సాక్షి, తిరువనంతపురం : ఈ సారి జరిగే లోక్‌సభ ఎన్నికలు..‘పాలిటిక్స్ ఆఫ్ ఫర్మామెన్స్..15 ఇయర్స్ ఆఫ్ నాన్ - పర్మార్మెన్స్’ మధ్య జరుగుతున్నాయంటూ కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి తిరువనంతపురం బీజేపీ లోక్‌సభ అభ్యర్ధి చంద్రశేఖర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తొలిసారి లోక్‌సభకు పోటీ చేస్తున్న చంద్రశేఖర్ ఎన్నికలపై మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తన ప్రత్యర్ధి, తిరువనంతపురం సిట్టింగ్ ఎంపీ కాంగ్రెస్ నేత శశి థరూర్‌పై విరుచుకు పడ్డారు. ఈ ఎన్నికలు ‘పనితీరు రాజకీయాలకు..15 సంవత్సరాల పనితీరు లేని రాజకీయాల మధ్య జరుగుతున్నాయని అన్నారు.
ఈ సందర్భంగా శశిథరూర్ ఇంగ్లీష్ వాక్చాతుర్యంపై సెటైర్లు వేశారు. ‘ఇది థరూర్, ఎన్‌డీఏల మధ్య జరిగే పోరాటం కాదు. ఇది కొంత వ్యక్తిత్వానికి సంబంధించినదని నేను అనుకోను. ఇంగ్లీష్ మాట్లాడే నైపుణ్యం గురించి లేదా మరేదైనా అని నేను అనుకోను. ప్రజలే డిసైడ్ చేస్తారు.
ఈ ఎన్నికలు
గెలుపు కూడా నాదేనంటూ.. ‘‘తిరువనంతపురం ప్రజలకు దీని గురించి బాగా తెలుసు. నేనుకూడా అదే నమ్ముతున్నాను. ఆ ఫలితం ఎన్నికల జయాపజయాల్ని నిర్ధేశించేలా ఉంటుంది. ఈ ఎన్నికల పోరు వ్యక్తుల మధ్య పోరుగా భావించడం లేదు. ఈ ఎన్నికలు గత 10ఏళ్లలో జరిగిన అభివృద్ది రాబోయే ఐదేళ్లలో కొనసాగించడమే’ అని పునరుద్ఘాటించారు.
నో విజన్
ఈ సందర్భంగా ప్రతిపక్షాలకు విజన్ లేదని చంద్రశేఖర్ ఆరోపించారు. ప్రతిపక్షం అంటే ‘అవినీతికి పాల్పడే రాజకీయ నాయకులు నరేంద్ర మోదీని ఓడించాలనే ఒకే ఒక్క లక్ష్యంతో కలిసి రావడమే’ అని వ్యాఖ్యానించారు. నా నియోజకవర్గ ప్రజలకు నేను ఎక్కడి వాడినో ఎన్నికల ఫలితాలు వచ్చాక తేలిపోతుందన్నారు. ఆ విషయం నేను చెప్పనవసరం లేదు. (మీడియాను ఉద్దేశిస్తూ) మీరు చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజలకు ఇది ఖచ్చితంగా తెలుసు’ అని చంద్రశేఖర్ అన్నారు.
తొలిసారి లోక్‌సభ ఎన్నికల బరిలో
కేంద్ర ఐటీశాఖ సహాయ మంత్రి, ప్రస్తుత రాజ్యసభ సభ్యుడిగా ఉన్న రాజీవ్ చంద్రశేఖర్‌ని తొలిసారి కేరళ రాజధాని తిరువనంతపురం లోకసభ స్థానం నుంచి బరిలోకి దించింది. ఇదే స్థానం నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ వరుసగా మూడు సార్లు ఎంపీగా విజయం సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment