెల్డన్ కింగ్‌కోహ్లీ. హాఫ్ సెంచరీ శతకాలు అనే అద్భుతమైన ఫీట్.. అదీ వరల్డ్‌కప్ సెమీఫైనల్లో. టేక్ ఏ బో అంటూ ట్వీట్ చేశారు. Supremely Well done King Kohli @imVkohli 🎉 on Half-century of Centuries 👏 What an amazing feat to achieve and that too in the semi final of the World Cup Take a Bow 🙏 #ViratKohli𓃵 — KTR (@KTRBRS) November 15, 2023 తన సెంచరీల ఫీట్‌ను అధిగమించడంపై కోహ్లిని క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ఎక్స్ వేదికగా అభినందించగా.. కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ ఆ ట్వీట్‌ను రీపోస్ట్ చేసి మరీ కోహ్లిని అభినందించారు. ఒక దిగ్గజం నుంచి స్నేహపూర్వక సందేశం.. నిజంగా అభినందనీయం. మీ ఇద్దరినీ చూస్తుంటే గర్వంగా ఉంది అంటూ కోహ్లి, సచిన్‌ను ఉద్దేశించి పోస్ట్ చేశారాయన. ఆప్ జాతీయకన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందిస్తూ.. వరల్డ్ కప్ సెమీఫైనల్లో చారిత్రక మైలురాయిని అధిగమించిన విరాట్ కోహ్లికి శుభాకాంక్షలు. ఒక నిజమైన దిగ్గజమే రికార్డులను తిరగరాస్తారు. భావితరాలలో స్ఫూర్తిని నింపుతారు అంటూ సందేశం ఉంచారు. Congratulations to Virat Kohli on achieving a historic milestone with his 50th ODI century against New Zealand in the World Cup semifinal. A true legend rewriting records. Keep on inspiring the generations to come. pic.twitter.com/tLaKWv7fNq — Arvind Kejriwal (@ArvindKejriwal) November 15, 2023 -
శశి థరూర్‌పై స్పీకర్‌కు బీజేపీ ఎంపీల ఫిర్యాదు
సాక్షి, న్యూఢిల్లీ : ఫేస్బుక్ వివాదానికి సంబంధించి ఎంపీ శశి థరూర్ ట్వీట్‌పై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియా దిగ్గజం నుంచి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్టాండింగ్ కమిటీ వివరణ కోరనుందని, ఈ కమిటీకి నేతృత్వం వహిస్తున్న శశి థరూర్ తమతో చర్చించకముందే ఫేస్‌బుక్‌కు సమన్లు జారీ చేశారని, బహిరంగ వ్యాఖ్యలు చేశారని బీజేపీ ఎంపీలు స్పీకర్ దృష్టికి తీసుకువచ్చారు. శశి ధరూర్ నిబంధనల ఉల్లంఘనపై తాను స్పీకర్‌కు లేఖ రాశానని, స్టాండింగ్ కమిటీ సభ్యుడు, కేంద్ర మంత్రి రాజ్యవర్ధన్ రాథోడ్ వెల్లడించారు. ఏ సంస్ధ ప్రతినిధినైనా పిలిపించి మాట్లాడేందుకు తాము వ్యతిరేకం కాదని, అయితే ఆయన (శశి థరూర్) తమతో చర్చించకుండా మీడియాతో మాట్లాడారని అభ్యంతరం వ్యక్తం చేశారు. భారత్‌లో ఫేస్బుక్ బీజేపీకి వత్తాసు పలుకుతూ తమ వేదికపై కాషాయ నేతలు విద్వేష ప్రసంగం, సందేశాలు పోస్ట్ చేసేందుకు అనుమతిస్తోందన్న వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనం కలకలం రేపిన సంగతి తెలిసిందే. కాగా, ఫేస్‌బుక్‌ను తమ కమిటీ ఎదుట హాజరు కావాలని ఐటీ స్టాండింగ్ కమిటీ చీఫ్ శశి థరూర్ సమన్లు జారీ చేయడంపై బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే థరూర్‌పై సభా హక్కుల ఉల్లంఘన కింద నోటీసులు ఇచ్చారు. పార్లమెంటరీ విధానాలు, పద్ధతులు పాటించకుండా శశి థరూర్ ఫేస్‌బుక్‌కు నోటీసులు పంపారని దూబే ఆరోపించారు. చదవండి : కోళీకోడ్ ఘటన: ‘మీరు దేశానికే ఆదర్శం’ -
ఆర్టికల్ 370 : పాక్ తీరును ఎండగట్టిన శశిథరూర్
సాక్షి, న్యూఢిల్లీ : జమ్ము కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దుపై పాకిస్తాన్ తీరును కాంగ్రెస్ నేత శశి థరూర్ ఎండగట్టారు. ఈ అంశంపై భారత ప్రభుత్వ ఉద్దేశాన్ని ఏ దేశం ప్రశ్నించలేదని పరోక్షంగా పాకిస్తాన్‌ను ఉద్దేశించి స్పష్టం చేశారు. ఆర్టికల్ 370 రద్దును విపక్షాలుగా తాము ప్రశ్నిస్తామని, ఈ వ్యవహారంలో భారత ప్రభుత్వాన్నీ మరే దేశం ప్రశ్నించలేదని పేర్కొన్నారు. కశ్మీర్ భారత్ అంతర్గత వ్యవహారమని తేల్చిచెప్పారు. ఇక జమ్ము కశ్మీర్ ప్రజలను ప్రభుత్వం అణిచివేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. కశ్మీరీలను వారి కుటుంబ సభ్యులతో మాట్లాడకుండా నియంత్రణలు విధిస్తున్నారని వాపోయారు. పిల్లలు స్కూళ్లకు వెళ్లడం లేదని, కశ్మీరీలపై ఆంక్షలు అప్రజాస్వామికమని పేర్కొన్నారు. -
మోదీకి కేరళలో పోటీ చేసే దమ్ముందా?
న్యూఢిల్లీ: కేరళ లేదా తమిళనాడు నుంచి బరిలోకి దిగి గెలిచే దమ్ము, ధైర్యం ప్రధాని నరేంద్ర మోదీకి ఉన్నాయా అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శశిథరూర్ ప్రశ్నించారు. ఉత్తరప్రదేశ్‌లోని అమేథీతోపాటు కేరళలోని వయనాడ్‌లో పోటీచేస్తున్న రాహుల్ గాంధీపై మోదీ విమర్శల నేపథ్యంలో థరూర్ స్పందించారు. అమేథీలో ఓడిపోతాడనే రాహుల్ వయనాడ్‌లో పోటీచేస్తున్నారనే మోదీ మాటలు.. ప్రధాని స్తాయి వ్యక్తి చేయడం బాధాకరమని థరూర్ అన్నారు. రాహుల్ వయనాడ్ నుంచి పోటీ చేస్తుండటంపై దేశానికి కాబోయే ప్రధాని ఇక్కడ నుంచి ఎంపికవుతారా అని దక్షిణాది రాష్ట్రాల్లో చర్చ జరుగుతోందని అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వ వైఖరి వల్ల దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రంతో ఉన్న సత్సంబంధాలు దెబ్బతిన్నాయని తెలిపారు. వీటిని మరింత బలపరిచేందుకే రాహుల్ దక్షిణాది నుంచి పోటీచేస్తున్నట్లు స్పష్టం చేశారు. -
21న సునందా పుష్కర్ హత్య కేసు విచారణ
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర మంత్రి శశి థరూర్ భార్య సునందా పుష్కర్ హత్య కేసును ఢిల్లీలోని సెషన్స్ కోర్టు ఈనెల 21న విచారించనుంది. సునందా పుష్కర్ హత్య కేసులో ఆమె భర్త శశి థరూర్ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. సునందా పుష్కర్ కేసును అంతకుముందు అదనపు చీఫ్ మెట్రపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు సెషన్స్ కోర్టుకు బదలాయించింది. కాగా,ఈ కేసులో విజిలెన్స్ నివేదికను పదిలపరచాలని ఢిల్లీ పోలీసులను సెషన్స్ కోర్టు ఆదేశించింది. కాగా, ఈ కేసులో న్యాయస్ధానానికి సహకరించేందుకు అనుమతించాలని బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి అప్పీల్‌ను కోర్టు తోసిపుచ్చింది. కాగా సునంద పుష్కర్ కేసును దర్యాప్తు చేసిన సిట్ శశిథరూర్‌పై హత్యారోపణలు చేయలేదు. భార్య సునందా పుష్కర్‌ను శశిథరూర్ నిత్యం వేధింపులకు గురిచేయడం ఆమె మరణానికి దారితీసిందని చార్జ్‌షీట్‌లో సిట్ పేర్కొంది. -
ప్రధాని పదవికి రాహుల్ అర్హుడే..
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీకి ప్రధాని అయ్యే అర్హతలన్నీ ఉన్నాయని సీనియర్ కాంగ్రెస్ నేత శశి థరూర్ అన్నారు. దేశవ్యాప్తంగా విస్తరించిన కాంగ్రెస్ పార్టీయే జాతీయ స్ధాయిలో ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీగా ఇటీవల ముగిసిన అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో స్పష్టమైందని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ లేని జాతీయ కూటమిని ఊహించలేమన్నారు. రాహుల్ గాంధీ తమ నేతని, కాంగ్రెస్ రానున్న లోక్‌సభ ఎన్నికల్లో తగిన మెజారిటీ సాధిస్తే రాహుల్ గాంధీయే తదుపరి ప్రధాని అవుతారని స్పష్టం చేశారు. సంకీర్ణ ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి అయితే, భాగస్వామ్య పక్షాలతో సంప్రదింపుల అనంతరం ఏకాభిప్రాయం సాధించిన అభ్యర్థి వైపు కూటమి మొగ్గుచూపుతుందని పేర్కొన్నారు. సంకీర్ణ విస్తృత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పీఎం అభ్యర్థి ఎంపిక జరుగుతుందని చెప్పారు. ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాతే దీనిపై సంప్రదింపులు జరుగుతాయని వెల్లడించారు. రాహుల్‌కు ఉన్న నైపుణ్యాలు, అర్హతల దృష్ట్యా ఆయన ప్రధాని పదవికి అన్ని విధాలా అర్హుడని స్పష్టం చేశారు. రాహుల్‌లో అందరినీ కలుపుకుపోయే గుణంతో పాటు భిన్న రాజకీయ విధానాలున్న నేతల వద్దకూ వెళ్లగలిగే చొరవ ఆయనకుందని ప్రశంసించారు. -
ఆ నేతకు సల్మాన్ మూవీలో ఆఫర్..
సాక్షి, న్యూఢిల్లీ : బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ మూవీలో తనకు ఓ పాత్రను ఆఫర్ చేశారని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ వెల్లడించారు. సోషల్ మీడియా స్టార్ జానిస్ సీక్వెరాతో మాట్లాడుతూ ఈ వివరాలు వెల్లడించారు. సల్మాన్ హీరోగా ప్రముఖ బాలీవుడ్ దర్శకుడి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీలో ఓ చిన్న పాత్రను తనకు ఆఫర్ చేశారని, ఓ సీన్లో భారత విదేశాంగ మంత్రిగా కనిపించాలని కోరారని చెప్పుకొచ్చారు. తాను ఈ పాత్రను చేసేందుకు ఉత్సాహపడినప్పటికీ ఓ మిత్రుడి సూచనతో వెనక్కితగ్గానన్నారు. నువ్వు విదేశాంగ మంత్రిగా పనిచేయాలని అనుకుంటే ఆ పాత్రను అంగీకరించవద్దని’ స్నేహితుడు సలహా ఇచ్చారన్నారు. కాగా అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్లు నటించిన అందాజ్ అప్నా అప్నాలో తాను కనిపించలేదని శశి థరూర్ స్పష్టం చేశారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాతే తనకు మూవీ ఆఫర్లు రావడం మొదలయ్యాయని, తాను యువకుడిగా, అందంగా ఉన్న సమయంలో ఈ ఆఫర్లు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. -
బీజేపీ పతనానికి నాంది : శశి థరూర్
సాక్షి, న్యూఢిల్లీ : మూడు కీలక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఘోర పరాజయం ఎదురవుతుందన్న సర్వే అంచనాల నేపథ్యంలో కాషాయ పార్టీ పతనానికి ఇది నాంది అని సీనియర్ కాంగ్రెస్ నేత శశి థరూర్ వ్యాఖ్యానించారు. రాజస్తాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించి అధికార పగ్గాలు చేపడుతుందని ఏబీపీ న్యూస్ సీ ఓటర్ సర్వే వెల్లడించిన విషయం తెలిసిందే. తాజా సర్వేతో కాంగ్రెస్ శ్రేణుల్లో నూతనోత్తేజం నెలకొంది. అయితే ఇదే సర్వే ప్రధాని పదవికి ఇప్పటికీ నరేంద్ర మోదీయే సరైన వ్యక్తని పెద్దసంఖ్యలో ప్రజలు అభిప్రాయపడుతున్నట్టు పేర్కొనడం గమనార్హం. కాగా రాజస్తాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌లో పాలక బీజేపీపై ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకతే కాంగ్రెస్ పార్టీకి కలిసివస్తున్నదని సర్వే పసిగట్టింది. -
క్షమాపణ ఎందుకు చెప్పాలన్న శశి థరూర్..
సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే భారత్‌ను హిందూ పాకిస్తాన్‌గా మారుస్తుందన్న తన వ్యాఖ్యలను సీనియర్ కాంగ్రెస్ నేత శశి థరూర్ సమర్ధించుకున్నారు. హిందూ రాజ్య భావన పట్ల బీజేపీకి విశ్వాసం లేకుంటే ఆ విషయం స్పష్టంచేయాలని ఆయన డిమాండ్ చేశారు. బీజేపీ సిద్ధాంతాన్ని తాను నేరుగా తన వ్యాఖ్యల్లో చెప్పానని స్పష్టం చేశారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తే ప్రజాస్వామిక రాజ్యాంగం మనం అర్ధం చేసుకున్న విధంగా ఉండదని, వారి ఇష్టానుసారం అందులోని అంశాలను మార్చివేస్తారని, దేశాన్ని హిందూ పాకిస్తాన్‌గా మారుస్తారని శశి థరూర్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపిన విషయం తెలిసిందే. థరూర్ తన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలన్న బీజేపీ డిమాండ్‌ను శశి థరూర్ తోసిపుచ్చారు. బీజేపీ, ఆరెస్సెస్‌ల మూల సిద్ధాంతాన్నే తాను ప్రస్తావించానని, హిందూ రాష్ట్ర భావనపై వారికి విశ్వాసం లేదని స్పష్టంగా ప్రకటిస్తే చర్చ ముగుస్తుందని అన్నారు. వారి సిద్ధాంతానికి అనుగుణంగా తాను వ్యాఖ్యానిస్తే క్షమాపణ చెప్పడం ఎందుకని ఆయన ప్రశ్నించారు. -
‘ఆయనకు పాకిస్తానీ గర్ల్‌ఫ్రెండ్స్ ఉన్నారు’
సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే భారత్ హిందూ పాకిస్తాన్‌గా తయారవుతుందని మాజీ కేంద్ర మంత్రి శశి థరూర్ చేసిన వ్యాఖ్యలనపై బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి స్పందించారు. శశిథరూర్‌కు మతిభ్రమించినట్టుగా ఉందని, ఆయనకు తక్షణం వైద్య సాయం అందించాలని ప్రధాని నరేంద్ర మోదీకి సుబ్రహ్మణ్య స్వామి గురువారం సూచించారు. అవసరమైతే శశిథరూర్‌ను చికిత్స నిమిత్తం మెంటల్ ఆస్పత్రికి తరలించాలని అన్నారు. థరూర్ వ్యాఖ్యలు ఆయన అసహనానికి అద్దం పడుతున్నాయని, పాక్‌పై అసలు ఆయనకు అంత ప్రేమ ఎందుకు అని ప్రశ్నించారు. ప్రధాని నరేంద్ర మోదీని అధికారం నుంచి తొలగించేందుకు సాయపడాలని పాక్ ప్రధానిని సైతం ఆయన కోరారన్నారు. శశిథరూర్‌కు పాకిస్తానీ గర్ల్‌ఫ్రెండ్స్ ఉన్నారని వారంతా ఐఎస్ఐ మనుషులని వ్యాఖ్యానించారు. థరూర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ తన వైఖరి వెల్లడించాలని డిమాండ్ చేశారు. మరోవైపు థరూర్ హిందూ పాకిస్తాన్ వ్యాఖ్యలను కేంద్ర మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోర్ సైతం తప్పుపట్టారు. -
ముందస్తు బెయిల్‌కు శశి థరూర్ అప్పీల్
సాక్షి, న్యూఢిల్లీ : సునందా పుష్కర్ హత్య కేసుకు సంబంధించి కాంగ్రెస్ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి శశి థరూర్ ముందస్తు బెయిల్ కోసం మంగళవారం ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసుకు సంబంధించి ఇటీవల ఢిల్లీ కోర్టు థరూర్‌ను నిందితుడిగా గుర్తిస్తూ జులై ఏడున విచారణకు హాజరు కావాల్సిందిగా సమన్లు జారీ చేసింది. అయితే తనపై ఆరోపణలు నిరాధారమైనవని, సునందా పుష్కర్ మృతితో తనకు సంబంధం లేదని శశి థరూర్ వాదిస్తున్నారు. ఢిల్లీ పోలీసులు సమర్పించిన 3000 పేజీల చార్జిషీట్లో సునందా పుష్కర్ హత్య కేసులో శశి థరూర్ ప్రమేయం ఉందని ఆయనను నిందితుడిగా పేర్కొంటూ థరూర్ భార్య పట్ల క్రూరంగా వ్యవహరించాడని ఆరోపించారు. ఈ కేసులో శశి థరూర్ ఇంట్లో పనిచేసే నారాయణ్ సింగ్ కీలక సాక్షిగా మారారు. కాగా 2014, జనవరి 17న సునందా పుష్కర్ ఢిల్లీలోని ఓ లగ్జరీ హోటల్ గదిలో విగతజీవిగా పడిఉండటాన్ని గుర్తించారు. అప్పట్లో ఈ కేసు దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. -
మోదీకి కాంగ్రెస్ నేత ప్రేమలేఖలు?
ఐక్యరాజ్యసమితిలో కూడా పనిచేసి వచ్చి.. కేంద్రమంత్రిగా ఉండి, పలు వివాదాలకు కేంద్ర బిందువుగా, కేరాఫ్ అడ్రస్‌గా చెప్పుకొనే శశి థరూర్.. త్వరలోనే పార్టీ మారబోతున్నారా? ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఆయన నుంచి ప్రేమలేఖలు వెళ్తున్నాయని కేరళ కాంగ్రెస్ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. ఈ వ్యవహారాన్ని శశి థరూర్ కూడా పరోక్షంగా బలపరిచారు. కాంగ్రెస్ రాజకీయాల్లో తననెప్పుడూ బయటివాడిగానే చూశారని ఆయన వాపోతున్నారు. తాను నరేంద్రమోదీని ప్రశంసించానని అంటున్నవాళ్లు తన వ్యాఖ్యలను అర్థం చేసుకోలేదని, అందువల్ల వాళ్ల విమర్శలపై స్పందించేది లేదని థరూర్ అంటున్నారు. రాజకీయాల్లోకి తాను చాలా ఆలస్యంగా వచ్చానని, అందుకే బహుశా వీటిలో సరిగా ఇమడలేకపోతున్నానేమోనని ఆయన వ్యాఖ్యానించారు. గాంధీజయంతి రోజున ప్రధాని నరేంద్ర మోదీ స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుడు అక్కడున్న తొమ్మిది మంది ప్రముఖుల్లో థరూర్ కూడా ఒకరు కావడం కేరళ కాంగ్రెస్‌లో తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ ఆహ్వానం వచ్చినందుకు తానెంతో గౌరవంగా ఫీలవుతున్నానని ఆయన అనడాన్ని కేరళ కాంగ్రెస్ తప్పుబట్టింది. ఆయన ప్రధానికి ప్రేమలేఖలు రాస్తున్నారని కూడా కేరళ కాంగ్రెస్ పత్రిక ఆరోపించింది. టీవీలలో వచ్చినవాళ్లందరి వద్దా తన నెంబరు ఉందని, వాళ్లు కావాలంటే తనకు నేరుగా ఫోన్ చేయచ్చు గానీ, అలా చేయకుండా బహిరంగ విమర్శలకు దిగారని, దాన్ని బట్టే వాళ్ల కోరిక ఏంటో తెలిసిపోతోందని థరూర్ వ్యాఖ్యానించారు.