సీనియర్ కాంగ్రెస్ నేత శశి థరూర్ (ఫైల్‌పోటో)
సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే భారత్‌ను హిందూ పాకిస్తాన్‌గా మారుస్తుందన్న తన వ్యాఖ్యలను సీనియర్ కాంగ్రెస్ నేత శశి థరూర్ సమర్ధించుకున్నారు. హిందూ రాజ్య భావన పట్ల బీజేపీకి విశ్వాసం లేకుంటే ఆ విషయం స్పష్టంచేయాలని ఆయన డిమాండ్ చేశారు. బీజేపీ సిద్ధాంతాన్ని తాను నేరుగా తన వ్యాఖ్యల్లో చెప్పానని స్పష్టం చేశారు.
2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తే ప్రజాస్వామిక రాజ్యాంగం మనం అర్ధం చేసుకున్న విధంగా ఉండదని, వారి ఇష్టానుసారం అందులోని అంశాలను మార్చివేస్తారని, దేశాన్ని హిందూ పాకిస్తాన్‌గా మారుస్తారని శశి థరూర్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపిన విషయం తెలిసిందే.
థరూర్ తన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలన్న బీజేపీ డిమాండ్‌ను శశి థరూర్ తోసిపుచ్చారు. బీజేపీ, ఆరెస్సెస్‌ల మూల సిద్ధాంతాన్నే తాను ప్రస్తావించానని, హిందూ రాష్ట్ర భావనపై వారికి విశ్వాసం లేదని స్పష్టంగా ప్రకటిస్తే చర్చ ముగుస్తుందని అన్నారు. వారి సిద్ధాంతానికి అనుగుణంగా తాను వ్యాఖ్యానిస్తే క్షమాపణ చెప్పడం ఎందుకని ఆయన ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment